షేర్ చేయండి
 
Comments
Today, India is inspiring to become a 5 trillion dollar economy: PM Modi
India’s innovation is a great blend of Economics and Utility. IIT Madras is born in that tradition: PM
We have worked to create a robust ecosystem for innovation, for incubation for research and development in our country: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన ఇండియ‌న్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, మ‌ద్రాస్ యొక్క 56వ స్నాత‌కోత్స‌వాని కి హాజ‌ర‌య్యారు.  స‌భికుల‌ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, ‘‘నా ఎదుట బుల్లి భార‌త‌దేశం యొక్క స్ఫూర్తి తో పాటు ‘న్యూ ఇండియా’ యొక్క స్ఫూర్తి కూడా క‌నిపిస్తోంది.  ఇక్క‌డ అంతా శ‌క్తి, హుషారు, ఇంకా స‌కారాత్మ‌కత లు కొలువుదీరాయి.  భ‌విష్య‌త్తు తాలూకు స్వ‌ప్నాల‌ ను మీ కళ్ల లో నేను చూడ‌గ‌లుగుతున్నాను.  భార‌త‌దేశం యొక్క భ‌విత‌వ్యాన్ని మీ న‌య‌నాల లో నేను గ‌మ‌నించ‌ గ‌లుగుతున్నాను’’ అన్నారు.

 

ప‌ట్టాలు పొంద‌నున్న విద్యార్థుల‌ కు, వారి అధ్యాపకుల కు మ‌రియు త‌ల్లి తండ్రుల‌ కు ప్ర‌ధాన మంత్రి శుభాకాంక్షలు చెప్తూ, స‌హాయ‌క సిబ్బంది ని కూడా ప్రశంసించారు.  ‘‘స‌హాయక సిబ్బంది పాత్ర ను గురించి కూడా నేను ప్ర‌ముఖం గా ప్ర‌స్తావించ‌ద‌ల‌చాను.  మీకు త‌ర‌గ‌తి గ‌దుల ను, వ‌స‌తి గృహాల ను ప‌రిశుభ్రం గా ఉంచినటువంటి, మీ కోసం ఆహారాన్ని త‌యారు చేసిన‌టువంటి వ్య‌క్తుల నిశ్శ‌బ్ధ శ్ర‌మ‌ ను  గుర్తుచేయద‌ల‌చాను’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు

భార‌త‌దేశం యొక్క యువ‌జ‌నుల సామార్ధ్యాల ప‌ట్ల విశ్వాసం నెలకొంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ‘‘అమెరికా లో నేను ప‌ర్య‌టించిన కాలం లో, మా మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌ల లో ఒక ఉమ్మడి అంశం చోటు చేసుకొంది.  అది ‘న్యూ ఇండియా’ను గురించిన ఆశాభావం.  భార‌తీయ స‌ముదాయం ప్ర‌పంచ వ్యాప్తం గా, మ‌రీ ముఖ్యం గా విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఇంకా నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల ప‌రంగా త‌న‌కంటూ ఒక ముద్ర ను సంపాదించుకొంది.  దీనికి వెన్నుదన్ను గా ఉన్నది ఎవ‌రు ?  వారి లో చాలా మంది ఐఐటి లో మీకు సీనియ‌ర్ లుగా ఉన్న వారే.  బ్రాండ్ ఇండియా ను మీరంతా ప్ర‌పంచ వ్యాప్తం గా బ‌ల‌వ‌త్త‌రం గా మార్చుతున్నారు’’ అని ఆయన అన్నారు.

 

 

 ‘‘ప్ర‌స్తుతం భార‌త‌దేశం 5 బిలియ‌న్ డాల‌ర్ విలువైన ఆర్థిక వ్య‌వ‌స్థ గా ఎద‌గాల‌ని త‌పిస్తున్న నేప‌థ్యం లో, ఈ క‌ల‌ ను పండించేది మీ యొక్క నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ మ‌రియు సాంకేతిక విజ్ఞానం తాలూకు ఆకాంక్ష‌ లే.  అత్యంత స్ప‌ర్ధాత్మ‌క ఆర్థిక వ్య‌వ‌స్థ గా రూపొంద‌డం లో భార‌త‌దేశాని కి ఒక బ‌ల‌మైన పునాది ని అవి ఏర్ప‌ర‌చ గ‌లుగుతాయి.  భార‌త‌దేశం యొక్క నూత‌న ఆవిష్క‌ర‌ణల లో సేవ‌, మ‌రియు ఆర్థిక శాస్త్రం ఈ రెండింటి తాలూకు ఒక గొప్ప మిశ్రణం ఉంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

మ‌న దేశం లో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు మ‌రియు ప‌రిశోధ‌న ల కోసం ఒక ప‌టిష్ట‌మైన ఇకో సిస్ట‌మ్ ను సృష్టించ‌డం కోసం మేము కృషి చేశాము.  అనేక విద్యా సంస్థ‌ల లో అట‌ల్ ఇంక్యుబేశ‌న్ సెంట‌ర్ ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంది.  స్టార్ట్– అప్ ల‌ కోసం ఒక మార్కెట్ ను అన్వేషించ‌డ‌మే దీని కి త‌రువాయి గా చేపట్టే చ‌ర్య అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

 

 

‘‘మీ యొక్క క‌ఠోర శ్ర‌మ అసాధ్యాన్ని సాధ్యం చేసేసింది.  మీ కోసం ఎన్నో అవ‌కాశాలు ఎదురు చూస్తూ ఉన్నాయి, వాటి లో అన్నీ సుల‌భ‌మైన‌వి కాదు.  ఎన్న‌డూ స్వ‌ప్నించ‌డం మానివేయ‌కండి.  మిమ్మ‌ల్ని మీరు స‌వాలు చేసుకొంటూ ఉండండి.  ఆ విధం గా మీరు మీ లోప‌లి ఒక ఉత్త‌మ‌మైన మ‌నిషి గా రూపొంద‌గ‌లుగుతారు’’ అంటూ ప్ర‌ధాన మంత్రి ఉద్భోదించారు. 

‘‘మీరు ఎక్క‌డ ప‌ని చేస్తున్నప్పటికీ,  మీరు ఎక్క‌డ నివ‌సిస్తున్నప్పటికీ మీ యొక్క‌ స్వ‌దేశం అవ‌స‌రాల‌ ను కూడా దృష్టి లో పెట్టుకోండి.  మీ ప‌ని ని గురించి, మీ ప‌రిశోధ‌న ను గురించి ఆలోచించండి.  నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ లు మీ మాతృదేశాని కి స‌హాయ‌కారి గా నిలుస్తాయి.  ఇది మీ సామాజిక బాధ్య‌త కూడా’’ అని ప్ర‌ధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

 

 

 ‘‘ఈ రోజు న ఒక స‌మాజం గా ఒకే సారి ఉప‌యోగించే ప్లాస్టిక్స్ క‌న్నా ముందుకు సాగాల‌ని మ‌నం అభిల‌షిస్తున్నాము.  అదే విధ‌మైన ఉప‌యోగాన్ని అందిస్తూనే, అటువంటి లోటుపాట్లు మాత్రం ఉండ‌న‌టువంటి ప‌ర్యావ‌ర‌ణ మైత్రీ పూర్వ‌క‌ ప్ర‌త్యామ్నాయం ఏది ఉండ‌వ‌చ్చును ?  దాని కోసం మీ వంటి యువ నూత‌న ఆవిష్క‌ర్త‌ల కేసి మేము చూస్తున్నాము.  ఎప్పుడ‌యితే సాంకేతిక విజ్ఞానం అనేది డేటా సైన్స్, డయాగ్నోస్టిక్స్, బిహేవియరల్ సైన్స్ ఇంకా ఔషధాల‌ తో ముడిప‌డుతుందో అప్పుడు ఆస‌క్తిదాయ‌క‌మైన అంత‌ర్ దృష్టులు ఆవిర్భ‌వించ‌ గ‌లుగుతాయి’’ అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. 

‘‘రెండు ర‌కాలైన మ‌నుషులు ఉన్నారు.  ఒక‌రు జీవిస్తున్న వారు, మ‌రొక ర‌కం మ‌నుషులు ఉనికి లో ఉండ‌న‌టువంటి వారూను’’ అంటూ, స్వామి వివేక‌నందుల వారి మాటల ను ప్ర‌ధాన మంత్రి ఉటంకించారు. 

 

 

ఇత‌రుల కోసం జీవించే వారు ఒక సంతోష‌దాయ‌క‌మైనటువంటి మ‌రియు తృప్తి తో కూడినటువంటి జీవ‌నాన్ని గ‌డుపుతార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  విద్య మ‌రియు జ్ఞానార్జ‌న ప్ర‌క్రియ‌లు నిరంత‌రంగా సాగేట‌టువంటివి అని చెప్తూ ఆయ‌న త‌న ప్ర‌సంగాన్ని ముగించారు. విద్యా సంస్థ‌ ను వీడి వెళ్ళిన త‌రువాత కూడా నేర్చుకొంటూనే ఉండాల‌ని, అన్వేష‌ణ ను కొన‌సాగించాల‌ని విద్యార్థుల‌ ను ఆయ‌న అభ్య‌ర్ధించారు.  

 

 

 

 

 

 

 

Click here to read full text speech

విరాళం
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
BRICS summit to focus on strengthening counter-terror cooperation: PM Modi

Media Coverage

BRICS summit to focus on strengthening counter-terror cooperation: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 నవంబర్ 2019
November 13, 2019
షేర్ చేయండి
 
Comments

PM Narendra Modi reaches Brazil for the BRICS Summit; To put forth India’s interests & agenda in the 5 Nation Conference

Showering appreciation, UN thanks India for gifting solar panels

New India on the rise under the leadership of PM Narendra Modi