We are attempting to bring about scientific growth, with priority being keeping Varanasi's age-old identity secure: PM Modi
Varanasi will soon be the gateway to the east, says PM Modi
Kashi is now emerging as a health hub: PM Modi
Join the movement in creating a New Kashi and a New India: PM Modi urges people of Varanasi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న వారాణ‌సీ లోని బనారస్ హిందూ యూనివ‌ర్సిటీ లో జ‌రిగిన ఒక జ‌న స‌భ లో అనేక ముఖ్య‌మైన అభివృద్ధి ప‌థ‌కాల‌ను ప్రారంభించారు; అలాగే పలు పథకాలకు శంకుస్థాపన చేశారు కూడా.

ప్రారంభించినటువంటి ప‌థ‌కాల లో పురానీ కాశీ కోసం ఉద్దేశించిన ఇంటిగ్రేటెడ్ డివెల‌ప్‌మెంట్ స్కీమ్ (ఐపిడిఎస్‌) తో పాటు బిహెచ్‌యు లో ఓ అట‌ల్ ఇంక్యుబేశన్ సెంట‌ర్ కూడా ఉన్నాయి. పునాదిరాళ్ళ ను వేసిన ప‌థ‌కాల లో బిహెచ్‌యు లోని ఓ రీజ‌న‌ల్ ఆప్తల్మాల‌జీ సెంట‌ర్ కూడా ఉంది.

ఈ రోజున ప్రారంభ‌మైన లేదా శంకుస్థాప‌న జ‌రిగిన ప‌థ‌కాల మొత్తం విలువ 550 కోట్ల రూపాయ‌లకు పైగా ఉంది.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, వారాణ‌సీ లో మార్పు ను తీసుకు రావ‌డం కోసం జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాలు ఈ న‌గ‌రం యొక్క ఘ‌న‌ వార‌స‌త్వాన్ని ప‌రిర‌క్షించే దిశ‌గా జ‌రుగుతున్న కృషి కూడా అన్నారు. ఈ న‌గ‌రానికి ఉన్నటువంటి ప్రాచీన గుర్తింపు ను కాపాడుతూనే దీనిని ఆధునీక‌రించ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న చెప్పారు. కాశీ ప్ర‌జ‌ల నాలుగు సంవ‌త్స‌రాల సంక‌ల్ప ఫ‌లితంగా తీసుకురాబ‌డ్డ ప‌రివ‌ర్త‌న ప్ర‌స్తుతం కంటికి క‌నిపిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

విద్యుత్తు, ర‌హ‌దారులు మ‌రియు ఇత‌ర మౌలిక స‌దుపాయాల రంగాల లో వివిధ ప్రాజెక్టులు చెప్పుకోద‌గ్గ రీతి లో పురోగ‌మించాయ‌ని, అవి వారాణ‌సీ న‌గ‌ర ప్రజల జీవితాల లోను, వారాణసీ స‌మీప ప్రాంతాల ప్ర‌జ‌ల జీవితాల లోను ఒక మెరుగుద‌ల‌ ను కొని తెచ్చాయని శ్రీ న‌రేంద్ర మోదీ వివ‌రించారు. వారాణ‌సీ కంటోన్మెంట్ స్టేశన్ యొక్క ఛాయాచిత్రాలను పౌరులు ఆన్‌లైన్ లో పోస్టు చేయ‌డం చూస్తుంటే త‌న‌కు ఎంతో సంతోషం క‌లుగుతోందని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ర‌వాణా సంబంధిత మౌలిక స‌దుపాయాల‌ను ఆధునీక‌రించే దిశ‌గా జ‌రుగుతున్న ప‌నుల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. న‌గ‌రం యొక్క సుంద‌రీక‌ర‌ణ‌ ను పెంపొందించేట‌టువంటి కార్య‌క్ర‌మాల‌ను గురించి, న‌గ‌రం యొక్క ప‌రిశుభ్ర‌త ను వృద్ధి చేసేట‌టువంటి కార్య‌క్ర‌మాల‌ను గురించి కూడా ఆయ‌న వివ‌రించారు. ప‌ర్య‌ట‌క రంగం రూపురేఖలను మార్చి వేసే ఈ ప్ర‌య‌త్నం ఒక నిరంత‌ర కృషి అని ఆయ‌న పేర్కొన్నారు. ఇదే సంద‌ర్భం లో సారనాథ్ లో జ‌రుగుతున్న ప‌నుల‌ను గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు.

ర‌హ‌దారులు, విద్యుత్తు, ఇంకా త్రాగునీరు ల వంటి మౌలిక స‌దుపాయాల‌ను వారాణ‌సీ ప‌రిస‌రాల్లోని పల్లె ప్రాంతాల‌కు కూడా విస్త‌రిస్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు. కాశీ ప్ర‌స్తుతం ఒక ఆరోగ్య కేంద్రం గా రూపుదిద్దుకొంటోంద‌ని ఆయ‌న అన్నారు. ఈ రోజున ప్రారంభ‌మైన అట‌ల్ ఇంక్యుబేశన్ సెంట‌ర్ ను గురించి ఆయ‌న చెప్తూ స్టార్ట్‌-అప్ లు దీనితో సంధానం కావ‌డం ఇప్ప‌టికే మొద‌లైంద‌న్నారు. గొట్టాల ద్వారా వంట గ్యాస్ ను అందుబాటు లోకి తీసుకు వ‌స్తున్న‌టువంటి కొన్ని ఎంపిక చేసిన న‌గ‌రాల్లో వారాణ‌సీ కూడా ఒక న‌గ‌రంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు.

న‌గ‌రంలో ప‌రివ‌ర్త‌న తీసుకురావాలన్న ఈ ఉమ్మ‌డి సంకల్పాన్ని నెర‌వేర్చే దిశ‌గా వారాణ‌సీ ప్ర‌జ‌లు వారిని వారు అంకితం చేసుకోవాలంటూ ప్ర‌ధాన మంత్రి పిలుపునిచ్చారు.

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Manufacturing to hit 25% of GDP as India builds toward $25 trillion industrial vision: BCG report

Media Coverage

Manufacturing to hit 25% of GDP as India builds toward $25 trillion industrial vision: BCG report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 డిసెంబర్ 2025
December 12, 2025

Citizens Celebrate Achievements Under PM Modi's Helm: From Manufacturing Might to Green Innovations – India's Unstoppable Surge