PM Modi inaugurates International Conference and Exhibition on Sugarcane Value Chain in Pune
Besides the sugar sector, we should also think of globally competitive bamboo products: PM
We cannot ignore the global economy when we are looking at the sugar industry: PM Modi
PM Modi outlines the steps taken by the Union Government for the welfare of farmers
Demonetization of Rs. 500 & Rs. 1000: Farmers will not be taxed, says PM Modi

 

మ‌హారాష్ట్రలోని పుణె లో షుగర్ కేన్ వేల్యూ చెయిన్ – విజన్ 2025 షుగర్ పై అంత‌ర్జాతీయ స‌మావేశం మరియు ప్ర‌ద‌ర్శ‌నను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ఈ రోజు ప్రారంభించారు.

కార్యక్రమ స్థలి అయిన వసంత్ దాదా షుగ‌ర్ ఇన్‌స్టిట్యూట్‌లో చెరకు సాగుపై ప్ర‌త్య‌క్ష ప్ర‌ద‌ర్శ‌న‌ను కూడా ప్ర‌ధాన‌ మంత్రి తిల‌కించారు.

ఈ సంద‌ర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప‌రిశోధ‌న‌లు రైతులకు ఏ విధంగా ఉప‌యోగ‌పడగలుగుతాయన్న అంశంపై మ‌న‌మంతా ఆలోచించాల‌న్నారు. పంచ‌దార రంగంతో పాటు వెదురు ఉత్పత్తులు ప్ర‌పంచ‌ స్థాయిలో పోటీప‌డాలని కూడా మనం ఆలోచించాల‌ని ఆయ‌న సూచించారు.

 

భూమి అధికోత్పత్తి పైన శ్రద్ధ తీసుకోవాల‌ని ప్ర‌ధాన‌ మంత్రి పిలుపునిచ్చారు. దీంతోపాటు కాయ ధాన్యాల అవ‌స‌రాన్ని ప్ర‌స్తావిస్తూ, వీటికి స్థిర‌మైన గిరాకీ ఉంద‌ని స్ప‌ష్టంచేశారు.

చ‌క్కెర ప‌రిశ్ర‌మపై దృష్టి సారించేటప్పుడు ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వస్థ‌ను మనం విస్మ‌రించ‌జాల‌మ‌ని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు.

వ్యవసాయదారుల సంక్షేమం కోసం కేంద్ర ప్ర‌భుత్వం భూ సార కార్డులు, సౌర‌ శ‌క్తి పంపుసెట్లు తదితర చర్యలను తీసుకొందని ప్రధాన మంత్రి వివ‌రించారు.


500 మరియు 1,000 రూపాయ‌ల నోట్ల చెలామణిని ర‌ద్దు చేయాలన్న కేంద్ర ప్ర‌భుత్వ ఇటీవలి నిర్ణ‌యం గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయదారులపై ప‌న్ను విధించబోమని హామీ ఇచ్చారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails ‘important step towards a vibrant democracy’ after Cabinet nod for ‘One Nation One Election’

Media Coverage

PM Modi hails ‘important step towards a vibrant democracy’ after Cabinet nod for ‘One Nation One Election’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 సెప్టెంబర్ 2024
September 19, 2024

India Appreciates the Many Transformative Milestones Under PM Modi’s Visionary Leadership