బొలీవియా అధ్యక్షుడిగా ఎన్నికైన గౌరవనీయ రోడ్రిగో పాజ్ పెరీరాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"బొలీవియా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ రోడ్రిగో పాజ్ పెరీరా గారికి హృదయపూర్వక అభినందనలు. భారత్-బొలీవియా మధ్య సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలు చాలా కాలంగా మన పరస్పర ప్రయోజనకరమైన సహకారానికి మద్దతునిస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో మన ఉమ్మడి పురోగతి, శ్రేయస్సు కోసం ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసుకునేందుకు నేను ఎదురుచూస్తున్నాను.
@Rodrigo_PazP”
Warm congratulations, Mr. Rodrigo Paz Pereira, on your election as the President of Bolivia. Close and friendly ties between India and Bolivia have long underpinned our mutually beneficial cooperation. I look forward to deepening our partnership for shared progress and prosperity…
— Narendra Modi (@narendramodi) October 21, 2025


