శ్రీ వెంకయ్య నాయుడు గారు ఏ బాధ్యత చేపట్టినా దాని చాలా శ్రద్ధతో నిర్వహించారు మరియు ఆ పాత్రలో సులభంగా అలవాటు పడ్డారు: ప్రధాని మోదీ
Sశ్రీ వెంకయ్య నాయుడుగారికి అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యే సామర్ధ్యం ఉంది. ఆయన ఒక శిక్షకుడు కూడా: ప్రధాని మోదీ
శ్రీ వెంకయ్య నాయుడు గారికి బాధ్యత వచ్చిన ప్రతీసారీ ఒక దార్శకునిగా పనిచేశారు. ఆయనకు కేటాయించిన పనికి న్యాయం చేయదానికి ఉత్తమ నిపుణులను ఆయన ఎంచుకుంటారు: ప్రధాని మోదీ
శ్రీ వెంకయ్య నాయుడు గారిది ఒక రైతు- రైతులు, వ్యవసాయ సంక్షేమ పట్ల ఆయన ఎంతో ఆసక్తిచూపిస్తారు: ప్రధాని మోదీ
శ్రీ వెంకయ్య నాయుడు గారి ప్రయత్నాల కారణంగానే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వచ్చింది: ప్రధాని మోదీ

ఉప రాష్ట్రప‌తి శ్రీ వెంక‌య్య నాయుడు ప‌ద‌వీకాలం లో ఒక సంవ‌త్స‌రం పూర్తి అయినందుకు గుర్తు గా “మూవింగ్ ఆన్‌, మూవింగ్ ఫార్వ‌ర్డ్- ఎ ఇయ‌ర్ ఇన్ ఆఫీస్‌” పుస్త‌కాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ఆవిష్క‌రించారు. అలాగే ఆయ‌న ఈ పుస్త‌కం యొక్క తొలి ప్ర‌తి ని భార‌త‌దేశ ఉప రాష్ట్రప‌తి కి అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, శ్రీ వెంక‌య్య నాయుడు తో అనేక సంవ‌త్స‌రాల పాటు క‌ల‌సి ప‌నిచేసే అవ‌కాశం త‌న‌కు ల‌భించింద‌న్నారు. శ్రీ నాయుడు ప‌ద‌వీ అన్నింటి క‌న్నా పదవీబాధ్య‌త‌ లను మిన్న‌ గా ప‌రిగ‌ణించార‌ని ఆయ‌న అన్నారు.

శ్రీ వెంక‌య్య‌ నాయుడు ఏ బాధ్య‌త‌ను త‌న‌కు అప్ప‌గించినా ఆ బాధ్య‌త‌ను స‌దా అత్యంత తత్పరత తో నిర్వహిస్తూ వ‌చ్చార‌ని, అంతేకాకుండా ఆ భూమిక లోకి ఇట్టే ఇమిడిపోయార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఆయ‌న ప్ర‌జా జీవ‌నం లో 50 సంవ‌త్స‌రాలు- విద్యార్థి రాజ‌కీయాల‌ లో 10 సంవ‌త్స‌రాలు, రాష్ట్ర రాజ‌కీయాల‌ తో పాటు జాతీయ రాజ‌కీయాల‌ లో 40 సంవ‌త్స‌రాలు- గ‌డిపార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

క్ర‌మశిక్ష‌ణ వాది గా ఉంటూనే అన్ని వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లకు స్నేహపాత్రుడిగా మెలిగే ద‌క్ష‌త శ్రీ వెంక‌య్య నాయుడు కు ఉంద‌ని శ్రీ న‌రేంద్ర మోదీ చెప్పారు. ఆయ‌న కు ఒక బాధ్య‌త ద‌క్కిన‌ప్పుడ‌ల్లా దార్శ‌నిక‌త తో కూడిన నాయ‌క‌త్వాన్ని అందిస్తారు; అప్ప‌గించిన ప‌ని కి పూర్తి న్యాయం జ‌రిగేట‌ట్లు నిపుణుల స‌హాయాన్ని స్వీకరిస్తార‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

శ్రీ వెంక‌య్య నాయుడు ను పూర్వ ప్ర‌ధాని శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ త‌న మంత్రివ‌ర్గం లోకి చేర్చుకోవాల‌నుకొన్న‌ప్పుడు వెంక‌య్య గారు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ను ఇవ్వాలంటూ అభ్య‌ర్ధించిన విష‌యాన్ని ప్ర‌ధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు. వెంక‌య్య గారు అంత‌రంగం లోప‌ల ఒక క‌ర్షకుడ‌ని, రైతుల సంక్షేమ‌మన్నా, వ్య‌వ‌సాయ‌మ‌న్నా ఆయ‌న‌ కు ఎంతో మ‌క్కువ అని శ్రీ మోదీ అన్నారు.

‘ప్ర‌ధాన మంత్రి గ్రామ్ స‌డ‌క్ యోజ‌న’ శ్రీ వెంక‌య్య నాయుడు ప్ర‌య‌త్నాల వ‌ల్ల‌నే రూపుదాల్చింద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. రైళ్ళ ను ఫ‌లానా స్టేశన్ లలో ఆప‌డం అనే విష‌యం పై మాత్రమే ప్ర‌భుత్వ హయాములు దృష్టి ని నిలిపిన కాలం లో, నాయ‌కులు ర‌హ‌దారుల గురించి, అలాగే ఇత‌ర సంధాన మార్గాల‌ను గురించి మ‌రింత ఎక్కువ‌గా ఆలోచించ‌డం మొద‌లుపెట్టే విధంగా నాయుడు గారు శ్ర‌ద్ధ తీసుకొన్నార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఉప రాష్ట్రప‌తి మౌఖిక ప్రావీణ్యాన్ని గురించి, తెలుగు లో గాని, ఇంగ్లిషు లో గాని ప‌దాల‌ తో ఆయన చేసే చ‌మ‌క్కులను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసలు కురిపించారు. ఉప రాష్ట్రప‌తి త‌న ప‌ద‌వీకాలం లో తొలి సంవ‌త్స‌రం తాలూకు పురోగ‌తి నివేదిక ను- పార్ల‌మెంటు లోప‌ల‌, వెలుప‌ల కూడా తాను చేసిన గొప్ప కృషి సహా – స‌మ‌ర్పించడం అభినందనీయమని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s electronics output hits ₹13 lakh crore; Vaishnaw eyes No. 2 export spot

Media Coverage

India’s electronics output hits ₹13 lakh crore; Vaishnaw eyes No. 2 export spot
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the virtues of truth, service, learning and action
June 18, 2026

The Prime Minister, Shri Narendra Modi said that wealth follows truthfulness, fame follows selfless service, knowledge follows constant practice and wisdom follows action. He noted that these values play a vital role in shaping individual character and contributing to collective progress.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“सत्यानुसारिणी लक्ष्मीः कीर्तिस्त्यागानुसारिणी।

अभ्याससारिणी विद्या बुद्धिः कर्मानुसारिणी।।”

The Prime Minister wrote on X;