మంగళప్రదమైన మకర సంక్రాంతి సందర్భంలో ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘దేశవాసులకు మకర సంక్రాంతి నాడు ఇవే అనేకానేక శుభాకాంక్షలు. ఉత్తరాయణ సూర్య భగవానుడు అందరి జీవనం లో కొత్త శక్తి ని, నూతనోత్సాహాన్ని నింపాలి అని నేను కోరుకొంటున్నాను.
ప్రతి ఒక్కరి కి మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
మకర సంక్రాంతి భారతదేశం లో అనేక ప్రాంతాల లో ఉత్సాహానికి ప్రతీక గా నిలుస్తుంది. ఈ మంగళప్రదమైనటువంటి పండుగ భారతదేశం లోని వైవిధ్యాన్ని, మన సంప్రదాయాలు అంటే మనకు ఉన్న మక్కువ ను కూడా చాటిచెప్తుంది. ప్రకృతి మాత ను గౌరవవించుకోవడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని సైతం ఈ పండుగ రోజు మరో మారు స్పష్టం చేస్తున్నది’’ అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.
देशवासियों को मकर संक्रांति की बहुत-बहुत बधाई। मेरी कामना है कि उत्तरायण सूर्यदेव सभी के जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करें।
— Narendra Modi (@narendramodi) January 14, 2021
Makar Sankranti greetings to everyone.


