Dr. Werner Hoyer, President, European Investment Bank meets Prime Minister Modi
European Investment Bank appreciates India’s strong and proactive measures in the field of climate change

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో యూరోపియన్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ ప్రెసిడెంటు డాక్టర్ వెర్నర్ హొయర్ ఈ రోజు న్యూ ఢిల్లీ లో భేటీ అయ్యారు. బ్యాంకు ఉన్నతాధికారులు ఈ సందర్భంగా శ్రీ వెర్నర్ హొయర్ వెంట ఉన్నారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఒక సంవత్సరం కిందట ఇయు- ఇండియా సమిట్ సందర్భంగా యూరోపియన్ ఇన్ వెస్ట్ మెంట్ బ్యాంకుకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధిబృందంతో సమావేశమయ్యారు. బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాన్ని న్యూ ఢిల్లీ లో ఏర్పాటు చేసేందుకు మద్దతిస్తానని అప్పట్లో ఆయన వాగ్దానం చేశారు. ఈ కార్యాలయాన్ని ఈ రోజు ప్రారంభించడమైంది.

శీతోష్ణ స్థితిలో మార్పు మరియు పర్యావరణ పరమైన సుస్థిరత్వం రంగాలలో భారతదేశం అనుసరిస్తున్న విధానాలను గురించి ప్రధాన మంత్రి ఈ రోజు జరిగిన సంభాషణ క్రమంలో వివరించారు. పర్యావరణ సంబంధ స్థిరత్వానికి దోహదం చేసే పథకాలకు, ఇంకా లక్నో మెట్రోకు గాను యూరోపియన్ ఇన్ వెస్ట్ మెంట్ బ్యాంక్ భారతదేశానికి ఒక బిలియన్ యూరోలను రుణంగా అందజేసింది.

శీతోష్ణ స్థితిలో మార్పు రంగానికి సంబంధించి భారతదేశం బలమైన, సంస్కరణానుకూల చర్యలను చేపడుతుండడాన్ని డాక్టర్ హొయర్ ప్రశంసించారు. ఈ దిశగా భారత్ చేసే ప్రయత్నాలకు తమ బ్యాంకు మద్దతును కొనసాగిస్తుంటుందని కూడా ఆయన అన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
The Nari Shakti Decade: How 12 years of policy reforms under Modi govt transformed lives of women in Bharat

Media Coverage

The Nari Shakti Decade: How 12 years of policy reforms under Modi govt transformed lives of women in Bharat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 జూన్ 2026
June 07, 2026

India on the Rise: Celebrating Milestones from Grassroots to the Global Stage Under the Leadership of PM Modi