1. ప్రకటన
ద్వైపాక్షిక సంబంధాలను ఒక సమగ్ర భాగస్వామ్యం స్థాయికి పెంపొందించుకోవడం.
2. అవగాహన పూర్వక ఒప్పంద పత్రాల (ఎంఓయూస్) జాబితా
-
సాంస్కృతిక వినిమయ కార్యక్రమం (సీఈపీ)పై ఎంఓయూ: కళ, సంగీతం, నృత్యం, సాహిత్యం, వారసత్వం వంటి రంగాల్లో సాంస్కృతిక అవగాహనను ఇచ్చి పుచ్చుకోవడం, ప్రస్తుత స్థాయి కంటే వీటిని మరింత ముందుకు తీసుకుపోవడం.
-
భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్)కీ, ఘనా స్టాండర్డ్‌స్ అథారిటీ (జీఎస్ఏ)కీ మధ్య ఎంఓయూ: ప్రమాణీకరణ, ధ్రువీకరణలతో పాటు అనుకూలతా మూల్యాంకనం.. ఈ అంశాల్లో సహకారాన్ని ఇప్పుడు ఉన్న స్థాయి కంటే పెంచుకోవాలన్నది ఈ ఎంఓయూ లక్ష్యం.
-
భారత్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రిసర్చ్ ఇన్ ఆయుర్వేదా (ఐటీఆర్ఏ)కూ, ఘనాకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ (ఐటీఏఎమ్)కూ మధ్య ఎంఓయూ: సాంప్రదాయక వైద్య విద్య, శిక్షణలతో పాటు పరిశోధన.. ఈ రంగాల్లో పరస్పరం సహకరించుకోవడం ఈ ఎంఓయూ లక్ష్యం.
-
జాయింట్ కమిషన్ సమావేశానికి సంబంధించిన ఎంఓయూ: ఉన్నత స్థాయి చర్చలకు సంస్థాగత రూపును ఇవ్వడంతో పాటు క్రమం తప్పకుండా ద్వైపాక్షిక సహకార యంత్రాంగాలను సమీక్షించడం ఈ ఎంఓయూ లక్ష్యం.


