గోధుమల సరఫరా, నిలవ మరియు ఎగుమతుల కు సంబంధించిన వివిధ అంశాల ను సమీక్షించడం కోసం ఏర్పాటైన ఒక సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
ఆయా అంశాల పై ఒక సమగ్రమైన నివేదిక ను ప్రధాన మంత్రి కి వివరించడం జరిగింది. పంట ల ఉత్పత్తి పై 2022వ సంవత్సరం మార్చి-ఏప్రిల్ నెలల్లో ఉండే అధిక ఉష్ణోగ్రత ల ప్రభావాన్ని గురించి ఆయన కు తెలియజేయడమైంది. గోధుమ సేకరణ మరియు ఎగుమతి ల స్థితి ని ఈ సమావేశం లో సమీక్షించారు.
భారతదేశం లో వ్యావసాయిక ఉత్పత్తుల కు డిమాండు అధికం అవుతున్న నేపథ్యం లో, నాణ్యత పరమైన నియమాల ను మరియు ప్రమాణాల ను పాటించేందుకు అన్ని చర్యల ను తీసుకోవాలని ప్రధాన మంత్రి ఆదేశించారు. అలా అన్ని చర్యల ను తీసుకొంటే ఆహార ధాన్యాల కు మరియు ఇతర వ్యావసాయిక ఉత్పత్తుల కు భరోసా తో కూడినటువంటి ఒక మూలం గా భారతదేశం రూపొందగలుగుతుందని ఆయన అన్నారు. రైతుల కు వీలైనంత అధికం గా సాయం అందేటట్లు చూడవలసిందని కూడా అధికారుల కు ఆయన సూచించారు. బజారు లో ప్రస్తుతం ధరలు రైతుల కు ప్రయోజనకరం గా ఉన్నాయన్న విషయాన్ని సైతం ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు రావడమైంది.
ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి, సలహాదారులు, కేబినెట్ సెక్రట్రి, ఆహారం మరియు సార్వజనిక వితరణ వ్యవస్థ (పిడిఎస్) విభాగం, ఇంకా వ్యవసాయ విభాగం ల కార్యదర్శులు ఈ సమావేశాని కి హాజరయ్యారు.


