ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెయింట్ పీటర్స్ బర్గ్ లోని దాత్సన్ గుంజెచొయ్ నీ బౌద్ధ మందిరం ప్రధాన పురోహితుడు జంపా డోనర్ బుదా బల్జెవిచ్ బద్మయెవ్ కు ఉర్గా కంజుర్ యొక్క 100 సంపుటాలను ఈ రోజు బహూకరించారు.
టిబెట్ కు చెందిన కంజుర్ యొక్క ఉర్గా సంచిక 1955 వరకు ఎవ్వరికీ తెలియకుండానే ఉండిపోయింది. ఆచార్య రఘు వీర ఈ గ్రంథం యొక్క 104 సంపుటాలతో కూడిన పూర్తి సముదాయాన్ని భారతదేశానికి 1955లో తీసుకువచ్చారు. ఈ సంపుటాలలో ఒక సంపుటం నిండా గ్రంథ సూచీపత్రమే విస్తరించివుంది. అరుదైనటువంటి ఈ గ్రంథాన్ని ఆయనకు మంగోలియా ప్రజా గణతంత్రం ప్రధాని కానుకగా ఇచ్చారు.
ఈ కంజుర్ ను మంగోలియా యొక్క కడపటి జీబ్ చుండంపా ప్రాపకంలో 1908 నుండి 1920 వరకు సవరించి, సంపాదకత్వం నెరపి, దారులేఖనం చేశారు. దీనిని దెర్జేతోను, రెండు చైనా భాషా సంచికలు (Rgya-par-mag Uis) తో కలపడం జరిగింది. ఇందులో పాత Hphan-than-ma కేటలాగ్ పై ఆధారపడ్డ Tshal-pa Kanjur యొక్క క్రమం మార్పేమీ లేకుండా చోటుచేసుకొంది. దీని పరిమాణం పరిచితమైనటువంటి దారు గ్రంథ సంచికల కన్నా తక్కువగా (35x25 సెం.మీ.) ఉంది.
PM presents Urga Kanjur to Jampa Donor, Buda Balzheivich Badmayev, Head Priest, Datsan Gunzechoinei Buddhist Temple, St Petersburg. pic.twitter.com/TINSiWKCDH
— PMO India (@PMOIndia) June 2, 2017


