To overcome environmental pollution, the Government is promoting the usage of environment friendly transportation fuel: PM
To cut down on import of Crude oil, government has taken decisive steps towards reducing imports by 10% and saving the precious foreign exchange: PM
Indian refinery industry has done well in establishing itself as a major player globally: Prime Minister

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు కేర‌ళ‌ లోని కోచి ని సంద‌ర్శించి, వివిధ ప్రాజెక్టు ల‌కు శంకుస్థాప‌న‌చేశారు; అలాగే, మ‌రికొన్నింటి ప్రారంభోత్స‌వాల‌లోనూ ఆయన పాల్గొన్నారు.

దేశ ప్రజల కు ఆయన అంకితం చేసిన ప్రాజెక్టు ల‌లో కోచి లోని ఇంటిగ్రేటెడ్ రిఫైన‌రీ విస్త‌ర‌ణ ప్రాజెక్టు కాంప్లెక్స్‌ (ఐఆర్ ఇపి) ఉంది. ఐఆర్ ఇపి ఆధునికమైన విస్త‌ర‌ణ పథకం. ఇది ప్ర‌పంచ‌ శ్రేణి ప్ర‌మాణాల‌ తో కోచి రిఫైన‌రీ ని భార‌త‌దేశం లో అతి పెద్ద ప్ర‌భుత్వ‌ రంగ‌ రిఫైన‌రీ గా తీర్చిదిద్దుతుంది. భార‌త‌దేశాని కి స్వ‌చ్ఛ‌మైన ఇంధ‌నాన్నిఉత్ప‌త్తి చేసేందుకు వీలు గా దీనిని తీర్చిదిద్ద‌డం జ‌రుగుతుంది. ఇది ఎల్‌ పిజి, డీజిల్ ల ఉత్ప‌త్తి ని ప్ర‌స్తుతం ఉన్న స్థాయి నుండి రెట్టింపు చేస్తుంది. అలాగే ఈ ప్లాంటు లో పెట్రో కెమిక‌ల్ ప్రాజెక్టుల‌ కు ఫీడ్ స్టాక్‌ ను ఉత్ప‌త్తి చేయ‌డం ప్రారంభిస్తారు.

ఐఆర్ ఇపి కాంప్లెక్స్‌ ను ప్ర‌ధాన‌ మంత్రి ప్రారంభిస్తూ , “ఈరోజు చరిత్రాత్మ‌క దినం. కేర‌ళ‌ లోని అతి పెద్ద పారిశ్రామిక విభాగం మ‌రో ద‌శ అభివృద్ధి లోకి అడుగుపెడుతోంది. ఇవి ఒక్క కేర‌ళ‌ కు మాత్ర‌మే గ‌ర్వించ‌ద‌గ్గ క్ష‌ణాలు కావు; యావత్తు దేశం గ‌ర్వ‌ప‌డే సంద‌ర్బం అన్నారు. అలాగే కోచి లోని భార‌త్‌ పెట్రోలియమ్ కార్పొరేశన్ లిమిటెడ్‌ (బిపిసిఎల్‌) స్వ‌చ్ఛ ఇంధ‌నాని కి కేర‌ళ‌, ప‌రిస‌ర ప్రాంత రాష్ట్రాల‌ లో ప్రాచుర్యం క‌ల్పించేందుకు గ‌త 50 సంవ‌త్స‌రాలు గా కీల‌క పాత్ర‌ ను పోషిస్తోంద’’న్నారు.

ప్ర‌భుత్వం సాధించిన ప్ర‌గ‌తి ని గురించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావిస్తూ, ఉజ్వ‌ల ప‌థ‌కం ఎన్నో కుటుంబాల‌ లో సంతోషాలు నింపింద‌న్నారు. 2016 నుండి ఇప్ప‌టివ‌ర‌కు సుమారు ఆరు కోట్ల మంది నిరుపేద‌ ల‌కు ఎల్‌ పిజి క‌నెక్ష‌న్ లు ఇచ్చిన‌ట్టు తెలిపారు. ప‌హ‌ల్ ప‌థ‌కం లో 23 కోట్ల మందికి పైగా ఎల్‌ పిజి వినియోగ‌దారులు చేరార‌న్నారు. ఈ ప‌థ‌కం లో ఉన్న పార‌ద‌ర్శ‌క‌త బేనామీ ఖాతాలు, బ‌హుళ ఖాతాలు, ఉప‌యోగం లో లేని ఖాతాల‌ ను గుర్తించ‌డానికి ఉప‌యోగ‌ప‌డింద‌ని చెప్పారు. కోటి మంది కి పైగా క‌స్ట‌మ‌ర్లు ఎల్‌ పిజి స‌బ్సిడీ ని వ‌దులుకున్నార‌ని వివ‌రించారు. కోచి రిఫైన‌రీ సాధిస్తున్న ప్ర‌గ‌తి ని ప్ర‌ధాన మంత్రి ప్రశంసించారు. ఉజ్వ‌ల యోజ‌న‌ కు ఈ ప‌థ‌కం ఎంత‌గానో తోడ్ప‌డుతోంద‌ని, ఇటీవ‌లి విస్త‌ర‌ణ‌ తో ఎల్‌ పిజి ఉత్ప‌త్తి రెట్టింపు అయిందని చెప్పారు.

దేశం లో సిటీ గ్యాస్‌ నెట్ వ‌ర్క్ విస్త‌ర‌ణ ద్వారా స్వ‌చ్ఛ‌మైన సిఎన్‌ జి ఇంధ‌న వినియోగాన్ని పెంపొందించేందుకు కృషిచేస్తున్న‌ట్టు ప్రధాన మంత్రి చెప్పారు. 10వ విడత సిజిడి బిడ్డింగ్‌ విజ‌య‌వంతం గా పూర్తి అయిన త‌రువాత దేశ‌ వ్యాప్తం గా 400 జిల్లాల‌ లో గ్యాస్ స‌ర‌ఫ‌రా ను గొట్టపుమార్గం ద్వారా అనుసంధానం చేయ‌డం జ‌రుగుతుంది. గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్య‌వ‌స్థ‌ ను ఏర్ప‌రచేందుకు, ఇంధ‌న రంగం లో గ్యాస్ వాటా ను పెంచేందుకు నేశన‌ల్ గ్యాస్ గ్రిడ్ లేదా ప్ర‌ధాన‌ మంత్రి ఊర్జా గంగ ను కూడా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. దేశం లో 15,000 కిలోమీట‌ర్ల అద‌న‌పు గ్యాస్ పైప్‌లైన్ నెట్‌ వ‌ర్క్‌ నిర్మాణాని కి ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. దీనికి తోడు, ప్ర‌భుత్వం చ‌మురు దిగుమ‌తుల‌ ను ప‌ది శాతం మేర‌కు త‌గ్గించి త‌ద్వారా విలువైన‌ విదేశీ మార‌కద్ర‌వ్యాన్ని ఆదా చేసిన‌ట్టు చెప్పారు.

ఆసియా లోనే రెండో పెద్ద చ‌మురు ను శుద్ధి పరుస్తున్న దేశం భారతదేశం. ఇండియా రిఫైనింగ్ హ‌బ్‌ గా ఎదుగుతోందని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు. ఐఆర్‌ఇపి ని స‌కాలం లో పూర్తి చేసినందుకు సిబ్బంది ని ప్ర‌త్యేకించి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రాత్ర‌న‌క ప‌గ‌ల‌న‌క శ్ర‌మించిన కార్మికుల‌ ను ప్ర‌ధాన మంత్రి అభినందించారు. ఈ ప్రాజెక్టు ను అమ‌లు చేసే స‌మ‌యం లో గ‌రిష్ఠంగా ఒక్కొక్క సారి 20,000 మంది కార్మికుల వ‌ర‌కు ప్రాజెక్టు ప్రాంగ‌ణం లో ప‌ని చేసిన‌ట్టు తెలిసింద‌ని, వారంతా ఈ ప్రాజెక్టు కు నిజ‌మైన కథానాయకులని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ఇంధ‌నేత‌ర‌ రంగం లోకి అడుగుపెట్టేందుకు బిపిసిఎల్ వ్యూహాత్మ‌కం గా తీసుకున్న చ‌ర్య‌ ను ప్ర‌ధాన మంత్రి అభినందించారు. ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘మిత్రులారా, పెట్రో కెమిక‌ల్స్ అనేవి ఒక త‌ర‌హా ర‌సాయ‌నాలు. వీటి ని గురించి మనం ఎక్కువ‌గా మాట్లాడుకోం. కానీ ఇవి మ‌న‌కు క‌నిపించ‌కుండానే మ‌న రోజు వారీ జీవితం లో అంత‌ర్భాగం గా ఉన్నాయి. అయినా ఈ ర‌సాయ‌నాల‌ లో చాలా వ‌ర‌కు ఇత‌ర దేశాల‌ నుండి దిగుమ‌తి అవుతున్‌ివే. ఇక పెట్రోరసాయనాలను మ‌న దేశం లోనే త‌యారు చేయాల‌న్న‌ది మ‌న సంక‌ల్పం’’ అన్నారు.

కోచి రిఫైన‌రీ ప్ర‌స్తుతం ఈ ఐఆర్ ఇపి ప్రాజెక్టు పూర్తి అయిన త‌రువాత ప్రోప్ లీన్‌ ను ఉత్పత్తి చేయ‌గ‌లుగుతుంద‌ని తెలిసింద‌ని ప్ర‌ధాన మంత్రి సంతోషం వ్య‌క్తం చేశారు.

దీనితో పాటు పెయింట్లు, ఇంకులు, కోటింగ్‌ లు, డిట‌ర్జెంట్ లు, ఇంకా ఇత‌ర అనేక రంగాల‌ లో వాడే కీల‌క పెట్రో ర‌సాయ‌నాలు కూడా త‌యారు కానున్న‌ట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు కార‌ణం గా అనేక అనుబంధ ప‌రిశ్ర‌మ‌లు కోచి కి రానున్నాయ‌ని, వ్యాపార అవ‌కాశాలు మ‌రింత‌ గా విస్త‌రించ‌గలవని ఆయన అన్నారు.

కోచి రిఫైన‌రీ ప‌నుల‌ ను చూసి దేశం గ‌ర్విస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. కేర‌ళ గ‌త వంద సంవ‌త్స‌రాల‌ లో ఎన్న‌డూ ఎరుగనటువంటి వ‌ర‌ద‌ లో విల‌విల‌లాడిన గ‌త ఆగ‌స్టు మాసం లోనూ బిపిసిఎల్ అన్ని అడ్డంకుల‌ ను అధిగ‌మించి కార్య‌క‌లాపాల ను కొనసాగించి పెట్రోల్, డీజిల్‌, ఎల్ పిజి లను ఉత్ప‌త్తి చేసిన విష‌యాన్ని ప్ర‌ధాన‌ మంత్రి ఈ సంద‌ర్భం గా గుర్తు కు తెచ్చారు. జాతి నిర్మాణం లో కోచి రిఫైన‌రీ చేస్తున్న కృషి గ‌ర్వ‌కార‌ణం అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఇప్ప‌డు కోచి రిఫైన‌రీ మ‌రింత‌ గా విస్త‌రిస్తోంద‌న్నారు. కోచి రిఫైన‌రీ ద‌క్షిణ భార‌తదేశం లో పెట్రో రసాయనిక క్రాంతి కి దారి తీస్తుంద‌ని, న్యూ ఇండియా యొక్క పెరుగుతున్నటువంటి అవ‌సరాల‌కు ఇది అండగా నిలబడుతుంద‌ని ప్రధాన మంత్రి అన్నారు.

బిపిసిఎల్ ఎట్టుమానూర్ లో నెల‌కొల్పిన రెండో నైపుణ్య అభివృద్ధి సంస్థ‌ కు ప్ర‌ధాన‌ మంత్రి శంకుస్థాప‌న చేశారు. ఇది నైపుణ్య అభివృద్ధి కి, యువ‌త‌ కు ఉపాధి అవ‌కాశాలను క‌ల్పించ‌డాని కి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయ‌న అన్నారు.

కోచి లోని ఇండియ‌న్ ఆయిల్, ఎల్‌ పిజి ఆధారిత బాట్లింగ్ ప్లాంటు లో 50 కోట్ల రూపాయ‌ల వ్య‌యం తో ఏర్పాటు చేసిన మౌండెడ్ స్టోరేజ్‌ఫెసిలిటీ ని ప్ర‌ధాన‌ మంత్రి దేశ ప్రజల కు అంకితం చేశారు. ఇది ఎల్‌ పిజి నిల్వ సామ‌ర్ధ్యాన్ని పెంచడం తో పాటు ఎల్‌ పిజి ట్యాంక‌ర్ లను రహదారి మార్గం లో త‌ర‌లించడాన్ని కూడా త‌గ్గించనుంది.

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
ISRO Successfully Tests CE20 Cryogenic Engine At Uprated 220 KN Thrust For C32 Stage Of Upcoming LVM3 Mission

Media Coverage

ISRO Successfully Tests CE20 Cryogenic Engine At Uprated 220 KN Thrust For C32 Stage Of Upcoming LVM3 Mission
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 సెప్టెంబర్ 2026
September 11, 2026

Seva Pakhwada to Superpower Status: Why Citizens Are Hailing PM Modi’s Relentless Push