ప్రముఖ గుజరాతీ గాయకుడు శ్రీ పురుషోత్తం ఉపాధ్యాయ్ కన్నుమూత పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని (గుజరాతీ భాషలో) పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘‘సుగం సంగీత్ మాధ్యమం ద్వారా ప్రపంచమంతటా గుజరాతీ భాష ను జవజీవాలతో నిలిపిన ప్రముఖ గాయకుడు శ్రీ పురుషోత్తం ఉపాధ్యాయ్ ఇక మన మధ్య లేరన్న వార్త విని తీవ్ర దిగ్భ్రాంతి చెందాను. ఇది కళా జగతిలో భర్తీ చేయలేని లోటు. ఆయన మధుర గళంలో స్వరాంకితమైన సంగీత కృతులు మన మదిలో సదా జీవించే ఉంటాయి. ఆయన ఆత్మకు శాంతి, సద్గతులు లభించాలని ప్రార్థిస్తూ, శోక సంతప్తులైన ఆయన కుటుంబానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి. ’’.
ગુજરાતી ભાષાને સુગમ સંગીત થકી વિશ્વભરમાં જીવંત રાખનારા સુપ્રસિદ્ધ સ્વરકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયના નિધનના સમાચારથી ઊંડો આઘાત અનુભવું છું. કલા જગત માટે આ એક ન પુરી શકાય તેવી ખોટ છે. તેમના મધુર અવાજમાં સ્વરાંકન સંગીત રચનાઓ હંમેશાં આપણા હૃદયમાં જીવંત રહેશે.
— Narendra Modi (@narendramodi) December 11, 2024
સદ્ગતના આત્માની શાંતિ માટે…