షేర్ చేయండి
 
Comments
జాతీయ పురోగతికి కొన్ని పేర్లు మాత్రమే దోహదపడ్డాయని భావించే కొంతమంది ఉన్నారు. వారు ఆ కొద్ది పేర్లను మాత్రమే వినాలని మరియు ఇతరులను విస్మరించాలని కోరుకుంటారు: ప్రధాని
ఈ రోజు మనం దేశం కోసం జీవించాలి మరియు మన స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న భారతదేశాన్ని నిర్మించాలి: ప్రధాని మోదీ
భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి మా సమిష్టి ప్రయత్నం చేద్దాం: ప్రధాని మోదీ
మన దేశంలో అవినీతికి చోటు లేదు. అవినీతికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది: ప్రధాని మోదీ

పార్లమెంట్ లో రాష్ట్రపతి చేసిన ప్రసంగాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ లోక్ సభ లో నేడు సమాధానమిచ్చారు. సభ లో సభ్యుల కు, ప్రత్యేకించి పార్లమెంట్ సభ్యులు గా మొదటి సారి ఎన్నికైన వారి కి వారు చర్చ లో పాలు పంచుకొన్నందుకు గాను ఆయన ధన్యవాదాలు తెలిపారు. మిలియన్ ల కొద్దీ భారతీయులు కలలు గన్న ఒక ‘న్యూ ఇండియా’ రూపురేఖల ను రాష్ట్రపతి ప్రసంగం అభివర్ణించింది అని కూడా ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

2019 లోక్ సభ ఎన్నికలు వెలువరించిన బలమైనటువంటి ప్రజా తీర్పు ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, భారతదేశ ప్రజానీకం ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని, దాని పనితీరు ను అంచనా వేసిన అనంతరం, మరో మారు ఎన్నుకొన్నారు అన్నారు.

‘‘2019 లోక్ సభ ఎన్నికలు భారతదేశ ప్రజలు దేశం యొక్క మంచి ని గురించి ఆలోచిస్తున్నారని చాటాయి. ఈ స్ఫూర్తి అపురూపం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. 130 కోట్ల మంది భారతీయుల కు సేవలను అందించేందుకు అవకాశాన్ని దక్కించుకోవడం, అలాగే పౌరుల జీవితాల లో ఒక సకారాత్మకమైనటువంటి తేడా ను తీసుకువచ్చిన పనుల ను చేయడం అనేవి సంతృప్తికరం గా ఉన్నాయి అని కూడా ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం యొక్క దార్శనికత ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావిస్తూ, ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్ల, ఆధునిక మౌలిక సదుపాయాల పట్ల నమ్మకం పెట్టుకొంది అన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పథం నుండి ఎన్నడూ మళ్లడం గాని, అభివృద్ధి కేంద్రిత కార్యక్రమాల ను నీరసపరచడం గాని చేయలేదు అని ఆయన చెప్పారు. ‘‘దేశం పురోగమించడం, భారతదేశం లో ప్రతి ఒక్కరి కి సాధికారిత ను కల్పించడం మరియు మన దేశం ఆధునిక మౌలిక సదుపాయాల ను కలిగివుండటం ముఖ్యం గా ఉన్నాయి’’ అని ప్రధాన మంత్రి వివరించారు.

దేశం లోని ప్రతి ఒక్కరు, ఇంకా ప్రతి ఒక్కటి భారతదేశ పురోగతి దిశ గా తోడ్పాటు ను అందించినట్లు తన ప్రభుత్వం నమ్ముతోంది అని ప్రధాన మంత్రి తెలిపారు. ఆత్యయిక స్థితి విధించిన అనంతరం కమ్ముకొన్న చీకటి రోజుల ను గురించి కూడా ఆయన సభ కు గుర్తుకు తెచ్చారు.

గాంధీ మహాత్ముని 150వ వార్షికోత్సవం, ఇంకా భారతదేశ స్వాతంత్ర్య సముపార్జన కు 75 సంవత్సరాలు.. ఇవి భారతదేశ చరిత్ర లో మైలురాయి వంటి సందర్భాలు అని ప్రధాన మంత్రి చెప్తూ, వీటి ని గొప్ప ఉత్సాహం తో జరుపుకోవలసిందిగా ప్రతి ఒక్కరి కి విజ్ఞప్తి చేశారు. మన స్వాతంత్ర్య యోధులు కలగన్నటువంటి భారతదేశాన్ని నిర్మించడం కోసం మరియు దేశం కోసం జీవించడం కోసం దేశ పౌరులు పాటు పడాలి అని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం బాధ్యతల ను స్వీకరించిన వారాల వ్యవధి లో అనేక ప్రజానుకూల నిర్ణయాలను తీసుకొన్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు. ఆ నిర్ణయాలు రైతుల కు, వ్యాపారుల కు, యువజనుల తో పాటు సమాజం లోని ఇతర వేరు వేరు వర్గాల వారికి ఎనలేని మేలు ను చేకూర్చాయి అని ఆయన అన్నారు. దేశ ప్రజల కు చేసిన వాగ్దానాల ను నెరవేర్చడాన్ని ప్రభుత్వం ఆరంభించినట్లు కూడా ఆయన తెలిపారు.

జల సంరక్షణ యొక్క ప్రాముఖ్యాన్ని శ్రీ మోదీ ప్రస్తావిస్తూ, ‘జల శక్తి మంత్రిత్వ శాఖ’ ను ఏర్పాటు చేయడం సహా కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యల ను గురించి వెల్లడించారు. నీటి ని ఆదా చేసేందుకు నిర్దిష్టమైనటువంటి చర్యలను చేపట్టాలని ప్రజల ను ఆయన కోరారు. జల సంక్షోభం అనేది పేదల ను మరియు మహిళల ను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్క ఇంటి కి జలాన్ని తీసుకు వచ్చే కార్యభారాన్ని వహించే దిశ గా ప్రభుత్వం వచనబద్ధురాలు అయివున్నట్లు ఆయన పునరుద్ఘాటించారు.

భారతదేశాన్ని అయిదు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ గా తీర్చిదిద్దడం కోసం ఉమ్మడి కృషి అవసరం అని ప్రధాన మంత్రి అన్నారు. పర్యటన రంగాన్ని ప్రోత్సహించడం మరియు పర్యటన రంగ సంబంధిత మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఆర్థిక సుసంపన్నత కు చక్కగా దోహద పడుతాయి అని కూడా ఆయన చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా’ యొక్క, ఇంకా నైపుణ్యాల అభివృద్ధి యొక్క ప్రాముఖ్యాన్ని గురించి కూడా ఆయన ఉదాహరించారు.

దేశం లో అవినీతి కి ఎంతమాత్రం తావు లేదు అంటూ శ్రీ మోదీ స్పష్టం చేశారు. ప్రభుత్వం అవినీతి కి వ్యతిరేకం గా పోరాడుతూనే ఉంటుంది అని ఆయన అన్నారు. ప్రభుత్వం తన పౌరులందరి కి జీవన సౌలభ్యం దక్కేటట్టు చూసేందుకు కంకణం కట్టుకుంది అని ఆయన చెప్తూ, ఒక ‘న్యూ ఇండియా’ను ఆవిష్కరించే దిశ గా పనిచేయాలంటూ ప్రతి ఒక్కరి కి విజ్ఞప్తి చేశారు.

 

 

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Forex reserves up by USD 1.492 billion to USD 641 billion

Media Coverage

Forex reserves up by USD 1.492 billion to USD 641 billion
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 అక్టోబర్ 2021
October 22, 2021
షేర్ చేయండి
 
Comments

A proud moment for Indian citizens as the world hails India on crossing 100 crore doses in COVID-19 vaccination

Good governance of the Modi Govt gets praise from citizens