నాగాలాండ్ ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
“నాగాలాండ్ ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా ఇవే నా అభినందనలు. ఈ రాష్ట్రంలో అపరిమితమైన ప్రకృతి సౌందర్యంతో పాటు కష్టపడి పని చేసే పౌరులు కూడా ఉన్నారు. రానున్న కాలంలో అభివృద్ధి పరంగా ఈ రాష్ట్రం నూతన శిఖరాలకు చేరుకోవాలంటూ ఆ ఈశ్వరుడిని నేను ప్రార్థిస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
On the occasion of their Statehood Day, I convey my greetings to the people of Nagaland. This state is blessed with immense natural beauty and industrious citizens. I pray that the state scales new heights of development in the times to come.
— Narendra Modi (@narendramodi) December 1, 2017


