నరేంద్ర మోదీ మొబైల్ అప్లికేషన్ ద్వారా బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలతో మరియు బిజెపి కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ ముఖాముఖి నిర్వహించారు. పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ, అట్టడుగు స్థాయిలో వారి చేస్తున్న కృషిని ప్రశంసించారు. ప్రజలతో వారి అనుసంధానం కిందిస్థాయికి పథకాలు నేరుగా చేరుకునేలా, ప్రజా సమస్యలు శాసనకర్తలకు అందించడం ద్వారా సానుకూలంగా మారిందని చెప్పారు.


