శాంతి-ప్రగతి కోసం నిరపాయ.. సురక్షిత రీతిలో అణుశక్తి వినియోగంపై భారత నిబద్ధతను నొక్కిచెప్పిన ప్రధాని;
బాధ్యతాయుత అణుశక్తిగా భారత నిష్కళంక చరిత్రను.. సమాజ హితం దిశగా పౌర అణు అనువర్తనంలో ప్రపంచ నేతృత్వ పాత్రను ప్రశంసించిన మిస్టర్‌ గ్రాసీ;
దక్షిణార్థ గోళంలో అణు సాంకేతికత అనువర్తన విస్తరణలో సహకారంపై భారత్‌-ఐఎఇఎ అంగీకారం

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఎఇఎ) డైరెక్టర్ జనరల్ మిస్టర్‌ రఫేల్‌ మారియానో గ్రాసీ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- శాంతి-ప్రగతి కోసం నిరపాయ, సురక్షిత రీతిలో అణుశక్తి వినియోగంపై భారత్‌ నిరంతర నిబద్ధతను పునరుద్ఘాటించారు. అలాగే దేశ విద్యుదుత్పాదన సమ్మేళనంలో పర్యావరణ హిత అణు విద్యుత్తు వాటా పెంపుపై భారత్‌ నిర్దేశించుకున్న ప్రతిష్టాత్మక లక్ష్యాల గురించి ప్రధానమంత్రి ఆయనకు వివరించారు.

   డైరెక్టర్‌ జనరల్‌ గ్రాసీ మాట్లాడుతూ- బాధ్యతాయుత అణుశక్తిగా భారత నిష్కళంక చరిత్రను ప్రశంసించారు. అణు విజ్ఞానం, సాంకేతికతపరంగా భారత్‌ పురోగతిని ఆయన కొనియాడారు. ప్రత్యేకించి స్వదేశీ అణు విద్యుత్తు కేంద్రాల రూపకల్పన-విస్తరణను ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే సమాజ హితం లక్ష్యంగా పౌర అణు అనువర్తనంలో భారత్‌ పోషిస్తున్న ప్రపంచ నేతృత్వ పాత్రను కూడా గ్రాసీ ప్రశంసించారు. అంతేకాకుండా ఆరోగ్యం, ఆహారం, జలశుద్ధి, ప్లాస్టిక్ కాలుష్యం, వాతావరణ మార్పుసహా వివిధ రంగాల్లో మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్ల  పరిష్కారంలో అణు సాంకేతికత వినియోగంపై భారత్‌ అద్భుత ప్రగతి సాధించిందని ఆయన పేర్కొన్నారు.

   చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, సూక్ష్మ రియాక్టర్లు సహా నికర శూన్య ఉద్గార హామీలను నెరవెర్చే దిశగా అణుశక్తి పాత్ర విస్తరణపై వారిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

   భారత్‌-‘ఐఎఇఎ’ల మధ్యగల అత్యుత్తమ భాగస్వామ్యాన్ని డైరెక్టర్‌ జనరల్‌ గ్రాసీ ప్రశంసించారు. శిక్షణ, సామర్థ్య వికాసం విషయంలో ప్రపంచంలోని పలు దేశాలకు భారత్‌ తోడ్పాటును ఆయన కొనియాడారు. దక్షిణార్థ గోళంలో పౌర అణు సాంకేతికత అనువర్తన విస్తరణకుగల మార్గాల అన్వేషణలో సహకారంపై భారత్‌-ఐఎఇఎ పక్షాలు రెండూ ఒక  అంగీకారానికి వచ్చాయి.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation

Media Coverage

Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న యోధులకు ప్రధాని నివాళి
August 09, 2026

చరిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న యోధులందరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో వారు చూపిన ధైర్యసాహసాలకూ, దృఢ సంకల్పానికీ నివాళి అర్పించారు. మహాత్మాగాంధీ నాయకత్వం అందించిన స్ఫూర్తితో క్విట్ ఇండియా ఉద్యమం ఇచ్చిన పిలుపు స్వాతంత్ర్య పోరాటంలో నూతనోత్తేజాన్ని నింపిందనీ, వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న భారత ప్రజల అచంచలమైన సంకల్పాన్ని ప్రతిబింబించిందని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

చరిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారిని స్మరించుకుంటున్నా. వారి ధైర్యం ప్రతి భారతీయునికీ ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. మహాత్మాగాంధీ నాయకత్వం అందించిన స్ఫూర్తితో క్విట్ ఇండియా పిలుపు స్వాతంత్ర్య ఉద్యమంలో నూతన శక్తిని నింపింది. వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న మన ప్రజల అచంచల సంకల్పాన్ని ప్రతిబింబించింది.