షేర్ చేయండి
 
Comments

ఆస్ట్రేలియా, ఇండియా, జ‌పాన్‌, అమెరికా దేశాల నాయ‌కుల‌మైన మేము మొద‌టిసారిగా ఈ రోజున భౌతికంగా స‌మావేశ‌మ‌య్యాం. ఈ చారిత్రాత్మ‌క స‌మావేశ సంద‌ర్భంగా మేం మా భాగ‌స్వామ్యకృషికి పున‌రంకిత‌మ‌య్యాం. నాలుగు దేశాలు క‌లిసి పంచుకుంటున్న భ‌ద్ర‌త‌, సౌభాగ్యం, అర‌మ‌రిక‌లు లేని, అంద‌రికీ అందుబాటులోని దృఢ‌మైన‌ ఇండో ప‌సిఫిక్ కోసం పున‌ర్ నిబ‌ద్దుల‌య్యాం. క్వాడ్ స‌మావేశం జ‌రిగి ఆరు నెల‌ల‌వుతోంది. మార్చి నెల‌నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోవిడ్-19 మ‌హ‌మ్మారి తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. వాతావ‌ర‌ణ సంక్షోభం కూడా తీవ్ర‌త‌ర‌మైంది. ప్రాంతీయ భ‌ద్ర‌త అనేది మ‌రింత సంక్లిష్ట‌మైంది. ఇది మ‌న దేశాలన్నిటినీ ఉమ్మ‌డిగాను, విడివిడిగాను ప‌రీక్షిస్తోంది. అయిన‌ప్ప‌టికీ మ‌న స‌హ‌కారం ఏమాత్రం తొణ‌క‌లేదు. బెణ‌క‌లేదు.  

క్వాడ్ స‌మావేశ‌మ‌నేది మ‌న ల‌క్ష్యాల సాధ‌న‌కోసం మ‌రింత ఏకాగ్ర‌త‌గా ప‌ని చేయ‌డం కోసం ల‌భించిన అవ‌కాశం. ఇండో ప‌సిఫిక్ ప్రాంతంలోను, అంత‌కు మించికూడా అంత‌ర్జాతీయ న్యాయ సూత్రాల ప్ర‌కారం భ‌ద్ర‌త‌ను, నియ‌మ నిబంధ‌న‌ల్ని అమ‌లు చేయ‌డం కోసం మ‌నంద‌రం క‌లిసి కృషి చేయ‌డం జ‌రుగుతుంది. న్యాయ సూత్రాల అమ‌లుకోసం, స్వేచ్ఛ‌గా స‌ముద్ర‌యానం , విమాన‌యానం చేయ‌డం కోసం, శాంతియుతంగా త‌గాదాల‌ను ప‌రిష్క‌రించ‌డంకోసం , ప్ర‌జాస్వామిక విలువ‌ల‌కోసం, ప్రాదేశిక ఐక్య‌త కోసం మేం క‌లిసిక‌ట్టుగా కృషి చేస్తున్నాం. మేం ఐక్యంగా ప‌ని చేయ‌డానికి, ప‌లువురుభాగ‌స్వాముల‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి నిబ‌ద్ద‌త‌తో వున్నాం. ఆసియాన్ దేశాల ఐక్య‌త‌కు మా మ‌ద్ద‌తు వుంటుంది. ఇండో ప‌సిఫిక్ ప్రాంతంలో గుండెకాయ‌లాంటి ఆసియాన్ తోను , అందులోని స‌భ్య‌దేశాల‌తోను క‌లిసి ప‌ని చేయ‌డానికి మాకున్న అంకిత భావాన్ని మ‌రోసారి చాటుతున్నాం. ఇండో ప‌సిఫిక్ ప్రాంతంలో స‌హ‌కారంకోసం యూరోపియ‌న్ యూనియ‌న్ వారి సెప్టెంబ‌ర్ 2021నాటి వ్యూహానికి మా స్వాగ‌తం. 

మా మొద‌టి స‌మావేశం త‌ర్వాత ప్ర‌పంచం ఎదుర్కొంటున్న కీల‌క‌మైన స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో మేం గ‌ణ‌నీయ‌మైన ప్ర‌గ‌తిని సాధించాం. కోవిడ్ -19 మ‌హ‌మ్మారి, వాతావ‌ర‌ణ సంక్షోభం, కీల‌క‌మైన సాంకేతిక‌త‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ముంద‌డుగు వేశాం. 

కోవిడ్ -19 స‌మ‌స్యకు సంబంధించి మా స్పంద‌న‌, స‌హాయ చ‌ర్య‌లు, భాగ‌స్వామ్యం అనేవి క్వాడ్ కు చారిత్రాత్మ‌క నూత‌న దృక్ప‌థాన్ని ఇస్తున్నాయి. మేం క్వాడ్ టీకా నిపుణుల బృందాన్ని ప్రారంభించాం. అందులో మా ప్ర‌భుత్వాల‌కు చెందిన ప్ర‌సిద్ధ నిపుణులు స‌భ్యులుగా వున్నారు. వారు ఇండో ప‌సిఫిక్ ఆరోగ్య భ‌ద్ర‌త, కోవిడ్‌-19 క‌ట్ట‌డికి మ‌ద్ద‌తుగా ప‌ని చేశారు. ఈ ప‌ని చేయ‌డంలో మేం మ‌హ‌మ్మారి ప‌రిస్థితికి సంబంధించిన మ‌దింపుల‌ను పంచుకున్నాం. కోవిడ్‌పై పోరాటంలో మా కృషిలో మార్పులు చేర్పులు చేసుకుంటూ దౌత్య నియ‌మ నిబంధ‌న‌ల్ని బ‌లోపేతం చేసుకోవ‌డం జ‌రిగింది. త‌ద్వారా కోవిడ్ ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డం జ‌రిగింది. స‌మ‌న్వ‌యాన్ని మెరుగుప‌రుచుకున్నాం. టీకాల అందుబాటును పెంచాం. నాణ్య‌మైన టీకాల‌ను అందించాం. ఈ క్ర‌మంలో ఆస్ట్రేలియా, ఇండియా, జ‌పాన్‌, అమెరికా క‌లిసి 1.2 బిలియ‌న్ డోసుల టీకాల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉచితంగా పంచ‌డానికి నిర్ణ‌యించాయి. ఇంత‌వ‌ర‌కూ 79 మిలియ‌న్ టీకాల‌ను ఇండో ప‌సిఫిక్ ప్రాంత దేశాల‌కు పంచ‌డం జ‌రిగింది. 

బయోలాజికల్ ఇ లిమిటెడ్  లో ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి క్వాడ్ టీకా భాగ‌స్వామ్య ఆర్ధిక‌సాయం దోహ‌దం చేసింది. భారతదేశంలో అదనపు ఉత్పత్తి ఈ సంవత్సరం చివరిలో అందుబాటులోకి వస్తుంది. మా మార్చి ప్రకటనకు అనుగుణంగా కొనసాగుతున్న ప్రపంచ సరఫరా అంతరాన్ని గుర్తించి, ఈ విస్తరించిన తయారీని ఇండో-పసిఫిక్ ప్రాంతంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఇత‌ర ప్రాంతాల‌కు ఎగుమ‌తి చేయ‌డం జ‌రుగుతుంది. త‌క్కువ‌, మ‌ధ్య‌స్థాయి ఆదాయం గ‌ల దేశాల‌కోసం నాణ్య‌మైన‌, ప్ర‌తిభావంత‌మైన టీకాల‌ను సేక‌రించి స‌ర‌ఫ‌రా చేయ‌డం కోసం కోవాక్స్ సంస్థ‌ల్లాంటివాటి సాయం తీసుకోవ‌డం జ‌రుగుతుంది. ఇందుకోసం కీల‌క‌మైన బ‌హుళ‌పాక్షిక కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తాం. టీకా ఉత్ప‌త్తికోసం బ‌హిరంగ‌, భ‌ద్ర‌మైన స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ల‌ను గుర్తించ‌డం జ‌రుగుతుంది. 
ప్రాంతీయంగాను, ప్ర‌పంచ‌వ్యాప్తంగాను నెల‌ల‌త‌ర‌బడి మ‌హ‌మ్మారి క‌ష్టాలు కొన‌సాగిన‌ప్ప‌టికీ ఇంత‌వ‌ర‌కూ మేం చాలానే సాధించ‌డం జ‌రిగింది. టీకాల‌కు సంబంధించి బ‌య‌లాజిక‌ల్ ఇ లిమిటెడ్ ద్వారా జ‌రుగుతున్న కృషిని క్వాడ్ నేత‌లు ఆహ్వానించారు. 2022 చివ‌రినాటికి ఒక బిలియ‌న్ సుర‌క్షిత‌మైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన కోవిడ్ 19 టీకాల‌ను త‌యార చేయ‌డం కోసం క్వాడ్ ద్వారా పెట్టిన పెట్టుబ‌డుల‌ను నేత‌లు ఆహ్వానించారు. ఇండో ప‌సిఫిక్ ప్రాంతంతోపాటు ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల‌కు స‌ర‌ఫ‌రా చేయ‌డం కోసం మొద‌టి అడుగు వేశామ‌ని ఈ రోజున మేం గ‌ర్వంగా ప్ర‌క‌టిస్తున్నాం. భ‌ద్ర‌మైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన కోవిడ్ 19 టీకాల‌ను ఎగుమ‌తి చేస్తామంటూ భార‌త‌దేశం తీసుకున్న నిర్ణయానికి క్వాడ్ స్వాగ‌తం ప‌లుకుతోంది. ఇండియా స‌ర‌ఫ‌రా ఈ ఏడాది అక్టోబ‌ర్ లో మొద‌ల‌వుతుంది. ప్రాంతీయ భాగ‌స్వాములు టీకాల‌ను కొనుగోలు చేయ‌డానికిగాను 3.3 బిలియ‌న్ రుణాల‌ను ఇవ్వ‌డంద్వారా జ‌పాన్ త‌న స‌హాయాన్ని కొన‌సాగిస్తోంది. ఆస్ట్రేలియా 212 మిలియన్ల నిధుల‌ను గ్రాంటుగా ఇస్తోంది. ఈ నిధుల‌తో ఆగ్నేయాసియా,ప‌సిఫిక్ ప్రాంతాల్లో టీకాల‌ను కొనుగోలు చేస్తారు. దీనికి అద‌నంగా ఆస్ట్రేలియా మ‌రో 219 మిలియ‌న్ డాల‌ర్ల స‌హాయాన్ని అందించ‌డంద్వారా అంద‌రికీ టీకాలు అందేలా సాయం చేస్తుంది. ఆయా ప్రాంతాల్లో అంద‌రికీ టీకా అందాల‌నే క్వాడ్ కృషిని ముందుకు తీసుకుపోతుంది. కోవిడ్ మ‌హ‌మ్మారిని తుద‌ముట్టించ‌డానికి, మెరుగైన ఆరోగ్య భ‌ద్ర‌త‌కోసం చేస్తున్న ఆరోగ్య‌రంగ ప‌రిశోధ‌న‌లు, ప‌రిశీల‌న‌కు సంబంధించి శాస్త్ర సాంకేతిక రంగాల స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేస్తాం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రికీ టీకాలు అంద‌డంకోసం పెట్టుకున్న ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డానికి నిబ‌ద్ద‌త‌తో కృషి చేస్తున్నాం. ఇందుకోసం ఆర్ధిక స‌హాయాన్ని, రాజ‌కీయ నాయ‌క‌త్వాన్ని బ‌లోపేతం చేయ‌డం జ‌రుగుతోంది. 2022లో మా దేశాలు క‌లిసి ఉమ్మ‌డిగా మ‌హ‌మ్మారిని ఎదుర్కొనే స‌న్న‌ద్ద‌త‌పై క‌స‌ర‌త్తు చేయ‌డం జ‌రుగుతుంది. 
వాతావ‌ర‌ణ సంక్షోభాన్ని ఎదుర్కోవ‌డంకోసం అంద‌ర‌మూ క‌లిసి ప‌ని చేస్తున్నాం. ఇది అత్య‌వ‌స‌ర‌మైన కార్య‌క్ర‌మం. పారిస్ ఒప్పందం ప్ర‌కారం ప్ర‌క‌టించిన ఉష్ణోగ్ర‌త ప‌రిమితిని దాట‌కుండా వుండ‌డంకోసం క్వాడ్‌దేశాలు క‌లిసి ప‌ని చేస్తాయి.ఈ ప‌రిమితిని 1.5 డిగ్రీలుగా నిర్ణ‌యించారు.  ఈ మేరకు,  సిఓపి26 నిర్ణ‌యించిన‌ ప్రతిష్టాత్మక ఎన్ డీసీ లను అప్‌డేట్ చేయడానికి లేదా కమ్యూనికేట్ చేయడానికి క్వాడ్ దేశాలు సిద్ధంగా వున్నాయి. ఇప్పటికే అలా చేసిన వారి కృషిని స్వాగ‌తించ‌డం జ‌రిగింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని కీలక వాటాదారులను చేరుకోవడానికి , వాతావ‌ర‌ణంప‌ట్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్ఫూర్తిని పెంచడానికి క్వాడ్ దేశాలు దౌత్య‌ప‌రంగా కూడా సమన్వయం చేస్తాయి. మా పని మూడు ప్ర‌ధాన అంశాల‌లో నిర్వహించడం జ‌రుగుతుంది. వాతావ‌ర‌ణ సంర‌క్ష‌ణ‌కోసం 2020లో చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను కొన‌సాగించాల‌నే ఆశ‌యంతో ఈ ప‌నుల‌ను చేయ‌డం జ‌రుగుతుంది. త‌ద్వారా 2050 నాటికి పూర్తిస్థాయిలో జీరో ఉద్గారాల ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డం జ‌రుగుతుంది. జాతీయ స్థాయి ప‌రిస్థితుల‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం జ‌రుగుతుంది. 
షిప్పింగ్, పోర్ట్ కార్యకలాపాలను డీకార్బోనైజ్ చేయడం,  క్లీన్-హైడ్రోజన్ టెక్నాలజీని విస్తరించడం వంటి వాటితో సహా జాతీయంగా తగిన సెక్టోరల్ డెకార్బనైజేషన్ ప్రయత్నాలను మేము అనుసరిస్తున్నాము. మేము బాధ్యతాయుతమైన ,ప‌టిష్ట‌మైన‌, స్వచ్ఛమైన శక్తి సరఫరా వ్య‌వ‌స్థ‌ల‌ను స్థాపించడానికి సహకరిస్తాము. విపత్తు నిరోధక మౌలిక సదుపాయాలు, వాతావరణ సమాచార వ్యవస్థల కోసం కూటమిని బలోపేతం చేస్తాము. క్వాడ్ దేశాలు సిఓపి 26, జి20 వారు నిర్దేశించిన‌ విజయవంతమైన ఫలితాల కోసం కలిసి పనిచేస్తాయి. సిఓపి 26, జి 20 అనేవి ఈ క్షణానికి అవసరమైన వాతావరణల‌క్ష్యాల‌ను, ఆవిష్కరణ స్థాయిని సమర్థిస్తున్నాయి. 
క్లిష్టమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై మేము సహకారాన్ని ఏర్పాటు చేసుకున్నాము.  సాంకేతికతను రూపొందించే, అభివృద్ధి చేసే, పరిపాలించే, ఉపయోగించే విధానాన్ని.. మా భాగస్వామ్య విలువలు సార్వత్రిక మానవ హక్కుల పట్ల గౌరవం ద్వారా రూపొందించ‌డానికిగాను ఈ ఏర్పాటు చేసుకున్నాం. పరిశ్రమ భాగస్వామ్యంతో సురక్షితమైన, బహిరంగ, పారదర్శకమైన 5జి, 5జి నెట్‌వర్క్‌ల విస్తరణను అభివృద్ధి చేస్తున్నాము.  ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి విశ్వసనీయత క‌లిగిన వ్యాపారులు, పార‌ద‌ర్శ‌క - ఆర్ ఏ ఎన్ వంటి విధానాలను ప్రోత్సహించడానికి అనేకమంది భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాము. 5జి వైవిధ్యీకరణకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడంలో ప్రభుత్వాల పాత్రను గుర్తించి, పబ్లిక్-ప్రైవేట్ సహకారాన్ని సులభతరం చేయడానికి, బ‌హిరంగ‌, ప్ర‌మాణాల ఆధారిత సాంకేతిక‌త‌, దాని స్కేలబిలిటీ, సైబర్ సెక్యూరిటీని ప్రదర్శించడానికి మేము కలిసి పని చేస్తాము. సాంకేతిక ప్రమాణాల అభివృద్ధికి సంబంధించి, పార‌ద‌ర్శ‌కంగాను,అంద‌రినీ క‌లుపుకొని పోయే , ప్రైవేట్-సెక్టార్-నేతృత్వంలోని, బహుళ-వాటాదారుల, ఏకాభిప్రాయ-ఆధారిత విధానాన్ని ప్రోత్సహించడానికిగాను నిర్దిష్ట రంగాల‌ సంప్రదింపు సమూహాలను ఏర్పాటు చేస్తాము.  అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ వంటి బహుపాక్షిక ప్రామాణీకరణ సంస్థలతో కూడా సమన్వయం చేసుకొని సహకరిస్తాము. సెమీకండక్టర్‌లతో సహా క్లిష్టమైన సాంకేతిక‌త‌లు, మెటీరియల్స్ సరఫరా వ్య‌వ‌స్థ‌ల‌ను మేము మ్యాప్ చేస్తున్నాము.  పారదర్శకమైన, మార్కెట్-ఆధారిత ప్రభుత్వ మద్దతు చర్యలు, విధానాల ప్రాముఖ్యతను గుర్తించి, క్లిష్టమైన సాంకేతికత దృఢ‌మైన‌, వైవిధ్యమైన, సురక్షితమైన సరఫరా వ్య‌వ‌స్థ‌ల‌కు మా సానుకూల నిబద్ధతను ప్ర‌క‌టిస్తున్నాం. బయోటెక్నాలజీతో ప్రారంభించి, సహకారం కోసం సంబంధిత అవకాశాలను గుర్తించి, భవిష్యత్తులో కీలకమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలోని ధోరణులను మేము పర్యవేక్షిస్తున్నాము. టెక్నాలజీ డిజైన్, అభివృద్ధి, పాల‌న‌, ఉపయోగంపై క్వాడ్ సూత్రాలను కూడా మేము ఈ రోజు ప్రారంభిస్తున్నాం. ఇవి ఈ ప్రాంతాన్ని మాత్రమే కాకుండా ప్రపంచాన్ని బాధ్యతాయుతమైన, పార‌ద‌ర్శ‌క‌, అత్యున్నత ప్రమాణాల ఆవిష్కరణ వైపు నడిపిస్తాయ‌ని మేము ఆశిస్తున్నాము.
రాను రాను భ‌విష్య‌త్తులో, మేము ఈ కీలక రంగాలలో మా సహకారాన్ని మరింతగా పెంచుకోవడమే కాకుండా, దానిని కొత్త వాటికి విస్తరిస్తాము. మా ప్రతి ప్రాంతీయ మౌలిక సదుపాయాల ప్రయత్నాల ఆధారంగా, విడిగాను, అదే స‌మ‌యంలో కలిసి, కొత్త క్వాడ్ మౌలిక సదుపాయాల భాగస్వామ్యాన్ని ప్రారంభిస్తున్నాము. క్వాడ్‌గా, మా ప్రయత్నాలను సమన్వయం చేయడానికి, ప్రాంతీయ‌ మౌలిక సదుపాయాల అవసరాలను మ్యాప్ చేయడానికి, ప్రాంతీయ అవసరాలు, అవకాశాలపై సమన్వయం చేయడానికి మేము క్రమం తప్పకుండా కలుస్తాము.  సాంకేతిక సహాయం అందించడానికి సహకరిస్తాము, ప్రాంతీయ భాగస్వాములను మ‌దింపు సాధనాలతో శక్తివంతం చేస్తాం. స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహిస్తాం. మేము జి7 మౌలిక సదుపాయాల ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నాం. యూరోపియ‌న్ యూనియ‌న్‌ తో సహా సారూప్య భాగస్వాములతో సహకరించడానికి ఎదురుచూస్తున్నాం. మేము జి 20 నాణ్య‌మైన మౌలిక స‌దుపాయాల‌ సూత్రాలను తిరిగి ధృవీకరించాం. ఇండో-పసిఫిక్‌లో అత్యున్నత ప్రమాణాల మౌలిక సదుపాయాలను అందించడానికి మా ప్రయత్నాలను పునరుజ్జీవింపజేస్తాము. బ్లూ డాట్ నెట్‌వర్క్‌తో మా సంప్ర‌దింపుల‌ను కొనసాగించడానికి మాకున్న‌ ఆసక్తిని  పునరుద్ఘాటిస్తున్నాం. అంతర్జాతీయ నియమాలు, ప్రమాణాలకు అనుగుణంగా బహిరంగ, న్యాయమైన, పారదర్శక రుణ విధానాలకు కావాల్సిన‌ మద్దతు  ప్రాముఖ్యతను మేము నొక్కిచెప్పాము.ఈ నియమాలు, ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని రుణదాతలందరికీ పిలుపునిచ్చాము.
 ఈ రోజు, మేము సైబర్ స్పేస్‌లో కొత్త సహకారాన్ని ప్రారంభించాము. సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడానికి, ప‌టిష్ట‌త‌ను ప్రోత్సహించడానికి, మా క్లిష్టమైన మౌలిక సదుపాయాలను భద్రపరిచేందుకువీలుగా కలిసి పనిచేయడానికి ప్రతిజ్ఞ చేశాం. అంతరిక్షరంగంలో కొత్త సహకార అవకాశాలను గుర్తిస్తాము. వాతావరణ మార్పు, విపత్తు ప్రతిస్పందన  సంసిద్ధత, మహాసముద్రాలు, సముద్ర వనరుల స్థిరమైన ఉపయోగాలు, భాగస్వామ్య డొమైన్‌లలో సవాళ్లకు ప్రతిస్పందించడం వంటి శాంతియుత ప్రయోజనాల కోసం ఉపగ్రహ డేటాను పంచుకుంటాము. అంత‌రిక్ష‌  స్థిరమైన వినియోగాన్ని నిర్ధారించడానికి నియమాలు, నిబంధనలు, మార్గదర్శకాలు, సూత్రాలపై కూడా మేము సంప్రదింపులు చేసుకుంటాం.
మేము క్వాడ్ ఫెలోషిప్‌ను ప్రారంభించాం. దీనిద్వారా విద్యారంగంలోను,  ప్రజల సహకారంతోను కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం మాకు గర్వంగా ఉంది. ష్కిమిత్‌ ఫ్యూచర్స్ అనే దాతృత్వ సంస్థ‌ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో యాక్సెంచర్, బ్లాక్‌స్టోన్, బోయింగ్, గూగుల్, మాస్టర్‌కార్డ్, వెస్ట్రన్ డిజిటల్ సంస్థ‌ల‌ ఉదారమైన మద్దతుతో ఈ పైలట్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ప‌నిచేస్తుంది. దీని ద్వారా 100 గ్రాడ్యుయేట్ ఫెలోషిప్‌లను నాలుగు దేశాల్లోని ప్రముఖ కాలేజీల‌కు చెందిన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గ‌ణిత రంగాల‌కు చెందిన‌ ప‌ట్ట‌భ‌ద్రులైన‌ విద్యార్థులకు అందించ‌డం జ‌రుగుతుంది.. క్వాడ్ ఫెలోషిప్ ద్వారా,  తదుపరి తరం స్టెమ్ (ఎస్ టి ఇఎమ్‌) ప్రతిభావంతులు త‌యారై వారు మన భాగస్వామ్య భవిష్యత్తును రూపొందించే ఆవిష్కరణల వైపు క్వాడ్, ఇతర సారూప్య భాగస్వాములను నడిపించడానికి సిద్ధంగా ఉంటారు.
దక్షిణ ఆసియాలో,  ఆఫ్ఘనిస్తాన్ విష‌యంలోను మా దౌత్య, ఆర్థిక, మానవ హక్కుల విధానాలను సమన్వయం చేస్తాం. యుఎన్ ఎస్ సి ఆర్ 2593 ప్రకారం  ఉగ్రవాద వ్య‌తిరేక‌, మానవతావాద సహకారాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. ఆఫ్ఘన్ భూభాగాన్ని ఏదైనా దేశాన్ని బెదిరించడం లేదా దాడి చేయడానికి లేదా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వ‌డానికి లేదా శిక్షణ ఇవ్వడానికి, లేదా ఉగ్రవాద చర్యలను ప్లాన్ చేయడం లేదా ఆర్థికంగా స‌హాయం అందించడానికి ఉపయోగించరాదని మేము పునరుద్ఘాటిస్తున్నాము ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన‌ ప్రాముఖ్యతను మ‌రోసారి స్ప‌ష్టం చేయ‌డం జ‌రిగింది.. తీవ్రవాదుల‌ను అడ్డం పెట్టుకొని ప‌రోక్ష యుద్ధాన్ని చేయ‌డం  మేము ఖండిస్తున్నాము ఉగ్రవాద దాడులను ప్రారంభించడానికి లేదా ప్లాన్ చేయడానికి ఉపయోగపడే ఉగ్రవాద గ్రూపులకు నిర్వ‌హ‌ణాప‌ర‌మైన‌, ఆర్ధిక లేదా సైనిక మద్దతును నిరాకరించే విధాన‌ ప్రాముఖ్యతను నొక్కిచెప్పాం. ఆఫ్ఘన్ జాతీయులకు మద్దతుగా మేము కలిసి నిలబడ్డాం. అంతే కాదు ఆఫ్ఘనిస్తాన్ నుండి బైట‌కు వెళ్లిపోవాల‌నుకునే  ఏ వ్యక్తికైనా సురక్షితమైన మార్గాన్ని అందించాలని, మహిళలు, పిల్లలు, మైనారిటీలతో సహా ఆప్ఘ‌న్ పౌరుల‌ మానవ హక్కులను గౌర‌వించాల‌ని మేం తాలిబాన్‌లకు పిలుపునిచ్చాము.
మా భాగస్వామ్య భవిష్యత్తు ఇండో-పసిఫిక్‌లో రూపొందుతుంద‌ని కూడా మేము గుర్తించాం. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, భద్రత శ్రేయస్సు కోసం క్వాడ్ ఒక శక్తివంత‌మైన సంస్థ‌ అని చాట‌డాన‌కి మా ప్రయత్నాలను రెట్టింపు చేస్తాము. ఆ దిశగా, తూర్పు, దక్షిణ చైనా సముద్రాలతో సహా సముద్ర నియమాల ఆధారిత శాంతిభ‌ద్ర‌త‌ల‌ సవాళ్లను ఎదుర్కోవటానికి, అంతర్జాతీయ చట్టానికి కట్టుబడి ఉండటాన్ని మేము కొనసాగిస్తాం. ప్రత్యేకించి సముద్రంపై ఐక్య‌రాజ్య‌స‌మితి ఒడంబ‌డిక ప్ర‌తిఫ‌లించేలా అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌కు క‌ట్టుబ‌డి వుండేలా చూస్తాం. చిన్న ద్వీప రాష్ట్రాలకు, ముఖ్యంగా పసిఫిక్‌లో ఉన్న వారి ఆర్థిక, పర్యావరణ ప‌టిష్ట‌త‌ను పెంచడానికి మేము మా మద్దతును చాటుతున్నాం.  కోవిడ్ -19 కార‌ణంగా ఏర్ప‌డిన ఆరోగ్య, ఆర్థిక ప్రభావాల విష‌యంలోను, నాణ్యత, స్థిరమైన మౌలిక సదుపాయాలపై ప‌డిన ప్ర‌భావాల విష‌యంలోను పసిఫిక్ ద్వీప దేశాలకు మా సహాయాన్ని కొనసాగిస్తాం. అలాగే వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడంలో భాగస్వామిగా ఉంటాం. ఈ మార్పులు ప‌సిఫిక్ ప్రాంతానికి ప్ర‌త్యేక‌మైన స‌వాళ్ల‌ను విసురుతున్నాయి.
 ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి తీర్మానాలకు అనుగుణంగా ఉత్తర కొరియాను పూర్తిగా అణ్వాయుధీకరణ చేయాలనే మా నిబద్ధతను మేము మ‌రోసారి స్ప‌ష్టం చేస్తున్నాం.  అపహరణకు గురైన జ‌ప‌నీయుల‌ సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరాన్ని కూడా ధృవీకరిస్తున్నాం.  ఐరాస నిబంధ‌న‌ల‌కు ఉత్త‌ర కొరియా కట్టుబడి ఉండాలని, రెచ్చగొట్టడం మానుకోవాలని మేము కోరుతున్నాం. ఉత్తర కొరియాకూడా చ‌ర్చ‌ల్లో పాల్గొనాల‌ని పిలుపునిస్తున్నాము. ఇండో-పసిఫిక్‌లోను, బైటా ప్రజాస్వామ్య ప‌టిష్ట‌త‌ను నిర్మించడానికి మేము కట్టుబడి ఉన్నాం. మయన్మార్‌లో హింసను అంతం చేయాలని, విదేశీయులతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని, నిర్మాణాత్మక చ‌ర్చ‌లు చేప‌ట్టాల‌ని  ప్రజాస్వామ్యాన్ని త్వరగా పునరుద్ధరించాలని మేము పిలుపునిస్తూనే ఉన్నాము. ఆసియాన్ ఐదు అంశాల‌ ఏకాభిప్రాయాన్ని అత్యవసరంగా అమలు చేయాలని మేము  కోరుతున్నాం. ఐక్యరాజ్యసమితితో సహా బహుళపక్ష సంస్థలలో మేము మా సహకారాన్ని మరింతగా పెంచుకుంటాం. ఇక్కడ మా భాగస్వామ్య ప్రాధాన్యతలను బలోపేతం చేయడం బహుళపక్ష వ్యవస్థ యొక్క ప‌టిష్ట‌త‌ను పెంచుతుంది. వ్యక్తిగతంగాను, అదే స‌మ‌యంలో ఐక‌మ‌త్యంగా వ‌ర్త‌మాన‌ సవాళ్లకు ప్రతిస్పందిస్తాం. ఈ ప్రాంతం సార్వత్రిక నియమాలు, నిబంధనల పాల‌న‌తో, పార‌ద‌ర్శకంగాను అంద‌రికీ అందుబాటులో ఉండేలా చూస్తాం. 
మేము  సహకరించుకునే అల‌వాట్ల‌ను రూపొందించుకొని కొనసాగిస్తాం. మా నాయకులు, విదేశాంగ మంత్రులు ఏటా స‌మావేశ‌మ‌వుతారు. మా సీనియర్ అధికారులు క్రమం తప్పకుండా స‌మావేశ‌మ‌వుతారు. ప‌టిష్ట‌మైన ప్రాంతాన్ని నిర్మించడానికి అవసరమైన సహకారంకోసం మా బృందాలు స్థిర‌మైన కృషిని కొన‌సాగిస్తాయి. 
మ‌నంద‌రికీ ఇది ప‌రీక్షా స‌మ‌యం. ఈ స‌మ‌యంలో స్వేచ్ఛాయుత‌, పార‌ద‌ర్శ‌క ఇండో-పసిఫిక్‌ను ఏర్పాటు చేయాల‌నే మా నిబద్ధత ప‌టిష్ట‌మైన‌ది. ఈ భాగస్వామ్యం కోసం మా దృష్టి ప్రతిష్టాత్మకంగాను, దూరదృష్టితో ఉంటుంది. దృఢమైన సహకారంతో, ఐక‌మ‌త్యంగా వ్య‌వ‌హ‌రించి ల‌క్ష్యాన్ని సాధిస్తాం. 

సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Mann KI Baat Quiz
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
India Inc raised $1.34 billion from foreign markets in October: RBI

Media Coverage

India Inc raised $1.34 billion from foreign markets in October: RBI
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays tributes to Dr. Rajendra Prasad on his Jayanti
December 03, 2021
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to the first President of India, Dr. Rajendra Prasad on his Jayanti.

In a tweet, the Prime Minister said;

"स्वतंत्र भारत के पहले राष्ट्रपति और अद्वितीय प्रतिभा के धनी भारत रत्न डॉ. राजेन्द्र प्रसाद को उनकी जयंती पर शत-शत नमन। उन्होंने देश के स्वतंत्रता संग्राम में अपना विशिष्ट योगदान दिया। राष्ट्रहित में समर्पित उनका जीवन देशवासियों के लिए हमेशा प्रेरणास्रोत बना रहेगा।"