ఈ రోజు నుంచి ఢిల్లీలో జరగనున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్-2025కు క్రీడాకారులు, ప్రతినిధులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా స్వాగతించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
"ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్-2025ను ఢిల్లీలో నిర్వహించటం పట్ల భారతదేశం గర్వంగా ఉంది. పాల్గొనే వారందరికీ హృదయపూర్వక స్వాగతం, శుభాకాంక్షలు. ఈ టోర్నమెంట్ మానవ సంకల్పానికీ, స్ఫూర్తికీ చిహ్నంగా నిలుస్తోంది. ఈ టోర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా మరింత సమ్మిళితమైన, శక్తిమంతమైన క్రీడా సంస్కృతిని పెంచాలని కోరుకుంటున్నాను"
India is proud to be hosting the World Para Athletics Championships 2025 in Delhi, which commences today. A warm welcome and best wishes to all participants. This tournament celebrates human determination and spirit. May this tournament inspire a more inclusive and vibrant… pic.twitter.com/SRa6p2z0sO
— Narendra Modi (@narendramodi) September 27, 2025


