ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 8 సంవత్సరాల సేవ, సుపరిపాలన మరియు పేద ప్రజల సంక్షేమం తాలూకు కీలకమైనటువంటి అంశాల ను గురించి narendramodi.in లో మరియు Namo App లో శేర్ చేశారు.

ప్రధాన మంత్రి MyGov నుంచి గత 8 సంవత్సరాల ప్రధాన కార్యక్రమాల ను మరియు కార్యసిద్ధి ని కళ్ళ కు కట్టేటటువంటి ఒక మాలిక ను కూడా శేర్ చేశారు.

ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో -

‘‘కిందటి 8 సంవత్సరాలు ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడాని కి సంబంధించినవి. మేం సేవ, సుపరిపాలన మరియు పేదల సంక్షేమం.. వీటిని అనుసరించాలి అనే మా ప్రయాణాన్ని పూర్తి చేయడాని కి కంకణం కట్టుకొన్నాం. NaMo App లో ప్రస్తావించిన ‘వికాస యాత్ర’ భాగం మిమ్మల్ని ఈ అభివృద్ధి యాత్ర గుండా తీసుకు పోతుంది. #8YearsOfSeva

NaMo App లో ఒక క్విజ్, పదాన్ని వెతకడం, బొమ్మల విభాగాన్ని గుర్తు పట్టడం, ఇంకా అనేకమైనటువంటి కొత్త కొత్త అంశాల తో కూడిన #8YearsOfSeva అనే వదలి వేయడాని కి వీలు లేని అటువంటి ఒక విభాగం ఉంది. నేను మీ అందరి కి, ప్రత్యేకించి నా యువ మిత్రుల కు, దీనిని ఒకసారి చూడవలసింది గా విజ్ఞప్తి చేస్తున్నాను.

https://8years.narendramodi.in

‘‘గడచిన 8 సంవత్సరాలు ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడాని కి సంబంధించినవి గా ఉన్నాయి. ఆ కాలం లో మా సంకల్పం ఏమిటి అంటే అది- సేవ చేయడం, సుపరిపాలన ను అందించడం మరియు పేద ప్రజల సంక్షేమం అనేదే. NaMo App లోని వికాస యాత్ర విభాగం లో మీరు ప్రగతి యొక్క ఈ పూర్తి యాత్ర ను గురించి తెలుసుకొంటారు.

#8YearsOfSeva

NaMo App లో #8YearsOfSeva తో జతపడిన ఒక ఆసక్తిదాయకమైనటువంటి విభాగం ఉంది. దీనిలో మీరు క్విజ్, వర్డ్ సర్చ్, గెస్ ద ఇమేజ్ సెక్షన్ వంటి అనేక వినూత్నమైన పద్ధతుల లో దేశం యొక్క ప్రగతి ప్రస్థానం తో ముడిపడవచ్చును. నేను మీ అందరిని కోరేది ఏమిటి అంటే మీరు ఒకసారి దీనిని తప్పక చూడాలి అనేదే.’’

‘‘మేము సేవ, సుశాసన్, ఇంకా గరీబ్ కళ్యాణ్ సిద్ధాంతాల తో కృషి చేస్తున్నాం. గత 8 సంవత్సరాలు గా అమలుపరచినటువంటి ప్రధానమైన కార్యక్రమాలు మరియు కార్యసాధనల లో కొన్నిటిని ఇక్కడ తెలుసుకోగలరు. #8YearsOfSeva ’’ అని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
In Photos: PM Narendra Modi Prays At Kashi Vishwanath, Holds Trishul-Damru

Media Coverage

In Photos: PM Narendra Modi Prays At Kashi Vishwanath, Holds Trishul-Damru
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 30 ఏప్రిల్ 2026
April 30, 2026

Investment Magnet India: PLI Triumphs, FTA Deals & Defence Milestones — How PM Modi’s Vision is Reshaping the Nation