క్ర.సం.

అవగాహన ఒప్పందఒప్పందం/ ఆసక్తి వ్యక్తీకరణ

వివరణ

1

భారత్, ఆస్ట్రియా మధ్య ఆడియోవిజువల్ సహ నిర్మాణ ఒప్పందం

ఇరు దేశాల చలనచిత్ర పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించేలా వ్యవస్థాగత ఏర్పాటుతోపాటు.. ఉమ్మడి చలనచిత్ర నిర్మాణం, సృజనాత్మకంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి, విస్తృత సాంస్కృతిక భాగస్వామ్యం దిశగా ఈ ఒప్పందంతో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

2

భారత్, ఆస్ట్రియా కంపెనీల కోసం ఫాస్ట్ ట్రాక్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంపై ఉమ్మడి ప్రకటన

రెండు దేశాల్లోని పెట్టుబడిదారులు, కంపెనీలు పరస్పరం ఒక వ్యవస్థతో ఒకటి ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, పరిష్కరించడానికి ఈ వేగవంతమైన పరిష్కార యంత్రాంగం (ఫాస్ట్ ట్రాక్ మెకానిజం) కృషి చేస్తుంది. అంతేకాకుండా, వ్యాపార నిర్వహణను సులభతరం చేయడంపై పెట్టుబడిదారుల నుంచి వచ్చే సాధారణ సూచనలను చర్చించడానికి వేదికగా కూడా ఉపయోగపడుతుంది.

3

సైనిక వ్యవహారాల్లో సహకారంపై ఆసక్తి వ్యక్తీకరణ పత్రం

సైనిక వ్యవహారాల్లో సహకారంతోపాటు రక్షణ పారిశ్రామిక- సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఒక సంస్థాగత ఏర్పాటును ఈ ఆసక్తి వ్యక్తీకరణ లేఖ సూచిస్తుంది. 2026 జనవరి 27న కుదిరిన భారత్ – ఈయూ రక్షణ, భద్రత భాగస్వామ్య స్ఫూర్తితో ఇది ముందుకు సాగుతుంది. అలాగే రక్షణ విధానాలపై చర్చలు, శిక్షణ, సామర్థ్యాభివృద్ధికీ ఇది తోడ్పడుతుంది.

4

ఉగ్రవాద నిరోధక సంయుక్త కార్యవర్గంపై ఆసక్తి వ్యక్తీకరణ పత్రం

ఉగ్రవాద నిరోధక సంయుక్త కార్యవర్గం ఏర్పాటు దిశగా కలిసి పనిచేయాలన్న ఇరుపక్షాల లక్ష్యంతోపాటు, భారత్ - ఆస్ట్రియా మధ్య ఉగ్రవాద నిరోధక సహకారాన్ని ఇది ముందుకు తీసుకెళ్తుంది. ఉగ్రవాదంపై పోరాటానికి సంబంధించిన అంశాలపై వ్యూహాత్మక సహకారానికి గల అవకాశాలను ఇది పరిశీలిస్తుంది.

5

ఆస్ట్రియా ఏజీఈఎస్, భారత ఎఫ్ఎస్ఎస్ఏఐ మధ్య ఆహార భద్రతపై అవగాహన ఒప్పందం

ఆహార భద్రత ప్రమాణాలు, శాస్త్రీయ విధానాలను ఇచ్చిపుచ్చుకోవడం, సామర్థ్యాభివృద్ధి, ఆహార నియంత్రణలో అత్యుత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడం, రిస్కును అంచనా వేయడంలో సహకారాన్ని ఈ అవగాహన ఒప్పందం ప్రోత్సహిస్తుంది. తద్వారా వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల్లో వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూ, భద్రతా ప్రమాణాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తుంది.

6

వృత్తి విద్య - శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, వృత్తిపరమైన అర్హతల గుర్తింపునకు సంబంధించి ఉమ్మడి ఆసక్తి వ్యక్తీకరణ పత్రం

వృత్తి విద్య - శిక్షణ (అప్రెంటీస్‌షిప్), నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఆదానప్రధానాలను మెరుగుపరచడం, విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, అలాగే భారతీయ వృత్తి విద్యా అర్హతలను ఆస్ట్రియా ప్రమాణాలకు అనుగుణంగా గుర్తించేలా ప్రోత్సహించడంలో ఈ ఉమ్మడి ఆసక్తి వ్యక్తీకరణ పత్రం దోహదపడుతుంది.

 

ప్రకటనలు

క్ర.సం.

ప్రకటన

1

 

(రవాణా నిర్వహణలో అధునాతన వ్యవస్థలు, రహదారి భద్రత, టోల్ వసూలులో ఎలక్ట్రానిక్ పద్ధతులను అవలంబించడం, ట్రాఫిక్ నిర్వహణలో సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఈ అవగాహన ఒప్పందం దోహదపడుతుంది)

2

భారత్ - ఆస్ట్రియా స్టార్టప్ వారధి ద్వారా అంకుర సంస్థల రంగంలో సానుకూల సహకారాన్ని మెరుగుపరచడం

(ఇరుదేశాల అంకుర సంస్థలు, యూనికార్న్ సంస్థలు, ఆవిష్కరణ వ్యవస్థలు, ప్రారంభ మూలధన సహకార/ వెంచర్ క్యాపిటల్ నెట్వర్కుల మధ్య నిరంతర సహకారం)

3

సంస్థాగత సైబర్‌ భద్రతా చర్చల ప్రారంభం.

4

భారతదేశపు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కేంద్రం – ఆస్ట్రియా సాయుధ దళాల అంతర్జాతీయ కేంద్రం (ఏయూటీఐఎన్‌టీ) మధ్య భాగస్వామ్యం.

5

2026 శరత్కాలంలో వియన్నాలో ద్వైపాక్షిక అంతరిక్ష పారిశ్రామిక సదస్సును సంయుక్తంగా నిర్వహించే ఒప్పందాన్ని సంయుక్త ప్రకటనలో చేర్చారు.

6

వర్కింగ్ హాలిడే ప్రోగ్రామ్ అమలు.

7

మెరుగైన భారత్ - ఆస్ట్రియా భాగస్వామ్యానికి కీలక ప్రాతిపదికగా అత్యున్నత సాంకేతిక సహకారం.

(సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో.. మెటీరియల్ సైన్స్ - టెక్నాలజీ, క్వాంటం టెక్నాలజీ, మురుగునీటి శుద్ధి, మెషిన్ లెర్నింగ్, లేజర్ల వంటి రంగాల్లో ఉమ్మడి పరిశోధన - అభివృద్ధి ప్రాజెక్టులను గుర్తించారు.)

8

విద్యలో సహకారంపై నిర్మాణాత్మక ద్వైపాక్షిక చర్చల ప్రారంభం

(నైపుణ్యాభివృద్ధిని మెరుగుపరచడం, పాఠ్యప్రణాళిక అభివృద్ధిని ప్రోత్సహించడం, అర్హతల పరస్పర గుర్తింపును సులభతరం చేయడం, ఉన్నత విద్యలో సంస్థాగత సహకారానికి తోడ్పాటునివ్వడం, వృత్తి విద్యా - శిక్షణా వ్యవస్థల అభివృద్ధికి తోడ్పడడం దీని లక్ష్యం.)

9

భారత్‌తో విద్య, పరిశోధనా సహకారాన్ని క్రమబద్ధంగా బలోపేతం చేయడం కోసం.. ఆస్ట్రియాలోని ప్రముఖ సాంకేతిక విశ్వవిద్యాలయాల ‘ఫోకస్ ఇండియా’ కార్యక్రమం

(ఆస్ట్రియాలోని మూడు ప్రభుత్వ సాంకేతిక విశ్వవిద్యాలయాలైన - టెక్నిస్చ్ యూనివర్సిటాట్ వియన్, టెక్నిస్చ్ యూనివర్సిటాట్ గ్రాజ్, మోంటానునివర్సిటాట్ లియోబెన్ ఒక ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించాయి. ఆస్ట్రియాలో ఇంజినీరింగ్, సాంకేతిక విద్యలో మాస్టర్స్ చదవాలనుకునే భారతీయ విద్యార్థుల ప్రవేశ ప్రక్రియను సులభతరం చేయడం కోసం దీనిని రూపొందించారు.)

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's forex reserves hit all-time high of $729.33 billion after $12.42 billion jump

Media Coverage

India's forex reserves hit all-time high of $729.33 billion after $12.42 billion jump
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 ఆగష్టు 2026
August 29, 2026

New India, New Speed, New Stage: Missiles, Medals, Multilateralism under PM Modi