PM reviews preparations for launch of Ayushman Bharat 
Ayushman Bharat will cover over 10 crore poor and vulnerable families providing coverage up to 5 lakh rupees per family per year

ఇటీవ‌ల కేంద్ర బ‌డ్జెట్ లో ఆయుష్మాన్ భార‌త్ పేరుతో ప్ర‌క‌టించిన జాతీయ ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ ప‌థ‌కాన్ని ఆరంభించే దిశ‌గా సాగుతున్నటువంటి స‌న్నాహాల తాలూకు పురోగ‌తిని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమ‌వారం నాడు స‌మీక్షించారు.

రెండు గంట‌ల‌కు పైగా కొన‌సాగిన ఒక ఉన్న‌త స్థాయి స‌మావేశంలో, ఆరోగ్యం మ‌రియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పిఎమ్ఒ మ‌రియు నీతి ఆయోగ్ ల‌కు చెందిన అగ్ర స్థానాల‌లోని అధికారులు పాల్గొని ఈ పథకాన్ని అమలుపరచేందుకు మార్గాన్ని సుగమం చేసేందుకు సంబంధించి ఇంత‌వ‌ర‌కు చేప‌ట్టిన ప‌నుల‌ను గురించి ప్ర‌ధాన మంత్రి కి వివరించారు.

ఈ ప‌థ‌కం ఒక్కొక్క కుటుంబానికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల మేర‌కు ర‌క్ష‌ణ‌ ను అందించ‌నుంది. పేద‌లు మ‌రియు దుర్బల కుటుంబాలు కలుపుకొని మొత్తంమీద 10 కోట్ల‌ మందికి పైగా ర‌క్ష‌ణ‌ను క‌ల్పించడం ల‌క్ష్యంగా ఈ ప‌థ‌కాన్ని తీసుకురానున్నారు. ఈ పథకం యొక్క ల‌బ్దిదారులు భార‌త‌దేశమంత‌టా న‌గ‌దు ర‌హిత ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌గ‌లుగుతారు.

ఆరోగ్య కేంద్రాలు మ‌రియు వెల్ నెస్ సెంటర్ ల ద్వారా స‌మ‌గ్ర‌ ప్రాథ‌మిక ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ను అందించేందుకు తగ్గ స‌న్నాహాల‌ను సైతం ప్ర‌ధాన మంత్రి స‌మీక్షించారు.

స‌మాజంలో పేద‌లు మ‌రియు బ‌ల‌హీన వ‌ర్గాల వారికి మేలు చేయ‌గ‌ల ఒక చ‌క్క‌ని రూపురేఖలు కలిగినటువంటి ఒక ల‌క్షిత ప‌థ‌కం దిశ‌గా కృషి చేయ‌వ‌ల‌సింద‌ంటూ ప్ర‌ధాన మంత్రి ఈ సందర్భంగా అధికారుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA

Media Coverage

Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 14 డిసెంబర్ 2025
December 14, 2025

Empowering Every Indian: PM Modi's Inclusive Path to Prosperity