PM to visit Rajasthan, inaugurate several major highway projects
PM Modi to visit the Pratap Gaurav Kendra in Udaipur

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు రాజ‌స్థాన్ లోని ఉద‌య్‌పుర్ లో ప‌ర్య‌టించ‌నున్నారు.

ఆయ‌న అనేక ప్ర‌ధాన హైవే ప్రాజెక్టుల‌కు పునాది రాయి వేస్తారు. ఈ ప‌థ‌కాల మొత్తం వ్య‌యం 15,000 కోట్ల రూపాయ‌ల‌కు మించి ఉండగలద‌ని అంచ‌నా.

ప్రారంభోత్స‌వం జ‌రుపుకోనున్న ప‌థ‌కాల‌లో కోటా వ‌ద్ద చంబ‌ల్ న‌ది మీద 6 దారుల లోహపు గొలుసులతో కూడిన వంతెన; ఎన్‌హెచ్‌-8 లో గోమ‌తి చౌరాహా - ఉద‌య్‌పుర్ సెక్ష‌న్‌ను 4 దారుల అభివృద్ధిప‌ర‌చ‌డం మరియు ఎన్‌హెచ్‌-758 లో రాజ్‌స‌మంద్ - భీల్‌వాడా సెక్ష‌న్‌ను 4 దారుల మార్గంగా అభివృద్ధిప‌ర‌చ‌డం వంటివి భాగంగా ఉన్నాయి. శంకుస్థాపన జరుగనున్న ముఖ్యమైన పథకాలలో జయ్ పుర్ రింగ్ రోడ్డు కూడా ఒకటిగా ఉంది.

అలాగే, ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ సంద‌ర్భంగా స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు.

ప్ర‌ధాన మంత్రి ఆ త‌రువాత ఉద‌య్‌పుర్ లో ప్ర‌తాప్ గౌర‌వ్ కేంద్రాన్ని సంద‌ర్శిస్తారు. ఈ కేంద్రం మేవాడ్ రాజ్యానికి చెందిన ప్ర‌సిద్ధ రాజు మ‌హారాణా ప్ర‌తాప్ జీవితాన్ని గురించి, శౌర్యం గురించి, ఆయ‌న సాధించిన విజ‌యాలను గురించి వివిధ ప్ర‌ద‌ర్శిత వ‌స్తువుల ద్వారా చాటిచెప్తుంది.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Water conservation in India: The community as custodian

Media Coverage

Water conservation in India: The community as custodian
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 మార్చి 2026
March 21, 2026

Empowering Bharat Holistically: Health, Finance, Heritage & Export Growth Under the Leadership of PM Modi