PM Modi inaugrates SUMUL cattle feed plant, lays Foundation Stone for three Lift Irrigation Schemes
SUMUL has empowered several people, benefited the tribal communities of Gujarat: PM Modi
SUMUL is an example of positive results that can be achieved when Sahkar and Sarkar work together: PM

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ దక్షిణ ప్రాంతంలోని బాజీపుర లో ఎస్ యుఎమ్ యుఎల్ (సుమూల్) పశు దాణా కర్మాగారాన్నిఈ రోజు ప్రారంభించారు. ఆయన మూడు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. అలాగే వ్యారా పట్టణానికీ, తాపీ జిల్లా లోని జేసింహ్ పుర్- దోల్ వాన్ గ్రూపులకు తాగునీటి సరఫరా పథకాన్ని కూడా ఆయన ప్రారంభించారు.

 

 

 

 

ఒక భారీ సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చాలా కాలం క్రితం ఈ ప్రాంతంలో పనిచేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. సూరత్ జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ లిమిటెడ్ (సుమూల్) సమీప ప్రాంతాలలో అనేక మందికి సాధికారితను కల్పించినట్లు ఆయన వివరించారు. ఉమ్బర్ గావ్ నుండి అంబాజీ వరకు వ్యాపించిన ప్రాంతం మార్పు చెందిందని, ఇది గుజరాత్ లోని ఆదివాసీ వర్గాలకు మేలు చేసిందని ప్రధాన మంత్రి అన్నారు. ఇక్కడ సుమూల్ లో సహకార సంఘాలు (కోఆపరేటివ్స్), సర్కార్ (ప్రభుత్వం) కలసి పని చేస్తే సమకూరే సకారాత్మక ఫలితాలను మనం గమనించవచ్చని ప్రధాన మంత్రి చెప్పారు. రైతులు, పాడి కేంద్రాలు సన్నిహితంగా కృషి చేస్తే జరిగే మంచి ఏమిటో సుమూల్ తేటతెల్లం చేస్తుందని కూడా ఆయన అన్నారు.

 

 

తాపీ జిల్లా గుజరాత్ లోని కొత్త జిల్లాలలో ఒకటని, ఈ జిల్లా విశేషమైన పురోగతిని సాధిస్తున్నందుకు తాను చాలా సంతోషిస్తున్నానని ప్రధాన మంత్రి అన్నారు.

వ్యవసాయ రంగంలో అదనపు విలువను జోడించడంపై, తలసరి పాల ఉత్పత్తి ని పెంచడంపై శ్రద్ధ తీసుకోవలసిందంటూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Sacred relics of Buddha from National Museum reach Ladakh as Leh marks Buddha Purnima

Media Coverage

Sacred relics of Buddha from National Museum reach Ladakh as Leh marks Buddha Purnima
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ఉత్సుకత, సకారాత్మక శక్తి... ఇవి విజయాన్ని అందిస్తాయని చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
April 30, 2026

ఉత్సుకత, సకారాత్మక శక్తి... ఇవి మనుషులకు ఎప్పటికీ చురుకుగా ఉండే స్ఫూర్తిని ఇస్తాయని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
పొంగిపొరలే ఈ ఉత్సుకతే ఏ పనిని అయినా సరే, పూర్తి చేయడంలో మనిషికి విజయాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘కర్మశీలురు, శక్తిమంతులైన దేశ ప్రజలే  అన్నింటి కన్న పెద్ద శక్తి  ఏ దేశానికైనా. వారి కృషితోనే అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వారి ప్రయత్నాలతో దేశం సమృద్ధిని, స్వయంసమృద్ధిని, ప్రగతి శిఖరాన్ని అందుకొంటుంది.
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః
కరోతి సఫలం జన్తోః కర్మ యచ్చ కరోతి సః’’ అని పేర్కొన్నారు.
ఉత్సాహం, సకారాత్మక శక్తి మనుషులను వారి పనులలో నిరంతరం చురుకుగా ఉండేటట్లు ప్రేరణను అందిస్తాయి. పొంగి పొర్లుతూ ఉండే ఈ ఉత్సాహమే... మనిషి పూర్తి చేయాలనుకునే  ఏ పనిలోనైనా సాఫల్యాన్ని అందిస్తుందని  ఈ సుభాషితం బోధిస్తోంది.