మొదటిరోజు నుంచి కూడా ఎన్డిఎ ప్రభుత్వం మౌలిక సదుపాయాలను ప్రోత్సహించింది. అది రైల్వేలు, రహదారులు, లేదా షిప్పింగ్ అయినా కనెక్టివిటీలో సహాయం చేయడానికి మౌలిక సదుపాయాలను పెంపొందించుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది.
మొదటిసారి, రైల్వే బడ్జెట్ నిర్మాణ సంస్కరణలు మరియు మౌలిక మార్పుల మీద దృష్టి పెట్టింది. వార్షిక రాజకీయ జిమ్మిక్ గా ఉండే కొత్త రైళ్ల ప్రకటన, ఇప్పుడు సాధారణ కార్యకలాపాలలోకి వచ్చింది. రైల్వే స్టేషన్లు, ప్రయాణీకుల హెల్ప్లైన్ (138), సెక్యూరిటీ హెల్ప్లైన్ (182), కాగితపు రహిత అన్ రిజర్వ్డ్ టికెటింగ్, ఇ-క్యాటరింగ్, మొబైల్ భద్రతా యాప్, మహిళల భద్రత కోసం సి.సి.టి.వి. కెమెరాల ఏర్పాటు మొదలగు ప్రయాణీకుల స్నేహపూర్వక సదుపాయాలు ప్రారంభమయ్యాయి. రైల్వేలు ఆర్థిక వ్యవస్థ యొక్క లోకోమోటివ్ లాగా పనిచేస్తాయి మరియు గనులు, తీరములు మొదలైనవాటిని అనుసంధానిస్తాయి. ముంబై-అహ్మదాబాద్ కారిడార్ కోసం హై స్పీడ్ బుల్లెట్ రైలు ప్రణాళికరించబడింది. న్యూ ఢిల్లీ - చెన్నై మార్గం యొక్క సాధ్యత అధ్యయనం జరుగుతోంది.

ఈ సంవత్సరం 1,983 కిలోమీటర్ల రైల్వే లైన్లు ఏర్పాటు చేయబడ్డాయి మరియు అత్యుత్తమ ప్రదర్శనగా 1,375 కిలోమీటర్ల రైల్వే విద్యుద్దీకరణ పూర్తయింది. అంతేకాకుండా, 6 నూతన యాత్ర రైళ్లు ప్రారంభించబడ్డాయి. వైష్ణోదేవికి ప్రయాణానికి కత్రా లైన్ తెరవబడింది.
రహదారుల రంగంలో, నిలిచిపోయిన రహదారుల ప్రాజెక్టులు తిరిగిప్రారంభించబడ్డాయి, సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న ఒప్పందాలు పరిష్కరించబడ్డాయి మరియు అవాంఛనీయ ప్రాజెక్టులు రద్దు చేయబడ్డాయి. భారత్ సరిహద్దులు, తీరప్రాంతాల వెంబడి రోడ్ల నిర్మాణానికి భారత్ మాలాగా పిలువబడే ఒక పరివర్తనాత్మక ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణం కోసం 62 టోల్ ప్లాజాస్ వద్ద టోల్ ఫీజు సేకరణ నిలిపివేయబడింది. హైవే ప్రాజెక్టులు గత సంవత్సరం కంటే 120% ఎక్కువ పెరుగుదలను నమోదు చేశాయి. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా నిర్మించిన రహదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఎన్డిఎ ప్రభుత్వం హయాంలో షిప్పింగ్ రంగంలో కూడా భారతదేశం వేగంగా వృద్ధి చెందుతోంది. సాగర్మాలా ప్రాజెక్ట్ బలమైన తీరప్రాంతాల అభివృద్ధి ద్వారా సమగ్ర పోర్ట్ నేతృత్వ అభివృద్ధికి దోహదపడుతుంది. ఓడరేవుల్లో కార్గో వృద్ధిరేటు 4% నుండి 8% కు పెరిగింది. అత్యధిక వార్షిక సామర్ధ్యం అదనంగా 71 ఎంటిపిఏ (సంవత్సరానికి మెట్రిక్ టన్నులు) రికార్డు చేయబడింది. ఆఫ్గనిస్తాన్ మరియు మధ్యా ఆసియా దేశాలతో ప్రాప్యతను పెంచుకునేందుకు చాహబార్ ఓడరేవు వ్యూహాత్మక అభివృద్ధి కోసం ఇరాన్ దేశంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. గంగానదిలో రవాణా మరియు స్వదేశ జలమార్గాలను ప్రోత్సహించటానికి జల మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది.

పౌర విమానయాన రంగంలో కూడా సత్వర పురోగతి జరుగుతోంది. మొహాలి, తిరుపతి మరియు ఖజురహోరేలలో నూతన సమీకృత టెర్మినల్ భవనాల నిర్మాణం పూర్తి దశలో ఉంది. కడప మరియు బికానెర్ వద్ద టెర్మినల్స్ పూర్తి అయ్యాయి. ప్రాంతీయ అనుసంధానాన్ని ప్రోత్సహించేందుకు హుబ్లీ, బెల్గాం, కిషన్ గఢ్, తేజు, జర్సగుడులలో విమానాశ్రయాల అభివృద్ధి ప్రారంభం అయ్యింది. భారతదేశం యొక్క ఇంటర్నేషనల్ ఏవియేషన్ సేఫ్టీ ఆడిట్ (ఐఏఎస్ఏ), ఎఫ్ఏఏ చేత అధిక భద్రత రేటింగ్ను అప్గ్రేడ్ చేయబడి, అధిక విమానాలను ఎనేబుల్ చేస్తుంది.




