శ్రీరామ్ కామర్స్ కాలేజీ పాలక మండలి సభ్యుల ప్రతినిధి బృందం ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసింది. విద్యాపరమైన ఉన్నతి, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్న సంస్థకు ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవుతున్నాయనీ, సంస్థ విశిష్ట ప్రస్థానంలో ఇదొక కీలకమైన మైలురాయి అనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఉన్నత విద్యారంగానికి కళాశాల దీర్ఘకాలిక సేవలనూ, తరతరాలుగా విభిన్న రంగాల్లో నిపుణులను తీర్చిదిద్దడంలో సంస్థ పాత్రను ఆయన కొనియాడారు.

శ్రీరామ్ కామర్స్ కాలేజీ శత వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఒక స్మారక తపాలా స్టాంపును కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన శ్రీరామ్ కామర్స్ కాలేజీ పాలక మండలి ప్రతినిధి బృందాన్ని కలిశాను. ఈ ఏడాది సంస్థ వందో వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా ఒక స్మారక స్టాంపును కూడా విడుదల చేశాం. సంస్థకు నా శుభాకాంక్షలు.’’ 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi Gains 1.1 Million Followers Overnight After His Candid Reel On NEET Row Goes Insanely Viral

Media Coverage

PM Modi Gains 1.1 Million Followers Overnight After His Candid Reel On NEET Row Goes Insanely Viral
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 జూలై 2026
July 24, 2026

Aatmanirbhar in Action — Space, Missiles, EVs & Livelihoods Under PM Modi’s Watch