షేర్ చేయండి
 
Comments
12 వ తరగతి పరీక్షలను ముందస్తు సెషన్‌లో రద్దు చేసినందుకు విద్యార్థులు-తల్లిదండ్రులు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు

విద్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఒక వర్చువల్ సెశన్ లో పాలుపంచుకొన్న 12 వ తరగతి విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అప్రయత్నపూర్వకం గా ఆ సమావేశం లో జతపడటం తో ఒక ఆనందభరితమైనటువంటి ఆశ్చర్యం ఎదురైంది.  12 వ తరగతి పరీక్షలు రద్దు కావడాన్ని దృష్టి లో పెట్టుకొని విద్య మంత్రిత్వ శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.  అయితే తమ మధ్య కు ప్రధాన మంత్రి అకస్మాత్తు గా రావడం తో ఆశ్చర్యపడ్డ విద్యార్థి తో ఆయన ‘‘మీ ఆన్ లైన్ సమావేశాన్ని నేను భంగపరచడం లేదని ఆశిస్తున్నాను’’ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.  ఆ సందర్భం తాలూకు స్ఫూర్తి కి తగ్గట్టు గా శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ పరీక్ష తాలూకు ఒత్తిడి సడలిపోవడాన్ని గురించి ప్రస్తావించి, ఉపశమనం పొందిన విద్యార్థుల తో కొన్ని సరదా సందర్భాలను పంచుకొన్నారు.  వ్యక్తిగతమైనటువంటి ప్రస్తావనలను గురించి చెప్తూ విద్యార్థుల ను ఆయన ఉల్లాసపరిచారు.  పంచ్ కులా కు చెందిన విద్యార్థి ఒకరు గత కొన్ని రోజులు గా పరీక్షల పట్ల నెలకొన్న ఉద్విగ్నత ను గురించి ప్రస్తావించగా, ఆ విద్యార్థి ఉంటున్నది ఏ ప్రాంతం లోనో ప్రధాన మంత్రి అడిగి తెలుసుకొని తాను కూడా అదే బస్తీ లో చాలా కాలం పాటు ఉన్నానన్నారు.  పిల్లలు ప్రధాన మంత్రి తో కలివిడి గా మాట్లాడుతూ వారి ఆందోళనల ను బయటపెట్టి, వారి అభిప్రాయాల ను స్వేచ్ఛ గా తెలియజేశారు.  హిమాచల్ ప్రదేశల్ లోని సోలన్ కు చెందిన ఒక విద్యార్థి మహమ్మారి నడుమ పరీక్షల ను రద్దు చేసినందుకు గాను ప్రధాన మంత్రి కి ధన్యవాదాలను తెలియజేస్తూ,  దానిని ఒక మంచి నిర్ణయమనే అభిప్రాయాన్ని వెలిబుచ్చగా, మాస్క్ లను ధరించకుండాను, సురక్షిత దూరాన్ని పాటించకుండాను ప్రధాన మంత్రి తో కోవిడ్ ప్రోటోకాల్స్ ను ఉల్లంఘిస్తున్నారంటూ విద్యార్థుల లో మరొకరు విచారాన్ని వ్యక్తం చేశారు.  తాను ఉంటున్న ప్రాంతం లో నిర్వహిస్తున్న జాగృతి కార్యక్రమాల వివరాలను కూడా ఆ విద్యార్థిని ఈ సందర్భం లో వివరం గా చెప్పారు.  మహమ్మారి తాలూకు హాని గురించి చింతిస్తూ ఉన్నటువంటి విద్యార్థుల లో ఒక స్పష్టమైన ఊరట కనపడింది.  వారిలో చాలా మంది పరీక్షలమను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్నందుకు ప్రధాన మంత్రి కి ధన్యవాదాలు పలికారు.  తల్లితండ్రులు కూడా ఈ నిర్ణయాన్ని సానుకూలమైంది గా భావించారు.  చర్చ అరమరికలు లేనటువంటి విధంగాను, ఆరోగ్యవంతమైన విధంగాను సాగేటట్టు ప్రధాన మంత్రి అప్పటికప్పుడు చొరవ తీసుకొని, తల్లితండ్రులను కూడా సంభాషణ లో పాలుపంచుకోవలసిందిగా సూచించారు.

పరీక్షలు రద్దు అయిన తరువాత ఉన్నట్టుండి ఏర్పడ్డ వెలితిత ని గురించి ప్రధాన మంత్రి అడిగినప్పుడు, ఒక విద్యార్థి ‘‘సర్, మీరే అన్నారు పరీక్షల ను ఒక వేడుక గా జరుపుకోవాలి అని.  కాబట్టి, నా మనస్సు లో పరీక్షల గురించిన భయమేదీ లేనే లేదు’’ అని జవాబిచ్చారు.  గువాహాటీ కి చెందిన విద్యార్థిని అయిన ఆమె తాను 10వ తరగతి లో ఉన్నప్పటి నుంచి చదువుతున్న, ప్రధాన మంత్రి రాసిన ‘‘ఇగ్జేమ్ వారియర్స్’’ పుస్తకానిదే ఆ ఘనత అని తెలిపారు.  అనిశ్చితి తో కూడిన కాలాలను తట్టుకోవడం లో యోగ పెద్ద తోడ్పాటు ను అందించినట్లు కూడా విద్యార్థులు చెప్పారు.

మాటామంతీ ఎంత స్వతస్సిద్ధంగా మారిపోయిందంటే దానికి ఒక క్రమ రూపు ను ఇవ్వడానికి ప్రధాన మంత్రి ఒక దారి ని వెదకవలసివచ్చింది.  ఆయన విద్యార్థులు అందరినీ వారి గుర్తింపు సంఖ్య ను ఒక కాగితం మీద రాయమని, అలా చేస్తే తాను పేర్లు పెట్టి పిలుస్తూ సంభాషణ ను సమన్వయపరచగలుగుతానని చెప్పారు.  ఉత్సాహవంతులైన విద్యార్థులు సంతోషంగా ఆ పద్ధతి ని అనుసరించారు.  చర్చించవలసిన అంశాల ను విస్తరించడం కోసం చర్చ ను పరీక్ష రద్దు నిర్ణయం ప్రసక్తి నుంచి దూరం గా ప్రధాన మంత్రి మళ్లించవలసి వచ్చింది.  దీనితో విద్యార్థులు, తల్లితండ్రులు నృత్య‌ం, యూట్యూబ్ లో సంగీతం చానల్స్, వ్యాయామం, రాజకీయాలు వంటి వివిధ విషయాలపైన ప్రతిస్పందించారు. భారతదేశానికి 75 సంవత్సరాల స్వాతంత్ర్యం గురించి పరిశోధన చేసి, ఒక వ్యాసాన్ని రాయాలని, ప్రత్యేకించి వారు ఉంటున్న ప్రాంతాల ను గురించి అందులో పేర్కొనాలని ప్రధాన మంత్రి సూచన చేశారు.

కోవిడ్-19 తాలూకు సెకండ్ వేవ్ లో విద్యార్థులు వారి భాగస్వామ్యం ద్వారాను, సంఘటిత శ్రమ ద్వారాను కలిసికట్టుగా కనబర్చిన ఉత్సాహానికి గాను వారిని ప్రధాన మంత్రి ప్రశంసించారు.  ఐపిఎల్ ను, చాంపియన్స్ లీగ్ ను చూస్తారా, లేక ఒలంపిక్స్ కోసం గాని, అంతర్జాతీయ యోగ దినం కోసం గాని వేచి ఉంటారా అని విద్యార్థినీ విద్యార్థులను ప్రధాన మంత్రి అడిగారు. దానికి ఒక విద్యార్థిని ప్రస్తుతం తనకు కళాశాల ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష కు సన్నద్ధం అయ్యేందుకు చాలినంత కాలం చిక్కింది అంటూ జవాబిచ్చారు.  పరీక్షల రద్దు అనంతరం విద్యార్థుల కు లభించిన కాలాన్ని ఫలప్రదం గా వినియోగించుకోండంటూ వారికి ఆయన సూచన చేశారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Powering the energy sector

Media Coverage

Powering the energy sector
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 18th October 2021
October 18, 2021
షేర్ చేయండి
 
Comments

India congratulates and celebrates as Uttarakhand vaccinates 100% eligible population with 1st dose.

Citizens appreciate various initiatives of the Modi Govt..