షేర్ చేయండి
 
Comments
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి
బ్యాంకులను గ్రామస్థులు మరియు పేదలు గృహాలకు తీసుకురావడం ద్వారా ఐ పి పి బి ఆర్థిక మార్పుకు దారి తీస్తుంది: ప్రధాని మోదీ
ఐపిపిబి ద్వారా, బ్యాంకింగ్ సేవలు దేశం యొక్క ప్రతి మూలకీ చేరుకుంటాయి: ప్రధాని మోదీ
ఎన్పిఏ గందరగోళానికి యుపిఎ ప్రభుత్వమే కారణం: ప్రధాని మోదీ
నాందార్లు (కాంగ్రెస్) దేశం యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని ఒక అయోమయ స్థితిలో పెట్టారని ప్రధాని మోదీ అన్నారు
భారీ ఎగవేత దారులపై తీవ్ర చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నాం: ప్రధాని మోదీ

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) ని న్యూ ఢిల్లీ లోని తాల్ క‌టోరా స్టేడియ‌మ్ లో ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని దేశ‌వ్యాప్తంగా 3000 కు పైగా ప్ర‌దేశాల‌ లో వీక్షించ‌డ‌మైంది. ఆయా ప్ర‌దేశాల‌ను ఢిల్లీ లోని ప్ర‌ధాన కార్య‌క్ర‌మం తో సంధానించారు. 
ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా దేశం లోని మారుమూల ప్రాంతాల‌కు, అక్క‌డ నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల‌కు బ్యాకింగ్ సేవ‌ల‌ను సౌక‌ర్య‌వంతంగా అందించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

ఆర్థిక స‌మ్మిళితం ల‌క్ష్యాన్ని సాధించడం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఇంత‌కు ముందు ‘జ‌న్ ధ‌న్ యోజ‌న’ ను ప్ర‌వేశ పెట్టిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. నేటి ఐపిపిబి ఆరంభం ఈ ల‌క్ష్య సాధ‌నకై వేసిన‌టువంటి మ‌రొక అడుగు అంటూ ఆయ‌న అభివ‌ర్ణించారు. ఈ రోజు 650 జిల్లాల్లో ఐపిపిబి శాఖ‌లు ఆరంభమయ్యాయ‌ని ఆయ‌న తెలిపారు.
పోస్ట్ మన్ కు ప‌ల్లెల్లో చాలా కాలంగా గౌర‌వం ల‌భిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం తెర మీద‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ కూడా పోస్ట్ మ‌న్ ప‌ట్ల ఉన్న న‌మ్మ‌కం అలాగే కొన‌సాగుతోంద‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న నిర్మాణాల‌ను, స్వ‌రూపాల‌ను సంస్క‌రించ‌డం త‌ద్వారా ఆయా వ్య‌వ‌స్థ‌ ల‌ను మారుతున్న కాలానికి అనుగుణంగా సిద్ధం చేయ‌డం ప్ర‌భుత్వ విధానంగా ఉంద‌ని ఆయ‌న చెప్పారు. దేశం లో 1.5 ల‌క్ష‌ల‌కు పైగా త‌పాలా కార్యాల‌యాలు ప‌ని చేస్తున్నాయని, మూడు ల‌క్ష‌ల‌ మందికి పైగా‘‘గ్రామీణ డాక్ సేవ‌క్‌’’ లు ప్ర‌జ‌ల‌ తో ముడిపడి వున్నార‌ని ఆయ‌న వివ‌రించారు. ఇక ఈ తపాలా కార్యాలయాలు, గ్రామీణ డాక్ సేవక్ లు ఆర్థిక సేవ‌ల‌ను అందించే విధంగా వారికి స్మార్ట్ ఫోన్ లను, ఇంకా డిజిట‌ల్ ఉప‌క‌ర‌ణాల‌ను సమకూర్చి బ‌లోపేతం చేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. 

ఐపిపిబి యొక్క ప్ర‌యోజ‌నాల‌ను గురించి ఆయ‌న వివ‌రిస్తూ, ఇది న‌గ‌దు బ‌దిలీ, ప్ర‌భుత్వం అందించే ప్ర‌యోజ‌నాల బ‌దిలీ, బిల్లు చెల్లింపుల‌తో పాటు పెట్టుబ‌డులు, ఇంకా బీమా త‌దిత‌ర సేవ‌ల‌కు వీలు క‌ల్పిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. ఈ త‌ర‌హా సేవ‌ల‌ను వినియోగ‌దారు ఇంటి ముంగిటకే పోస్ట్ మన్ అంద‌జేస్తార‌ని ఆయ‌న చెప్పారు. డిజిట‌ల్ లావాదేవీల‌ను కూడా ఐపిపిబి అందిస్తుంద‌ని, ‘ప్ర‌ధాన మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న’ వంటి ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాల‌ను రైతుల‌కు అంద‌జేయ‌డం లో తోడ్ప‌డుతుంద‌ని తెలిపారు. 
విచ‌క్ష‌ణ లేకుండా మంజూరైన రుణాల కార‌ణంగా భార‌త‌దేశ బ్యాంకింగ్ రంగం లో తలెత్తిన స‌మ‌స్య‌ల‌ తో 2014వ సంవ‌త్స‌రం నుండి కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి విశ‌దీక‌రించారు. ప్రస్తుత రుణాల‌ను స‌మీక్షించినట్లు, బ్యాంకింగ్ రంగం విష‌యం లో వృత్తిప‌ర‌మైన వైఖ‌రి ని అవ‌లంబించినట్లు ఆయ‌న వివరించారు. ప‌రారైన ఆర్థిక అప‌రాధుల బిల్లు వంటి ఇత‌ర చ‌ర్య‌ల‌ను గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. దోషుల‌ను శిక్షించాల‌న్న‌దే ఈ చర్యల ధ్యేయ‌మ‌ని తెలిపారు.
ప్ర‌స్తుతం 13 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగా ‘ముద్ర’ రుణాల‌ను పేద‌లకు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి స్వ‌తంత్రోపాధి అవ‌కాశాల‌ను సృష్టించేందుకు అంద‌జేయ‌డ‌మైంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఏశియన్ గేమ్స్ లో భార‌త‌దేశం ఇది వ‌ర‌కు ఎన్న‌డూ ఎరుగ‌ని విధంగా త‌న ఉత్త‌మమైనటువంటి ప్ర‌ద‌ర్శ‌న‌ ను క‌న‌బ‌ర‌చింద‌ని, అదే మాదిరిగా ఆర్థిక వ్య‌వ‌స్థ శ్రేష్ట‌మైన వృద్ధి సంఖ్య‌ ల‌ను నమోదు చేసింద‌ని, యావ‌త్తు దేశం ఒక స‌రికొత్త ఆత్మ‌విశ్వాసం తో తొణికిసలాడుతోంద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌జ‌ల స‌మ‌ష్టి కృషి ఫ‌లిత‌మే ఇది అని ఆయ‌న చెప్పారు. ఇవాళ భార‌త‌దేశం ప్ర‌పంచం లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ మాత్ర‌మే కాకుండా శ‌ర వేగంగా పేద‌రికాన్ని నిర్మూలిస్తున్న దేశం గానూ ఉంద‌ని ఆయ‌న అన్నారు.
గ్రామీణ ప్రాంతాల‌లో ప్ర‌తి ఒక్క ఇంటికి, ప్ర‌తి ఒక్క రైతు కు, ప్ర‌తి ఒక్క చిన్న వ్యాపార సంస్థ‌ కు ఆర్థిక సేవ‌ల‌ను అందించ‌డం లో 3 ల‌క్ష‌ల మంది ‘‘డాక్ సేవ‌క్ లు’’ కీల‌క పాత్ర‌ ను పోషించ‌నున్నార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఇటీవ‌లి మాసాల‌లో ‘‘డాక్ సేవ‌క్ ల’’ శ్రేయానికి అనేక చ‌ర్య‌ల‌ను తీసుకొన్న‌ట్లు, అలాగే వారి చిర‌కాల కోర్కె ను నెర‌వేర్చ‌డం జ‌రిగిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. వీటి ఫ‌లితంగా వారి జీతం లో చెప్పుకోద‌గ్గ పెరుగుద‌ల చోటు చేసుకొంద‌న్నారు. రానున్న కొన్ని నెల‌ల్లో దేశ‌మంత‌టా 1.5 ల‌క్ష‌ల‌ కు పైగా త‌పాలా కార్యాల‌యాల‌ కు ఐపిపిబి చేరుకొంటుందన్న విశ్వాసాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
PM Modi at UN: India working towards restoring 2.6 crore hectares of degraded land by 2030

Media Coverage

PM Modi at UN: India working towards restoring 2.6 crore hectares of degraded land by 2030
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 జూన్ 2021
June 15, 2021
షేర్ చేయండి
 
Comments

PM Modi at UN: India working towards restoring 2.6 crore hectares of degraded land by 2030

Modi Govt pursuing reforms to steer India Towards Atmanirbhar Bharat