భారతదేశ యువత ఒడిసిపట్టుకున్న ప్రపంచస్థాయి విజయాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రధానంగా చెప్పారు. వారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన అన్నారు. క్రియాశీలత్వం, నూతన ఆవిష్కరణ, దృఢనిశ్చయం.. వీటికి ప్రతీకలుగా వారు నిలిచారని ఆయన అభివర్ణించారు. యువశక్తీ, సంకల్పం.. ఇవి గత పదకొండు సంవత్సరాలుగా దేశ పురోగతికి వెన్నుదన్నుగా నిలిచాయని ఆయన అన్నారు.
అంకుర సంస్థలు, విజ్ఞానశాస్త్రం, క్రీడలు, సంఘసేవ, సంస్కృతి సహా వివిధ రంగాల్లో యువ భారతీయులు విశేష సేవలను అందించారని శ్రీ మోదీ అన్నారు. ‘‘గత 11 సంవత్సరాల్లో, ఊహకైనా అందని ఘనకార్యాలను యువత సాధించిన ప్రశంసాయోగ్య సందర్భాలను మనమంతా గమనించాం’’ అని ఆయన అన్నారు.
యువతకు సాధికారత కల్పన లక్ష్యంగా ప్రభుత్వం గత 11 సంవత్సరాల్లో అమలు చేసిన విధానాలు గణనీయ మార్పునకు కారణమయ్యాయని ప్రధాని శ్రీ మోదీ స్పష్టంచేశారు. ఒక దేశం చేయగలిగిన అత్యంత శక్తిమంతమైన పని ఆ దేశ యువతకు సాధికారతను కల్పించడమేనన్న దృఢ విశ్వాసం ప్రాతిపదికగా ‘స్టార్టప్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’లతో పాటు ‘జాతీయ విద్యావిధానం-2020’ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు రూపొందాయని శ్రీ మోదీ వివరించారు.
వెనుకటి 11 సంవత్సరాల్లో, యువతకు సాధికారతను కల్పించడానికి ప్రభుత్వం నిరంతరంగా ప్రయత్నిస్తూ వస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. నూతన విద్యావిధానం, నైపుణ్యాల అభివృద్ధి, అంకుర సంస్థలపై దృష్టిని కేంద్రీకరిస్తుండటంతో, ‘అభివృద్ధి చెందిన భారత్’ సంకల్ప సాధనలో యువత ప్రధాన భాగస్వాములుగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
యువశక్తిని బలోపేతం చేసేందుకు సాధ్యమైన అన్ని అవకాశాలనూ ప్రభుత్వం కల్పిస్తూనే ఉంటుందని శ్రీ మోదీ చెప్పారు.
శ్రీ మోదీ ఎక్స్‌లో ఇలా పోస్టు చేశారు:
‘‘మన దేశ యువత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొంది. చైతన్యం, నూతన ఆవిష్కరణలు, సంకల్పం.. వీటికి మారుపేరుగా మన యువ శక్తి నిలిచింది. మన యువత సాటిలేని శక్తితోనూ, దృఢవిశ్వాసంతోనూ భారత్ వృద్ధి దూసుకుపోయేటట్లుగా చేస్తోంది.
గడచిన 11 సంవత్సరాల్లో, అంకుర సంస్థలు, విజ్ఞానశాస్త్రం, క్రీడలు, సంఘసేవ, సంస్కృతి, తదితర అనేక రంగాల్లో అనూహ్య విజయాలను యువత సాధించిన ప్రశంసార్హ సందర్భాలను మనం చూశాం.
గత 11 సంవత్సరాలు యువత సాధికారత కల్పనకు ఉద్దేశించిన విధానంలోనూ, కార్యక్రమాలలోనూ నిశ్చయాత్మక దృక్పథాన్ని ప్రవేశపెట్టాయి. ఒక దేశం చేపట్టదగిన అత్యంత శక్తిమంతమైన పని యువతకు సాధికారతనను కల్పించడమేనన్న దృఢ విశ్వాసంలో నుంచే ‘స్టార్టప్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’లతో పాటు ‘జాతీయ విద్యావిధానం-2020’ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు పుట్టాయి.
వికసిత్ భారత్‌ను ఆవిష్కరించే దిశగా సాగుతున్న ప్రయత్నాలను మన యువతరం బలపరుస్తూనే ఉంటుందని నేను నమ్ముతున్నాను.
11YearsOfYuvaShakti"
India’s youth have made a mark globally. Our Yuva Shakti is associated with dynamism, innovation and determination. Our youth have driven India’s growth with unmatched energy and conviction.
— Narendra Modi (@narendramodi) June 6, 2025
In the last 11 years, we have witnessed remarkable instances of youngsters who have done…
‘‘వెనుకటి 11 సంవత్సరాల్లో మా ప్రభుత్వం యువశక్తికి సాధికారతను ఇవ్వడానికి అదే పనిగా కృషి చేస్తూవచ్చింది. కొత్త విద్యావిధానంతో పాటు నైపుణ్యాభివృద్ధి, అంకుర సంస్థలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో, మన యువతీయువకులు ‘వికసిత్ భారత్’ సంకల్పంలో ముఖ్య భాగస్వాములయ్యారు. ప్రస్తుతం దేశ యువత దేశ నిర్మాణంలో అగ్రగామి భూమికను పోషిస్తూ ఉండడం మాకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తోంది.
11YearsOfYuvaShakti"
पिछले 11 वर्षों में हमारी सरकार ने युवा शक्ति को सशक्त बनाने के लिए निरंतर प्रयास किए हैं। नई शिक्षा नीति के साथ कौशल विकास और स्टार्ट-अप्स पर फोकस से हमारे युवा 'विकसित भारत' के संकल्प के अहम भागीदार बने हैं। ये हमारे लिए अत्यंत प्रसन्नता की बात है कि आज देश का युवा राष्ट्र… pic.twitter.com/CUYgzoUnG5
— Narendra Modi (@narendramodi) June 6, 2025
‘‘మన యువశక్తి రాణించడానికి సాధ్యమైనన్ని అవకాశాలను వారికి మేం కల్పిస్తూనే ఉంటాం. వికసిత్ భారత్‌ను సాకారం చేయడంలో వారిది కీలక పాత్ర.
#11YearsOfYuvaShakti’’
We will always give our Yuva Shakti all possible opportunities to shine! They are key builders of a Viksit Bharat. #11YearsOfYuvaShakti https://t.co/uiETgUYgLx
— Narendra Modi (@narendramodi) June 6, 2025


