మత్స్యకారుల జీవితాల్లో సానుకూల మార్పు దిశగా తమ ప్రభుత్వం ఎంతో శ్రమిస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇందులో భాగంగా రుణం సౌలభ్యానికి హామీ ఇవ్వడంతోపాటు అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చిందన్నారు. అంతేకాకుండా మౌలిక సదుపాయాల ఉన్నతీకరణసహా మరెన్నో చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు.
ఈ మేరకు మత్స్య-పశుసంవర్ధక-పాడిపరిశ్రమ శాఖ మంత్రి ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“ఇదో ఉత్తమ పని విధానం.. మన మత్స్యకారుల జీవితాల్లో సానుకూల మార్పు దిశగా మా ప్రభుత్వం ఎనలేని కృషిచేస్తోంది. ఇందులో భాగంగా రుణ సౌలభ్యానికి భరోసా ఇచ్చింది. అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తేవడంతోపాటు మౌలిక సదుపాయాల మెరుగుదలసహా మరెన్నో చర్యలు చేపట్టింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Good trend. Our Government is doing a lot of work to bring a positive change in the lives of our fishermen including ensuring easier access to credit, making latest technology available, upgrading infrastructure and more. https://t.co/vPgb1667QL
— Narendra Modi (@narendramodi) April 6, 2023


