షేర్ చేయండి
 
Comments
జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్:106 వ సైన్స్ కాంగ్రెస్ వద్ద ప్రధాని మోదీ
మనము మన ఆవిష్కరణ విజ్ఞాన పర్యావరణ వ్యవస్థను పెంచుతుండగా, మనము ఆవిష్కరణ మరియు స్టార్ట్ అప్ లపై దృష్టి పెట్టాలి: ప్రధాని మోదీ
వ్యవసాయ క్షేత్రాలలో పెద్ద డేటా విశ్లేషణ, కృత్రిమ మేధస్సు, బ్లాక్-చైన్ తదితరాలను ఉపయోగించాలి, ప్రత్యేకించి రైతులకు సాపేక్షంగా చిన్న వ్యవసాయ రంగాలు సహాయం: ప్రధాని మోదీ

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ 106వ సమావేశం లో ప్రారంభోప‌న్యాసం చేశారు.

ఈ సంవ‌త్స‌రం ఈ కార్య‌క్ర‌మాని కి ఇతివృత్తం అయినటువంటి ‘ఫ్యూచ‌ర్ ఇండియా: సైన్స్ అండ్ టెక్నాల‌జీ’కి అద్దం పడుతూ ప్ర‌ధాన మంత్రి భార‌త‌దేశం త‌న యొక్క వాస్తవమైన బలం విజ్ఞాన‌ శాస్త్రాన్ని, సాంకేతిక విజ్ఞానాన్ని మరియు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ ల‌ను భార‌త‌ ప్ర‌జ‌ల‌ తో సంధానించ‌డం లో ఉంటుందని పేర్కొన్నారు.

ఆచార్యులు జె.సి. బోస్‌, సి.వి. రామ‌న్, మేఘ్‌నాద్ సాహా, ఇంకా ఎస్‌.ఎన్‌. బోస్ లతో స‌హా గ‌త కాలపు ప్ర‌ముఖ భార‌తీయ శాస్త్రవేత్త‌ ల‌ను ఆయ‌న గుర్తు కు తెచ్చారు. వారు ‘‘క‌నిష్ఠ వ‌న‌రులు’’ మ‌రియు ‘‘గ‌రిష్ట సంఘ‌ర్ష‌ణ’’ ల ద్వారా ప్ర‌జ‌ల‌ కు సేవలను అందించార‌ని ఆయన అన్నారు.

‘‘సాంకేతిక అభివృద్ధి ప‌ట్ల మ‌రియు జాతి నిర్మాణం ప‌ట్ల గాఢ‌త‌ర‌మైన మౌలిక అంత‌ర్ దృష్టి కి వంద‌లాది భార‌తీయ శాస్త్రవేత్త‌ ల జీవితం మ‌రియు వారు సాధించిన కార్యాలు ఓ తిరుగు లేని నిద‌ర్శ‌నం అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. మ‌న విజ్ఞాన శాస్త్ర ఆధునిక దేవాల‌యాల ద్వారా భార‌త‌దేశం త‌న వ‌ర్త‌మానాన్ని మార్పు చేసుకొంటోంద‌ని, అలాగే అది త‌న భ‌విష్య‌త్తు ను ప‌దిల ప‌ర‌చుకోవడం కోసం కూడా కృషి చేస్తోంద‌’’ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

పూర్వ ప్ర‌ధానులు శ్రీ లాల్ బహాదుర్ శాస్త్రి గారి ని మ‌రియు శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ గారి ని ప్ర‌ధాన మంత్రి జ్ఞ‌ప్తి కి తెచ్చుకొంటూ శాస్త్రి గారు మ‌న‌కు ‘‘జయ్ జ‌వాన్, జయ్ కిసాన్’’ నినాదాన్ని ఇచ్చార‌ని, ఈ నినాదానికి ‘‘జయ్ విజ్ఞాన్’’ ను అట‌ల్ గారు జోడించార‌ని వివ‌రించారు. ‘‘జయ్ అనుసంధాన్’’ ను క‌ల‌ప‌డం ద్వారా ప్ర‌స్తుతం మ‌రొక అడుగు ముందుకు వేయవలసిన త‌రుణం ఆస‌న్నం అయింద‌ని శ్రీ మోదీ చెప్పారు.

విస్తారమైనటువంటి లేదా అంతవరకు ఉన్న జ్ఞానాన్ని ఛేదించ‌డం; మరి అలాగే ఆ జ్ఞానాన్ని సామాజిక, ఆర్థిక హితం కోసం వినియోగించ‌డం.. ఈ రెండు ల‌క్ష్యాల‌ను సాధిస్తే విజ్ఞాన శాస్త్ర అనుసరణ గమ్యాన్ని చేరుకోగలదని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

మనం విజ్ఞాన శాస్త్ర అన్వేష‌ణ వ్య‌వ‌స్థ కు ఉత్తేజాన్ని అందించే క్ర‌మం లోనే నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల పైన, ఇంకా స్టార్ట్‌-అప్ ల పైన కూడా తప్పక శ్ర‌ద్ధ వహించాల‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. మ‌న శాస్త్రజ్ఞుల‌ లో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌ ను ప్రోత్సహించ‌డం కోసం ‘అట‌ల్ ఇన‌వేశ‌న్ మిశన్’ను ప్ర‌భుత్వం ప్రారంభించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. గ‌త నాలుగు సంవ‌త్స‌రాల‌ లో- అంత‌క్రితం న‌ల‌భై సంవ‌త్స‌రాల తో పోల్చి చూస్తే- టెక్నాల‌జీ బిజినెస్ ఇంక్యుబేటర్స్ ను మ‌రిన్నింటిని నెల‌కొల్ప‌డం జ‌రిగింద‌ని ఆయ‌న తెలిపారు.

‘‘మ‌న శాస్త్రవేత్త‌ లు త‌క్కువ ఖ‌ర్చు తో కూడిన ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, గృహ నిర్మాణం, స్వ‌చ్ఛ‌మైన గాలి, నీరు ఇంకా శ‌క్తి, వ్య‌వ‌సాయ ఉత్పాద‌క‌త‌, ఇంకా ఫూడ్ ప్రాసెసింగ్ ల వంటి సమ‌స్య‌ల‌ ను తీర్చ‌డం కోసం వారంతట వారు దీక్షాబ‌ద్ధులు కావ‌ల‌సిన ఆవ‌శ్య‌క‌త ఉంది. విజ్ఞాన శాస్త్రం సార్వ‌జ‌నికం గా ఉండాల‌ని, స్థానిక ప‌రిస్థితుల‌కు, అవ‌స‌రాల‌కు త‌గిన‌టువంటి ప‌రిష్కార మార్గాల‌ను అంద‌జేయ‌డం కోసం సాంకేతిక విజ్ఞానం తప్పక స్థానిక‌త‌ ను సంతరించుకోవాల’’ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

వ్య‌వ‌సాయ రంగం లో, ప్ర‌త్యేకించి సాపేక్షం గా చిన్నవైన క‌మ‌తాల ను క‌లిగివున్న రైతుల‌ కు స‌హాయ‌కారి గా బిగ్ డాటా ఆనాలిసిస్‌, ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్‌, బ్లాక్- చైన్ వ‌గైరా ల‌నువినియోగించుకోవాల‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

ప్ర‌జ‌ల జీవ‌నం లో సౌల‌భ్యానికి మెరుగులు దిద్దే దిశ గా కృషి చేయాల‌ని శాస్త్రవేత్త‌ల‌ కు ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సంద‌ర్భం గా వ‌ర్ష‌పాతం త‌క్కు గా ఉండే ప్రాంతాల లో అనావృష్టి ప‌రిస్థితుల ను ఏ విధంగా అధిగ‌మించాలి; ముంద‌స్తుగా విప‌త్తు ల‌ను అంచ‌నా వేసి హెచ్చ‌రించే వ్య‌వ‌స్థ‌ లు; పోష‌క ఆహార లోపాన్ని అధిగ‌మించ‌డం; మెదడువాపు వ్యాధి వంటి బాలలకు వచ్చే వ్యాధుల నివార‌ణ‌; స్వచ్ఛమైన త్రాగునీరు; ఇంకా సైబ‌ర్ సెక్యూరిటీ ల వంటి అంశాల‌ ను ఆయ‌న ప్ర‌స్తావించారు.

2018వ సంవ‌త్స‌రం లో భార‌త‌దేశ విజ్ఞాన శాస్త్రం సాధించిన ఘ‌నత ల‌ను గురించి ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు: వీటిలో –

• ఏవియేష‌న్ గ్రేడ్ బ‌యోఫ్యూయ‌ల్ యొక్క ఉత్ప‌త్తి;

• దృష్టి జ్ఞానాని కి నోచుకోని వారికి ఉద్దేశించిన ‘‘దివ్య న‌య‌న్’’ యంత్రం;

• సర్వైకల్ కేన్స‌ర్‌, టిబి, ఇంకా డేంగీ ల రోగ నిర్ధార‌ణ కు త‌క్కువ ఖ‌రీదు తో కూడినటువంటి ఉప‌క‌ర‌ణాలు

• సిక్కిం- దార్జిలింగ్ ప్రాంతం లో కొండ చ‌రియ‌లకు సంబంధించిన హెచ్చ‌రిక‌ ల‌ను గురించి వాస్త‌వ కాల ప్రాతిప‌దిక‌ న హెచ్చరించే వ్య‌వ‌స్థ-
వంటివి ఉన్నాయి.

మ‌న ప‌రిశోధన, ఇంకా అభివృద్ధి (ఆర్ & డి) సంబంధిత కార్య సాధ‌న‌ ల కు పెద్ద‌ గా ఖ‌ర్చు పెట్ట‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉండ‌కుండా చూసేందుకుగాను పారిశ్రామిక ఉత్ప‌త్తుల ద్వారా వాణిజ్యీక‌ర‌ణ‌ కు త‌గిన మార్గాల‌ ను అన్వేషించ వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు.

క‌ళ‌లు, మాన‌వ శాస్త్రాలు, సాంఘిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, ఇంకా సాంకేతిక విజ్ఞానాల మేలు కలయిక తో ప‌రిశోధ‌న సాగాలంటూ ప్ర‌ధాన మంత్రి పిలుపునిచ్చారు.

మ‌న జాతీయ ప్ర‌యోగ శాల‌లు, కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యాలు, ఐఐటి లు, ఐఐఎస్‌సి లు, టిఐఎఫ్ఆర్, ఇంకా ఐఐఎస్ఇఆర్ లు వెన్నెముక గా ప‌రిశోధ‌న, ఇంకా అభివృద్ధి ల‌లో మ‌న యొక్క బ‌లాలు రూపుదిద్దుకొన్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి చెప్తూ, రాష్ట్ర విశ్వ‌విద్యాల‌యాలు, క‌ళాశాల‌ల్లో కూడా ఒక దృఢ‌మైన ప‌రిశోధ‌న సంబంధ వ్యవస్థ ను అభివృద్ధిప‌ర‌చాల‌ని ఆయన సూచించారు.

కేంద్ర ప్ర‌భుత్వం 3,600 కోట్ల రూపాయ‌ల‌కు పైగా పెట్టుబ‌డి తో నేశ‌న‌ల్ మిశ‌న్ ఆన్ ఇంట‌ర్ డిసిప్లినరీ సైబ‌ర్ ఫిజిక‌ల్ సిస్ట‌మ్స్ కు ఆమోదం తెలిపినట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ మిశ‌న్ ఆర్ & డి, సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి, మాన‌వ వ‌న‌రులు మ‌రియు నైపుణ్యాలు, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు, స్టార్ట్‌-అప్‌ ఇకో సిస్ట‌మ్‌, ఇంకా శ‌క్తియుత‌మైన ప‌రిశ్ర‌మ మ‌రియు అంత‌ర్జాతీయ స‌హ‌కారాల ను ఒకదానికి మ‌రొకటి అడ్డురాని విధం గా ప‌ర్య‌వేక్షిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.

అంత‌రిక్ష రంగం విజ‌యాల‌ ను గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, కార్టోశాట్ 2, ఇంకా ఇత‌ర ఉప‌గ్ర‌హాల సాఫ‌ల్యాన్ని ప్ర‌స్తావించారు. 2022వ సంవ‌త్స‌రం లో ‘గ‌గ‌న్ యాన్’ ద్వారా ముగ్గురు భార‌తీయుల‌ను రోద‌సి లోకి పంపేందుకు స‌న్నాహాలు సాగుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ప‌రిశోధ‌నల్లో భాగం గా సికిల్ సెల్ ఆనీమియా కు ఒక ప్ర‌భావ‌శీల ప‌రిష్కారాన్ని క‌నుగొన‌డం మొద‌లైనందుకు ఆయ‌న హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు.

విజ్ఞాన శాస్త్రం మ‌రియు సాంకేతిక విజ్ఞాన రంగం లో స‌ముచిత‌మైనటు వంటి ఉన్న‌త ఆవిష్క‌ర‌ణ‌ల‌ కు మార్గాన్ని సుగ‌మం చేయ‌డం లో ‘ప్రైమ్ మినిస్ట‌ర్స్ సైన్స్‌, టెక్నాల‌జీ అండ్ ఇన‌వేశ‌న్ అడ్వైజ‌రీ కౌన్సిల్’ తోడ్ప‌నుంద‌ని ఆయ‌న తెలిపారు.

‘ప్రైమ్ మినిస్ట‌ర్స్ రిస‌ర్చ్ ఫెలోస్’ ప‌థ‌కాన్ని మేము ప్రారంభించాం. దీని ద్వారా దేశం లో అత్యుత్త‌మ సంస్థ‌ ల నుండి ఒక వేయి మంది మేధావులకు ఐఐటి లు మ‌రియు ఐఐఎస్ లలో పిహెచ్‌.డి ప్రోగ్రాముల‌ లో నేరు గా ప్ర‌వేశం ల‌భించ‌గ‌ల‌ద‌ని తెలిపారు. ప్ర‌తిష్టాత్మ‌క విద్యా సంస్థల లో బోధ‌న సిబ్బంది కొర‌త స‌మ‌స్య‌ ను ఈ ప‌థ‌కం తీర్చ‌గ‌లుగుతుంద‌ని, గుణాత్మ‌క‌ పరిశోధ‌న‌ కు ఇది బాట వేయ‌గ‌లుగుతుంద‌ని కూడా ఆయ‌న చెప్పారు.

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
జమ్మూ కశ్మీర్ లోని నౌషేరాలో దీపావళి సందర్భంగా భారత సాయుధ బలగాల సైనికులతో ప్రధాన మంత్రి సంభాషణ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

జమ్మూ కశ్మీర్ లోని నౌషేరాలో దీపావళి సందర్భంగా భారత సాయుధ బలగాల సైనికులతో ప్రధాన మంత్రి సంభాషణ పాఠం
Capital expenditure of States more than doubles to ₹1.71-lakh crore as of Q2

Media Coverage

Capital expenditure of States more than doubles to ₹1.71-lakh crore as of Q2
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 6 డిసెంబర్ 2021
December 06, 2021
షేర్ చేయండి
 
Comments

India takes pride in the world’s largest vaccination drive reaching 50% double dose coverage!

Citizens hail Modi Govt’s commitment to ‘reform, perform and transform’.