Confident that Winter Session will be productive: PM
Hope there would be constructive debates and innovative solutions would be found to address the nation's problems: PM Modi

మిత్రులారా మీకు ఇదే శుభోదయం,

సాధార‌ణంగా దీపావ‌ళితోనే శీత‌కాల స‌మావేశాలు మొద‌ల‌వుతాయి. కానీ, భూతాపం మ‌రియు జ‌ల‌ వాయు ప‌రివ‌ర్త‌న ప్ర‌భావం కారణంగా శీత‌లత్వం యొక్క ప్రాబల్యం ఇంకా మ‌న అనుభ‌వం లోకి రావ‌డం లేదు.

ఏమైనప్పటికీ, మన శీత‌కాల స‌మావేశాలు ఆరంభ‌మ‌వుతున్నాయి. మ‌రి 2017 లో మొద‌లై, 2018 లోనూ కొన‌సాగ‌నున్న ఈ శీత‌కాల స‌మావేశాలు విశాల ప్ర‌భావం చూప‌గ‌ల ప‌లు ముఖ్య‌మైన ప్ర‌భుత్వ సంబంధ అంశాలు పార్ల‌మెంటు ముందుకు తీసుకురాగ‌ల‌మ‌న్న విశ్వాసం నాకుంది.

ఈ సంద‌ర్భంగా మంచి వాదనలు.. అవి కూడాను స‌కారాత్మ‌క‌మైన వాదోప‌వాదాలు.. కొత్త కొత్త సూచ‌న‌ల‌తో కూడిన చ‌ర్చ‌లు సాగాలి; అలా జ‌రిగిన‌ప్పుడే, దేశ ప్ర‌యోజ‌నం కోసం పార్ల‌మెంటు స‌మ‌యాన్ని స‌ముచిత రీతిన వినియోగించిన‌ట్లు కాగలదు.

నిన్న కూడా మేం ఒక ‘అఖిల‌ప‌క్ష స‌మావేశా’న్ని నిర్వ‌హించుకొన్నాం. అందులో భాగంగా- దేశాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి విధంగా- పార్ల‌మెంటు స‌మావేశాల‌ను స‌రైన రీతిలో వినియోగించుకోవాల‌న్న ఉమ్మ‌డి గ‌ళం విన‌వ‌చ్చింది.

స‌భ క‌నుక ఒక స‌కారాత్మ‌క‌మైన ధోర‌ణిలో ప‌నిచేస్తే- దేశానికి లాభం చేకూరుతుంద‌ని, ప్ర‌జాస్వామ్యం బ‌లోపేతం అవుతుంద‌ని, మ‌రియు సామాన్య ప్ర‌జానీకం యొక్క ఆశ‌లు, ఆకాంక్ష‌లు నెర‌వేర‌డం కోసం ఒక కొత్త విశ్వాసం ఏర్ప‌డుతుంద‌న్న- భావ‌న కూడా నాలో వ్యక్తమవుతూ ఉంది. మీకంద‌రికీ అనేక ధ‌న్య‌వాదాలు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
FPOs’ sales rise via commodity exchanges in FY26

Media Coverage

FPOs’ sales rise via commodity exchanges in FY26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 మే 2026
May 11, 2026

Society Above Politics: PM Modi’s Call for a Stronger, Self-Reliant & Sacred Bharat