ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం మార్చి 10వ తేదీన గాజియాబాద్ లో జరిగే కేంద్రీయ పారిశ్రామిక భద్రత బలగాల (సిఐఎస్ఎఫ్) 50వ స్థాపన దినోత్సవాని కి హాజరు కానున్నారు.
గాజియాబాద్ లోని ఇందిరాపురం లో గల 5వ బెటాలియన్ క్యాంపు లో ఏర్పాటయ్యే ఒక కార్యక్రమం లో కేంద్రీయ పారిశ్రామిక భద్రతా బలగాల కవాతు ను ప్రధాన మంత్రి పరిశీలించనున్నారు. విశిష్ట మరియు ప్రతిభావంతమైన సేవల కు ఇచ్చేటటువంటి పోలీస్ మరియు ఫైర్ సర్వీస్ పతకాల ను కూడా ఆయన ప్రదానం చేయనున్నారు.
అమరవీరుల స్మారకం వద్ద ప్రధాన మంత్రి పూల హారాన్ని సమర్పిస్తారు. ఆ తరువాత సిఐఎస్ఎఫ్ సిబ్బంది ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.


