I congratulate all those who will be voting for the first time in the 2019 Parliamentary polls. Those born in the 21st century are now going to be voters and thus, they will play a role in shaping India's progress: PM
Our friends in the Congress see things in two time periods. BC- Before Congress, when nothing happened. AD- After dynasty- where everything happened: PM
India is seeing remarkable progress in the last four years. In all spheres, investment, steel sector, start ups, milk and agriculture, aviation, India's progress is outstanding: PM

లోక్ స‌భ లో రాష్ట్రప‌తి ప్ర‌సంగాని కి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న స‌మాధాన‌ం ఇచ్చారు. చ‌ర్చ కు ఉత్సాహాన్ని జోడించిన మరియు అంత‌ర్ దృష్టి తో కూడిన అంశాల‌ ను వ్య‌క్తం చేసినందుకుగాను పలువురు స‌భా స‌భ్యుల కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ప్రసంగం ఆరంభం లో “భార‌త‌దేశ ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తున్న‌టువంటి, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల ప‌ట్ల స్పందించేట‌టువంటి, నిజాయ‌తీ, పార‌ద‌ర్శ‌క‌త్వం కలిగినటువంటి, అవినీతి కి వ్య‌తిరేకంగా పోరాడేటటువంటి మ‌రియు స‌త్వ‌ర అభివృద్ధి కి పాటుప‌డేటటువంటి ప్ర‌భుత్వం’’ అని ఆయ‌న చేసిన వ్యాఖ్య ఆయన ప్ర‌భుత్వ వైఖరి ని వెల్లడించింది.

గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల లో భార‌త‌దేశం అసాధార‌ణమైన పురోగ‌తి ని చూసిందని ప్ర‌ధాన మంత్రి అన్నారు. విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డి నుండి ఉక్కు రంగం దాకా, స్టార్ట్‌-అప్ లు, పాలు మ‌రియు వ్య‌వ‌సాయం, విమాన‌యానం వ‌ర‌కు చూస్తే భార‌త‌దేశం ప్ర‌గ‌తి విశేషం గా ఉంది అని ఆయ‌న అన్నారు. ‘‘మ‌నం ప్రపంచం లో రెండో అతి పెద్ద ఉక్కు ఉత్ప‌త్తిదారు గా, రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ త‌యారీదారు గా, నాలుగో అతి పెద్ద వాహ‌న త‌యారీదారు గా మారాం. మ‌న‌ది ఒక బ్ర‌హ్మాండ‌మైన పంట‌ల‌ ఉత్ప‌త్తిదారు దేశం’’ అని ఆయ‌న చెప్పారు.

త‌న ప్ర‌భుత్వం యొక్క విశేషాల ను ఆయ‌న వివ‌రిస్తూ, గడచిన 55 నెల‌ల్లో త‌న ప్ర‌భుత్వం సాధించిన దానిని చూసిన ఎవరైనా అది గ‌త 55 సంవ‌త్స‌రాల్లో సాధించిన దాని క‌న్నా ఎంతో ముందుకు వెళ్లిందని ఇట్టే గ‌మ‌నించగలరని ఆయ‌న అన్నారు. ‘‘పారిశుధ్య సేవ‌లు 98 శాతం కన్నా ఎక్కువ మంది కి అందుతున్నాయి. 10 కోట్ల కు పైగా టాయిలెట్ ల‌ను ప్ర‌జ‌ల కోసం నిర్మించ‌డ‌మైంది. గత 55 సంవ‌త్స‌రాల లో 12 కోట్ల గ్యాస్ క‌నెక్ష‌న్ లు ఇవ్వ‌బ‌డ్డాయి మరి గ‌త 55 మాసాల్లో 13 కోట్ల గ్యాస్ క‌నెక్ష‌న్ లు ఇవ్వ‌డం జ‌రిగింది. వాటి లో 6 కోట్ల క‌నెక్ష‌న్ లు ‘ఉజ్జ్వ‌ల’ క‌నెక్ష‌న్ లు. చేసిన ప‌నుల యొక్క వేగం, మరి అలాగే ఆ ప‌ని ఎవ‌రి కోసం చేయ‌బ‌డింది అనేవి మీ అంత‌ట మీరే నిర్ణ‌యించండి’’ అని ఆయ‌న అన్నారు.

ప్ర‌తిప‌క్షాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ప్ర‌జ‌లు ఒక పూర్తి సంఖ్యాధిక్యం కలిగినటువంటి ప్ర‌భుత్వం ఏమి ప‌నులు చేయ‌గ‌ల‌ద‌నేది చూశారు. మ‌రి వారు తన ప్ర‌భుత్వం యొక్క కృషి ని గ‌మ‌నించారు అని పేర్కొన్నారు. వారు ఒక ‘మ‌హామిలావ‌ట్‌’ ప్ర‌భుత్వాన్ని కోరుకోవ‌డం లేదు, అలాగే అది విజ‌య‌వంతం కాబోదు అని కూడా ఆయ‌న చెప్పారు.

త‌న‌ ను ఎవ‌రైనా స్వేచ్ఛ‌ గా విమ‌ర్శించ‌వ‌చ్చ‌ని, అయితే ఆ క్ర‌మం లో వారు దేశాన్ని విమ‌ర్శించకూడ‌ద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

అవినీతి ని గురించి ఆయ‌న గ‌ట్టి గా మాట్లాడుతూ, త‌న ప్ర‌భుత్వం అవినీతి ప‌రుల‌ను చ‌ట్టాని కి ప‌ట్టి ఇవ్వ‌డం కోసం అలుపు ఎరుగ‌కుండా కృషి చేస్తోంద‌ని చెప్పారు.

బేనామీ చ‌ట్టాన్ని గురించి ఆయ‌న మాట్లాడుతూ, బేనామీ చ‌ట్టాన్ని అమ‌లు లోకి తెచ్చింది త‌న ప్ర‌భుత్వమే అని, మ‌రి ప్ర‌స్తుతం బేనామీ ఆస్తుల‌ ను క‌లిగివున్న వారు ప‌ట్టుబ‌డుతున్నార‌ని తెలిపారు.

రాఫేల్ అంశం పై ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అన్ని ఆరోప‌ణ‌ల కు ర‌క్ష‌ణ మంత్రి పూర్తి గా జ‌వాబు ఇచ్చార‌ని, మరి ముడుపులు లేనిదే ఏ ర‌క్ష‌ణ ఒప్పందమూ పూర్తి కాదు అని అనుకొనే వారే వివాదాన్ని రేకెత్తిస్తున్నార‌న్నారు.

ఎన్‌పిఎ ల గురించి ఆయ‌న మాట్లాడుతూ, ఇదివ‌ర‌క‌టి ప్ర‌భుత్వాలు ఒక వార‌స‌త్వాన్ని వ‌ద‌లి వెళ్ళాయ‌ని, దేశాన్ని విడ‌చి పారిపోయిన వారు ఈ రోజు న ట్విట‌ర్ లో రోదిస్తున్నార‌ని పేర్కొన్నారు. ‘‘నేను 7,800 కోట్ల రూపాయ‌లు స్వీక‌రించాన‌ని వారు అంటున్నారు. కానీ, ప్ర‌భుత్వం 13,000 కోట్ల రూపాయ‌ల విలువైన ఆస్తుల ను జ‌ప్తు చేసింది’’ అని ఆయ‌న వెల్ల‌డించారు.’’

సుమారు 20 వేల ఎన్‌జిఒ ల వద్ద నుండి వాటి నిధుల యొక్క వివ‌రాల‌ ను ప్ర‌భుత్వం తెలుసుకోగోరగా అవి వాటి కార్య‌క‌లాపాల ను మూసివేశాయ‌ని, మరి ముందుముందు ఈ సంఖ్య మ‌రింత పెరిగేందుకు ఆస్కారం ఉందని కూడా ఆయ‌న వెల్లడించారు.

అంద‌రి కి జీవించ‌డాన్ని సుల‌భ‌త‌రం చేయ‌డం కోసం ఎన్‌డిఎ ప్ర‌భుత్వం శ్ర‌ద్ధ వహిస్తూ ఏ విధం గా క‌ఠోరం గా శ్ర‌మిస్తోందీ ఆయన వివ‌రిస్తూ, ఇదివ‌ర‌క‌టి ప్ర‌భుత్వాల‌ తో పోల్చి చూస్తే ధ‌ర‌ల పెరుగుద‌ల ను అడ్డుకోవడం జ‌రిగిందన్నారు.

ఒక ఆరోగ్యవంత‌మైన భార‌త‌దేశం కోసం తాను సంక‌ల్పం తీసుకొన్నాన‌ని ప్ర‌ధాన మంత్రి చెప్తూ, మందుల ధ‌ర‌ల ను, వైద్య ఉప‌క‌ర‌ణాల ధరల ను, ఇంకా శ‌స్త్ర చికిత్స సంబంధిత సామ‌గ్రి ల ధ‌ర‌ల ను త‌గ్గించడ‌ం జరిగింద‌న్నారు.

ఉద్యోగ రంగాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, గ‌రిష్ఠ స్థాయి లో ఉద్యోగాల వృద్ధి ర‌వాణా రంగం లో నమోదైంద‌న్నారు. గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల‌ లో 6 ల‌క్ష‌ల మంది కి పైగా నూత‌న వృత్తి నిపుణులు శ్రామిక దళాని కి జ‌త అయ్యార‌ని, అలాగే వారు ప్ర‌జ‌ల కు మ‌రిన్ని కొలువులు తెచ్చిపెట్టార‌న్నారు. 2017వ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ నుండి 2018వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ మ‌ధ్య కేవ‌లం 15 నెల‌ల అవ‌ధి లో ఉద్యోగుల భ‌విష్య‌ నిధి లో 1.80 కోట్ల మంది కి పైగా ఏ విధం గా చేరిందీ ఆయ‌న వివ‌రించారు. వారి లో 64 శాతం మంది 28 ఏళ్ళ వ‌య‌స్సు లోపు వారే అని కూడా ఆయన అన్నారు. 1.20 కోట్ల మంది కి పైగా ప్ర‌జ‌లు నేశ‌న‌ల్ పెన్శన్ సిస్ట‌మ్ (ఎన్‌పిఎస్)లో వారి పేర్ల‌ ను న‌మోదు చేసుకొన్నార‌ని కూడా ఆయ‌న లోక్ స‌భ కు చెప్పారు.

భార‌త‌దేశ విదేశాంగ విధానం దేశాన్ని ప్ర‌పంచ రంగ‌స్థ‌లం మీద కు తీసుకు వ‌చ్చింద‌ని ప్ర‌ధాన మంత్రి తెలియ‌జేస్తూ, ‘భార‌త‌దేశం ఏమి చెప్పాల‌నుకుంటున్నదీ ప్ర‌జ‌లు వింటున్నార’న్నారు. ప్యారిస్ ఒప్పందం ఖ‌రారు కావ‌డాని క‌న్నా ముందు, ప్ర‌పంచం లోని అగ్ర నేత‌ లు భార‌త‌దేశం తో మాట్లాడే వారు అని ఆయ‌న చెప్పారు. భార‌త‌దేశం ఇజ్రాయల్ తో, అలాగే పాల‌స్తీనా తో, సౌదీ అరేబియా తోను, అలాగే ఇరాన్ తో కూడాను స్నేహం గా మెల‌గుతుంది అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

భార‌త‌దేశ పురోగ‌తి కి బాట వేయ‌డం లో త‌దుప‌రి త‌రం యొక్క భూమిక‌ ను ఆయ‌న ప్ర‌శంసిస్తూ, ‘‘ఇర‌వై ఒక‌టో శ‌తాబ్దం లో పుట్టిన వారు ప్ర‌స్తుతం వోట‌ర్లు కాబోతున్నారు. ఆ విధం గా, వారు భార‌త‌దేశం యొక్క ప్ర‌గ‌తి ని తీర్చిదిద్ద‌డం లో ఒక పాత్ర‌ ను పోషించ‌బోతున్నారు’’ అని పేర్కొన్నారు.

భార‌త‌దేశ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల ను త‌న ప్ర‌భుత్వం స‌దా నెర‌వేర్చుతూ ఉంటుంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్తూ, త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s pharmaceutical sector records transformative growth over 12 years, strengthening affordable healthcare and self-reliance

Media Coverage

India’s pharmaceutical sector records transformative growth over 12 years, strengthening affordable healthcare and self-reliance
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 జూన్ 2026
June 19, 2026

Appreciation for India’s Domestic Growth and Rising Global Influence under PM Modi’s Leadership