నేడు దీపావళి పండుగ ను పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేదార్‌నాథ్ ను సందర్శించారు.

చారిత్రక కేదార్‌నాథ్ ఆలయం లో ప్రార్థనల లో ఆయన పాలుపంచుకొన్నారు. పునర్ నిర్మాణ పనులు పెద్ద ఎత్తున సాగుతున్న ఆలయ ఆవరణ అంతటా ఆయన కలియతిరుగుతూ సదరు పనులను పరిశీలించారు.

పనులలో చోటు చేసుకొన్న పురోగతి ని సీనియర్ అధికారులు ఆయన కు వివరించారు.

ఆలయ ప్రాంగణం లో ప్రజానీకం తో ఆయన కొద్ది సేపు ముచ్చటించారు.

2013వ సంవత్సరం లో పెద్ద ఎత్తున వరదలు వచ్చి కొండ చరియలు విరిగిపడి దెబ్బతిన్నటువంటి కేదార్‌నాథ్ ఆలయం ఆవరణ లో ప్రస్తుతం పునర్ నిర్మాణ పనులు, అభివృద్ధి పనులు భారీ ఎత్తు న జరుగుతున్నాయి.



बाबा केदारनाथ के दर्शन का सौभाग्य पाकर अभिभूत हूं।
— Narendra Modi (@narendramodi) November 7, 2018
मैंने महादेव से देश की निरंतर प्रगति और सभी देशवासियों के सुख, शांति और समृद्धि की कामना की है।
जय बाबा केदारनाथ ! pic.twitter.com/IlyPJ7pcsi


