మన సాయుధ బలగాల అభ్యున్నతి పట్ల ప్రభుత్వ అంకితభావానికి ఓఆర్ఓపీ గుర్తు: ప్రధానమంత్రి

మన దేశ ప్రజల ప్రాణాలను రక్షించే కర్తవ్య పాలనలో మన త్రివిధ దళాల వరిష్ఠ ఉద్యోగులతో పాటు మాజీ సైనిక సిబ్బంది ధైర్య సాహసాలకు, వారు చేసిన త్యాగాలకు గుర్తుగా మనం అందించిన ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ (ఓఆర్ఓపీ) పథకం నిలుస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఓఆర్ఓపీ పథకాన్ని ప్రారంభించి నేటికి పదేళ్ళు పూర్తి అయ్యాయి. ఈ పథకం కోసం చాలా కాలంగా ఉన్న డిమాండును నెరవేర్చడమే కాకుండా, మన వీరులకు దేశం అందిస్తున్న గౌరవంగా ఆయన పేర్కొన్నారు. మన సాయుధ బలగాలను శక్తిమంతం చేయడం కోసం, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం సాధ్యమైనంతగా కృషి చేస్తూనే ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.

సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో శ్రీ నరేంద్ర మోదీ ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘ఓఆర్ఓపీని అమల్లోకి తీసుకువచ్చింది ఈ రోజే. దేశ ప్రజలను కాపాడడానికి జీవితాలను అంకితం చేసే మన సైన్యంలోని వరిష్ఠ ఉద్యోగులు, మాజీ సైనిక సిబ్బంది ధైర్య సాహసాలకు, త్యాగాలకు ఇది ఒక ప్రత్యేక గౌరవం. ఓఆర్ఓపీ అమలుచేయాలంటూ చాలా కాలంగా డిమాండు ఉంది. ఆ డిమాండును నెరవేర్చి, మన వీరులకు మన దేశ ప్రజలు ఎంతటి కృతజ్ఞతా భావంతో ఉన్నదీ పునరుద్ఘాటించేందుకు తీసుకొన్న ఒక ముఖ్య నిర్ణయం- ఓఆర్ఓపీ.

‘గత పదేళ్ళలో లక్షల కొద్దీ పించనుదారులకు, పించనుదారుల కుటుంబాలకూ లబ్ధి చేకూర్చడం ద్వారా ఈ పథకం మిమ్మల్ని ఆనందంగా ఉంచుతుంది. అంకెల్ని పక్కన పెడితే, మన సాయుధ దళాల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగా కట్టుబడి ఉన్నదీ ఓఆర్ఓపీ చాటిచెబుతున్నది. మన సాయుధ బలగాలను శక్తిమంతం చేయడానికీ, మరి మనకు సేవలను అందిస్తున్న వారి సంక్షేమాన్ని మరింతగా పెంచడానికి సాధ్యమయ్యే సకల ప్రయత్నాలను మేం ఎప్పటికీ చేస్తూనే ఉంటాం. #OneRankOnePension’’

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Rolls-Royce joins with HAL at the wheel to make India a major aerospace hub

Media Coverage

Rolls-Royce joins with HAL at the wheel to make India a major aerospace hub
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 మే 2026
May 15, 2026

Viksit Bharat Unleashed: PM Modi's Blueprint Delivers Energy Independence, Tech Boom, and Diplomatic Dominance