ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఫ్రాన్స్ పూర్వ అధ్యక్షుడు శ్రీ నికోలస్ సర్కోజీ ఈ రోజు సమావేశమయ్యారు.
నోట్ల చెలామణీ రద్దు విజయవంతం అయినందుకు, పలు రాష్ట్రాల విధాన సభలకు ఇటీవల జరిగిన ఎన్నికలలో ప్రధాన మంత్రి యొక్క పార్టీ గెలిచినందుకు ప్రధాన మంత్రికి శ్రీ సర్కోజీ అభినందనలు తెలియజేశారు.
ప్రధాన మంత్రి కూడా శ్రీ సర్కోజీ తాజా పుస్తకం “Tout pour la France” ప్రచురణ కావడం, మంచి ఆదరణకు నోచుకోవడం పట్ల శ్రీ సర్కోజీకి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఇరువురు నేతలూ వారికి ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంశాలపైన, ప్రపంచ అంశాలపైన చర్చ జరిపారు.
Former President of France, Mr. @NicolasSarkozy met PM @narendramodi in New Delhi. pic.twitter.com/oADA6oPWC3
— PMO India (@PMOIndia) March 18, 2017


