షేర్ చేయండి
 
Comments
Technology is the bridge to achieve ‘Sabka Saath Sabka Vikas’: PM
Challenge of technology, when converted into opportunity, transformed ‘Dakiya’ into ‘Bank Babu’: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘‘బ్రిజిట‌ల్ నేశ‌న్’’ గ్రంథాన్ని న్యూ ఢిల్లీ లోని నెంబ‌ర్ 7, లోక్ క‌ళ్యాణ్ మార్గ్ లో నిర్వ‌హించ‌బ‌డిన ఒక కార్య‌క్ర‌మం లో ఆవిష్క‌రించి ఆ పుస్త‌కం ఒకటో ప్ర‌తి ని శ్రీ ర‌త‌న్ టాటా కు అంద‌జేశారు.  శ్రీ ఎన్‌. చంద్ర‌శేఖ‌ర‌న్, కుమారి రూప పురుషోత్త‌మ్ లు ఈ పుస్త‌కాన్ని రచించారు.  

సాంకేతిక విజ్ఞానం:   ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ ను సాధించడానికి ఒక సేతువు వంటిది

స‌భికుల‌ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఒక దూరదర్శి గ్రంథాన్ని లిఖించినందుకు గాను రచయితల ను మెచ్చుకొన్నారు. ఈ గ్రంథం లో ఆశావాదం, స‌కారాత్మ‌క‌త నిండి ఉండటం తో పాటు సాంకేతిక విజ్ఞానం యొక్క ప్రాముఖ్య‌ాన్ని ఈ గ్రంథం లోతు గా వెల్లడి చేస్తుందన్నారు.  సాంకేతిక విజ్ఞానం భార‌త‌దేశం లోని ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల జీవితాల లో సకారాత్మ‌మైన రీతి లో ప‌రివ‌ర్త‌న ను తీసుకు వస్తున్నటువంటి కాలం లో ఈ గ్రంథం వెలువ‌డుతోంద‌ని ఆయ‌న అన్నారు.

సాంకేతిక విజ్ఞానాన్ని ఒక విభ‌జ‌న కార‌కం గా గాక ఒక సేతువు గా అర్థం చేసుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.  సాంకేతిక విజ్ఞానం ‘స‌బ్ కా సాథ్‌, స‌బ్ కా వికాస్’ను తీసుకొని రావటం కోసం ఆకాంక్ష‌ల కు మ‌రియు కార్య‌సాధ‌న కు, డిమాండు కు మ‌రియు సేవ‌ ల ప్రదానాని కి, ప్ర‌భుత్వాని కి మ‌రియు పాల‌న మ‌ధ్య ఒక సేతువు మాదిరి గా ఉంటుందని కూడా ఆయ‌న అన్నారు.  శ‌ర వేగం గా ఎదుగుతున్న ఆకాంక్ష‌భ‌రిత భార‌త‌దేశాని కి స‌కారాత్మ‌క‌త‌, సృజ‌న‌శీల‌త్వం ల‌తో పాటు నిర్మాణాత్మ‌క‌మైన ఆలోచ‌న‌ల స‌ర‌ళి ఎంతో అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న చెప్పారు.  మాన‌వుల అభిమతాల‌ కు మ‌రియు కృత్రిమ మేధస్సు కు మ‌ధ్య ఒక సేతువు ను నిర్మించవలసిన అవ‌స‌రం ఉంద‌ని కూడా ఆయ‌న ఉద్ఘాటించారు.


సాంకేతిక విజ్ఞానం ద్వారా పాల‌న‌:   గ‌త అయిదు సంవ‌త్స‌రాల లో సాగిన ప్ర‌యాణం

సంస్క‌రించి, మార్పు తెస్తూ, ప‌ని చేయ‌టం కోసం ప్ర‌భుత్వ ప‌థ‌కాల లో ఒక కీల‌క‌మైన అంశం గా సాంకేతిక విజ్ఞానం ఏ విధం గా త‌న పాత్ర‌ ను పోషించిందీ ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.  ల‌క్ష‌లాది మ‌హిళ‌ల మ‌నుగ‌డ లో ప‌రివ‌ర్త‌న ను తీసుకువ‌చ్చినటువంటి ఉజ్జ్వ‌ల యోజ‌న ను వాస్త‌వ కాల ప్రాతిప‌దిక‌ న ప‌ర్య‌వేక్షించ‌డం లో డిజిట‌ల్ మ్యాపింగ్, డేటా ఇంటెలిజెన్స్ లను వినియోగించుకోవటాన్ని గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు.  జ‌న్ ధ‌న్ యోజ‌న‌, ఇంకా ఆయుష్మాన్ భార‌త్ వంటి ప‌థ‌కాల ద్వారా ప్ర‌జ‌ల కు సాధికారిత ను క‌ల్పించ‌డం లో సాంకేతిక విజ్ఞానం ఏ విధం గా స‌హాయ‌కారి అయిందీ కూడా ఆయ‌న వివ‌రించారు.

ప్ర‌భుత్వ విభాగాల న‌డుమ నెల‌కొన్న అడ్డుగోడ‌ల‌ ను తొల‌గించ‌డం కోసం త‌న ప్ర‌భుత్వం సాంకేతిక విజ్ఞానాన్ని ఏ విధం గా ఉప‌యోగించుకొన్న‌దీ ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.  గ‌వ‌ర్న‌మెంట్ ఇ-మార్కెట్ (జిఇఎమ్‌) వంటి నూత‌న ఆలోచ‌న‌ ల ద్వారా డిమాండు కు మ‌రియు స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ కు మ‌ధ్య ఒక సేతువు ను నిర్మించడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  దేశం లో మ‌రీ ముఖ్యం గా రెండో అంచె నగరాలు, మూడో అంచె న‌గ‌రాల లో స్టార్ట్‌-అప్ వ్య‌వ‌స్థ ను ఏర్పాటు చేయ‌డం లో సాంకేతిక విజ్ఞానాన్ని ఉప‌యోగించడ‌మైంది, దీనితో స్టార్ట్ అప్ లతో కూడినటువంటి ఒక నూతన వ్యవస్థ వికసించిందని ఆయ‌న వివ‌రించారు.

సాంకేతిక విజ్ఞానం రువ్వేట‌టువంటి స‌వాళ్ళ ను అవ‌కాశాలుగా మార్చుకోవ‌ల‌సిన అవ‌స‌రాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి చెప్తూ, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ స్థాపన ను ఒక ఉదాహ‌ర‌ణ గా వివ‌రించారు.  సాంకేతిక విజ్ఞానం యావ‌త్తు త‌పాలా సంస్థ లో తీసుకువ‌చ్చినటువంటి మార్పు ను గురించి చెప్తూ, ఈ మార్పు సాంకేతిక‌త ముమ్మ‌ర స్థాయి లో ఉండే బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ ఏర్పాటు కు బాట వేసిన‌ట్లు, దీని ద్వారా ‘డాకియా’ను ‘బ్యాంకు ఉద్యోగి’గా మార్పు చేసినట్లు, పోస్ట‌ల్ బ్యాంక్ ద్వారా ల‌క్ష‌ల మంది కి ప్ర‌యోజ‌నం చేకూరిన‌ట్లు ఆయన తెలిపారు.

ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు మ‌రియు ప్ర‌సార మాధ్య‌మాల ప్ర‌ముఖుల హాజ‌రు

ఈ కార్య‌క్ర‌మాని కి పీపుల్స్ రిప‌బ్లిక్ ఆఫ్ చైనా, గ్రేట్ బ్రిట‌న్‌, యుఎస్ రాయ‌బారుల తో స‌హా దౌత్య కార్యాల‌యాల సిబ్బంది హాజ‌రు అయ్యారు.  భార‌త ప్ర‌భుత్వ వివిధ మంత్రిత్వ శాఖ ల కార్య‌ద‌ర్శులు,  సిఐఐ, ఎఫ్ఐసిసిఐ (‘ఫిక్కీ’), ఇంకా ఎన్ఎఎస్ఎస్ సిఒఎమ్ (‘నాస్ కామ్’)ల వంటి ప‌రిశ్ర‌మ సంఘాల ప్ర‌తినిధులు, ర‌జ‌త్ శ‌ర్మ‌, నవికా కుమార్‌, రాజ్‌ క‌మ‌ల్ ఝా, సుధీర్ చౌధరీ, స్మితా ప్ర‌కాశ్ లు స‌హా ప్ర‌సార మాధ్య‌మాని కి చెందిన ప్ర‌ముఖులు ప‌లువురి తో పాటు టాటా గ్రూపు స‌భ్యులు కూడా ఈ కార్య‌క్ర‌మం లో పాలు పంచుకున్నారు.

గ్రంథం గురించి

ఈ పుస్త‌కం ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు ముడిప‌డినటువంటి ఒక వ్య‌వ‌స్థ లో మాన‌వులు మ‌రియు సాంకేతిక విజ్ఞానం క‌ల‌సి మెల‌సి ఉండేటటువంటి ఒక భ‌విష్యత్ దార్శ‌నిక‌త ను ఆవిష్క‌రించింది.  సాంకేతిక విజ్ఞానాన్ని మ‌నుష్య శ్ర‌మ కు బ‌దులు గా భావించ‌డం క‌న్నా, భార‌త‌దేశం దీని ని మ‌రిన్ని ఉద్యోగాల ను సృష్టించేందుకు ఒక సాధ‌నం గా వినియోగించుకొనేందుకు ఆస్కారం ఉంద‌న్న తర్కాన్ని ఈ పుస్త‌కం ప్రతిపాదిస్తుంది.   ఆకాంక్ష‌లు మ‌రియు కార్య‌సాధ‌న‌ల న‌డుమ ఒక సేతువు గా అధునాత‌న‌మైన డిజిట‌ల్ ప‌రిక‌రాల ను ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని, ఈ ఉద్దేశ్యం తోనే ‘బ్రిజిట‌ల్’ అనే ప‌దాన్ని కూర్చడం జరిగింద‌ని ఈ పుస్త‌కం తెలియజేస్తుంది.

Click here to read full text speech

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
What is PM Modi's role in Union Budget? FM Nirmala Sitharaman reveals

Media Coverage

What is PM Modi's role in Union Budget? FM Nirmala Sitharaman reveals
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 ఫెబ్రవరి 2023
February 05, 2023
షేర్ చేయండి
 
Comments

Citizens Take Pride in PM Modi’s Continued Global Popularity

Modi Govt’s Economic Policies Instilling Confidence and Strength in the New India