PM Modi congratulates Commonwealth Games medal winners

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కామ‌న్‌ వెల్త్ గేమ్స్ లో ప‌త‌కాలను గెలుచుకొన్న వారికి అభినంద‌న‌లు తెలిపారు.

వెయిట్‌లిఫ్ట‌ర్ల‌ ను ప్ర‌ధాన మంత్రి అభినందిస్తూ, ‘‘స్వ‌ర్ణాన్ని సాధించిన శ్రీ రాగాల వెంక‌ట్ రాహుల్ ను చూసి గ‌ర్విస్తున్నాను. మ‌న వెయిట్ లిఫ్ట‌ర్లు అసాధార‌ణంగా రాణించిన తీరు మ‌రింత మంది యువ‌తీ యువ‌కులు వెయిట్‌లిఫ్టింగ్ ను అనుస‌రించే విధంగా వారిని ప్రోత్సహించగలద‌ని నేను న‌మ్ముతున్నాను.

మ‌హిళ‌ల 69 కిలోగ్రాముల వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్ లో పసిడి ప‌త‌కాన్ని సాధించిన పూన‌మ్ యాద‌వ్ ను భార‌త‌దేశం అభినందిస్తోంది. వెయిట్‌లిఫ్టింగ్ ప‌ట్ల ఆమె కనబరచినటువంటి అంకిత భావం నిజంగా ప్ర‌శంసనీయం’’ అని త‌న సందేశంలో పేర్కొన్నారు.

షూట‌ర్ల కు ప్ర‌ధాన మంత్రి అభినందనలు తెలియజేస్తూ, ‘‘2018 కామ‌న్‌ వెల్త్ గేమ్స్ లో మ‌న షూట‌ర్లు వారి ప్ర‌త్యేక‌త‌ ను చాటుకొంటున్నారు. మ‌నూ భాక‌ర్ 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్ ఈవెంట్ లో త‌న గొప్పత‌నాన్ని కాపాడుకొంటూ స్వ‌ర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకొన్నారు. ఆమెకు ఇవే నా అభినంద‌న‌లు.

మ‌హిళ‌ల 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ర్ ఈవెంట్ లో ర‌జ‌తాన్ని హీనా సిద్ధూ చేజిక్కించుకోవ‌డం సంతోష‌దాయ‌కం. ఆమెకు ఇవే నా అభినంద‌న‌లు. ఆమె త‌న భావి ప్ర‌య‌త్నాల‌ లోనూ రాణించాలి.

వ‌ర్ధ‌మాన షూట‌ర్ ర‌వి కుమార్ పురుషుల 10 మీట‌ర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో కాంస్యాన్ని చేజిక్కించుకొన్నాడు. ఆయ‌న విజ‌యాన్ని చూసుకొని ప్ర‌తి ఒక్క భార‌తీయుడు కూడా గ‌ర్వ‌ప‌డుతున్నాడు. ఈ యువ షూట‌ర్ క్రీడా రంగానికి ఒక ఘ‌న‌మైన తోడ్పాటు ను అందించాడు’’ అని త‌న సందేశంలో పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Cotton duty relief: Textile industry welcomes import tax waiver, sees boost for exports and MSMEs

Media Coverage

Cotton duty relief: Textile industry welcomes import tax waiver, sees boost for exports and MSMEs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 31 మే 2026
May 31, 2026

India’s Golden Chapter: Maritime Might, Digital Revolution & Nari Shakti Under PM Modi