The nation is now moving towards Gas Based Economy, says PM Modi
City Gas Distribution network will play a major role in achieving Clean Energy solutions: PM Modi
Government would strive to fulfil the targets for Clean Energy and Gas Based Economy: PM Modi

సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూష‌న్ (సిజిడి) తొమ్మిదో విడ‌త బిడ్డింగ్ లో భాగం గా ప్ర‌దానం చేసిన సిజిడి ప‌నుల ప్రారంభాని కి గుర్తు గా న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో ఈ రోజున జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా శంకుస్థాప‌న చేశారు.  ఆయ‌న 10వ విడత సిజిడి బిడ్డింగ్ ను కూడా ప్రారంభించారు.

స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, విడత సిజిడి బిడ్డింగ్ లో భాగం గా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూష‌న్ నెట్ వ‌ర్క్ స్థాప‌న ప‌నులు 129 జిల్లాల లో మొద‌లయ్యాయని తెలిపారు.  సిజిడి ప‌దో విడ‌త బిడ్డింగ్ అనంత‌రం 400కు పైగా జిల్లాలు, త‌ద్వారా జ‌నాభా లో దాదాపు 70 శాతం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూష‌న్ నెట్ వ‌ర్క్ ప‌రిధి లోకి రాగలవన్నారు.  

దేశం ప్ర‌స్తుతం గ్యాస్ ఆధారిత‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ దిశ‌ గా ప‌య‌నిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేస్తూ, కేంద్ర ప్ర‌భుత్వం గ్యాస్ ఆధారిత ఆర్ధిక వ్య‌వ‌స్థ తాలూకు అన్ని పార్శ్వాల దిశ‌ గా శ్ర‌ద్ధ వ‌హిస్తోంద‌ని పేర్కొన్నారు.  దేశం లో గ్యాస్ సంబంధిత మౌలిక స‌దుపాయాల‌ను ప‌టిష్టప‌ర‌చ‌డం కోసం కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొన్న వివిధ చ‌ర్య‌ల‌ను గురించి- ప్ర‌త్యేకించి ఎల్ఎన్‌జి ట‌ర్మిన‌ల్స్ సంఖ్య ను పెంచ‌డం, దేశ‌వ్యాప్త గ్యాస్ గ్రిడ్ ను ఏర్పాటు చేయ‌డం, ఇంకా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూష‌న్ నెట్ వ‌ర్క్ ను స్థాపించ‌డం గురించి- శ్రీ మోదీ వివ‌రించారు.

‘స్వ‌చ్ఛ‌మైన శ‌క్తి’ వైపున‌కు సాగ‌డం లో గ్యాస్ ఆధారిత‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ యొక్క భూమిక‌ ను ప్ర‌ధాన మంత్రి వివ‌రిస్తూ, స్వ‌చ్ఛ శ‌క్తి ప‌రిష్కారాల‌ను సాధించ‌డం లో సిజిడి నెట్‌వ‌ర్క్ ఒక ప్ర‌ధానమైన పాత్ర‌ ను పోషిస్తుంద‌న్నారు.  స్వ‌చ్ఛ శ‌క్తి దిశ‌ గా కేంద్ర ప్ర‌భుత్వం కృషి విశాల ప్రాతిప‌దిక‌ తో కూడుకొని ఉంద‌ని కూడా ఆయ‌న చెప్పారు.  ఈ సంద‌ర్భం లో ఆయ‌న ఇథెనాల్ మిశ్ర‌ణ‌ం, కంప్రెస్ డ్ బ‌యోగ్యాస్ ప్లాంటు లు, ఎల్‌పిజి ప‌రిధి ని పెంచ‌డం, వాహ‌నాల కోసం బిఎస్‌-6 ఇంధ‌నాల‌ ను ప్ర‌వేశ‌పెట్ట‌డం త‌దిత‌ర కేంద్ర ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ ను గురించి తెలియజేశారు.

గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల‌ లో పన్నెండు కోట్ల‌ కు పైగా ఎల్‌పిజి క‌నెక్ష‌న్ లను అందించ‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాన మంత్రి వెల్ల‌డించారు.  న‌గ‌రాల లో గ్యాస్ నెట్ వ‌ర్క్ ను ఒక నూత‌న‌మైన ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ ను ఏర్ప‌రుస్తాయ‌ని, ఇది గ్యాస్ ఆధారిత ప‌రిశ్ర‌మ‌లకు బాట ప‌రుస్తుంద‌ని, యువ‌త‌ కు ఉపాధి ని క‌ల్పిస్తుంద‌ని, అలాగే పౌరుల‌కు ‘జీవించ‌డం లో సౌల‌భ్యాన్ని’ ప్ర‌సాదిస్తుంద‌ని ఆయ‌న వివ‌రించారు.

స్వ‌చ్ఛ శక్తి మ‌రియు గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్య‌వ‌స్థ ల‌కు గాను నిర్ణ‌యించుకొన్న ల‌క్ష్యాల‌ ను నెర‌వేర్చేందుకు ప్ర‌భుత్వం శ్ర‌మిస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఆ త‌ర‌హా ల‌క్ష్యాల‌ ను కేవ‌లం మ‌న కోసం కాకుండా, యావ‌త్ మాన‌వ జాతి కోసం, అలాగే భావి త‌రాల‌ వారి కోసం నెర‌వేర్చ‌వ‌ల‌సిన ఆవ‌శ్య‌కత ఉంద‌ని ఆయ‌న అన్నారు.



 

Click here to read PM's speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
The entrepreneurs building a self-reliant India

Media Coverage

The entrepreneurs building a self-reliant India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 జూలై 2026
July 21, 2026

Self-Reliance Is No Longer a Slogan — It’s Happening Across Engines, UPI, Vaccines & FDI Under the Leadership of PM Modi