ఆస్ట్రేలియా ఉప ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈ రోజు టెలిఫోన్‌లో సంభాషించారు. తాజాగా జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ విజయం సాధించినందుకు ఉప ప్రధాని మార్లెస్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
నేటితో అయిదేళ్లు పూర్తి చేసుకున్న భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు తమ ఆలోచనలు పంచుకున్నారు. రక్షణ పారిశ్రామిక సహకారం, స్థిరమైన సరఫరా వ్యవస్థలు, కీలకమైన ఖనిజాలు, నూతనంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, తదితర ముఖ్యమైన రంగాల్లో సహకారాన్ని విస్తరించాల్సిన అవసరం గురించి ప్రధానంగా చర్చించారు. స్థిరమైన, సురక్షితమైన, వృద్ధి చెందుతున్న ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం ఉమ్మడి ఆలోచన.. ద్వైపాక్షిక సహకారానికి మార్గనిర్దేశం చేస్తుందని వారు స్పష్టం చేశారు.
సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి ఆస్ట్రేలియా మద్దతు ఇస్తుందని ఉప ప్రధాని మార్లెస్ పునరుద్ఘాటించారు.
ఈ ఏడాది భారత్‌లో జరగనున్న వార్షిక సదస్సులో పాల్గొనాల్సిందిగా పీఎం ఆల్బనీస్‌ను ప్రధాని ఆహ్వానించారు.
Glad to meet Deputy Prime Minister of Australia Richard Marles. Had a productive discussion on deepening the India-Australia Comprehensive Strategic Partnership, which marks its fifth anniversary today. Our shared vision for a stable, secure, and prosperous Indo-Pacific continues… pic.twitter.com/VucoShDe4l
— Narendra Modi (@narendramodi) June 4, 2025


