బయోమెడికల్ రిసర్చ్ కెరియర్ ప్రోగ్రామ్ (బీఆర్‌సీపీ) మూడో దశను కొనసాగించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమాన్ని మూడో దశ (2025-26 నుంచి 2030-31 వరకు), అలాగే తరువాతి ఆరు సంవత్సరాల వరకు (2031-32 నుంచి 2037-38 వరకు) బయోటెక్నాలజీ  విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ.. డీబీటీ), బ్రిటన్ కు చెందిన వెల్‌కం ట్రస్ట్ (డబ్ల్యూటీ)లతో పాటు ఎస్‌పీవీ, ఇండియా అలయన్స్‌ల మధ్య భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు. రూ.1500 కోట్ల మొత్తం వ్యయంతో 2030-31 వరకు అనుమతించిన ఫెలోషిప్, గ్రాంట్లను మంజూరు చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. దీనిలో రూ.1,000 కోట్లను డీబీటీ, రూ.500 కోట్లను యూకేకు చెందిన డబ్ల్యూటీ సమకూరుస్తాయి.  
నైపుణ్యాలనూ, నవకల్పననూ ప్రోత్సహించాలన్న వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బయోమెడికల్ రిసర్చ్ కెరియర్ ప్రోగ్రామ్ (బీఆర్‌సీపీ)లో మూడో దశను బయోటెక్నాలజీ  విభాగం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమం అత్యాధునిక బయోమెడికల్ రిసర్చ్ కృషిలో అగ్రగామి శాస్త్రవేత్తలకు తోడ్పడుతుంది. నవకల్పనను ట్రాన్స్‌లేషనల్ ఇన్నొవేషన్ నిమిత్తం వివిధ  విషయాల్లో పరిశోధనలు నిర్వహించేలా ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఇది అంతర్జాతీయంగా ప్రభావాన్ని చూపే ప్రపంచ స్థాయి బయోమెడికల్ పరిశోధనా సామర్థ్యాన్ని అభివృద్ధిపరచడానికి గాను అధిక నాణ్యత కలిగిన పరిశోధనలకు సాయపడే వ్యవస్థలను కూడా బలోపేతం చేయడంతో పాటు, బయోమెడికల్ రిసర్చ్‌లో ప్రాంతీయ అసమానతలను తగ్గిస్తుంది.

యూకేకు చెందిన వెల్‌కం ట్రస్టుతో డీబీటీ భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకొని 2008-2009లో బయోమెడికల్ రిసర్చ్ కెరియర్ ప్రోగ్రామ్ (బీఆర్‌సీపీ)ని ప్రారంభించింది. దీనికోసం డీబీటీ, వెల్‌కం ట్రస్ట్ ఇండియా అలయన్స్ పేరుతో ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పీవీ)ని ఏర్పాటు చేశారు. ఇది బయోమెడికల్ రిసర్చ్‌లో ప్రపంచ శ్రేణి ప్రమాణాలను అందుకోవాలన్న లక్ష్యంతో, భారత్‌లోనే రిసర్చ్ ఫెలోషిప్పులను అందిస్తోంది. దీని తరువాత, విస్తారిత పోర్ట్‌ఫోలియోతో రెండో దశను 2018, 19లో అమలు చేశారు.
మూడో దశలో, ఈ కింద పేర్కొన్న కార్యక్రమాలను అమలు చేయాలని ప్రతిపాదించారు: i.) మౌలిక, రోగ చికిత్సలకు సంబంధించిన (క్లినికల్), ప్రజారోగ్యం పరంగా ప్రారంభ కెరియర్, మధ్య స్థాయి రిసర్చ్ ఫెలోషిప్పులు. ఇవి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించినవీ, ఒక శాస్త్రవేత్తకు పరిశోధన ప్రధాన కెరియర్లో మొదటి  దశలకు ఉద్దేశించినవీ. ii.) సహకార ప్రధాన గ్రాంట్ల కార్యక్రమం. భారత్‌లో పటిష్ఠ పరిశోధన ట్రాక్ రికార్డు కలిగి ఉన్న ప్రారంభ, మధ్య స్థాయి సీనియర్ స్థాయి కెరియర్ పరిశోధకుల కోసం ఉద్దేశించిన రెండు, మూడు పరిశోధక బృందాలకు కెరియర్ డెవలప్‌మెంట్ గ్రాంట్లు, కెటలిటిక్ కొలాబరేటివ్ గ్రాంట్లను అందించడం ఈ కార్యక్రమంలో భాగం. iii) ముఖ్య పరిశోధన ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన రిసర్చ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్. మూడో దశలో మెంటార్‌షిప్పు, నెట్‌వర్కింగ్, ప్రజలను భాగస్వాములను చేయడం.. వీటిని బలపరచడంతో పాటు కొత్త, నవోన్మేష జాతీయ, అంతర్జాతీయ భాగస్వామ్యాలను అభివృద్ధిపరుచుకోవడంపై కూడా దృష్టి పెడతారు.

రిసర్చ్ ఫెలోషిప్పులు, సహకార ప్రాతిపదిక కలిగిన గ్రాంట్లు, రిసర్చ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం... ఇవి అన్నీ కలిసి విజ్ఞాన శాస్త్ర పరమైన ఎక్స్‌లెన్సునూ, నైపుణ్యాభివృద్ధినీ, సహకారాన్నీ, జ్ఞానాన్ని మార్పిడి చేసుకోవడాన్నీ పెంపొందిస్తాయి. దీనివల్ల లభిస్తాయనుకుంటున్న ఫలితాల్లో.. 2,000 కన్నా ఎక్కువ మంది విద్యార్థులు, పోస్ట్ డాక్టరల్ ఫెలో శిక్షణ కార్యక్రమం, అధిక ప్రభావాన్ని చూపగలిగే ప్రచురణలను  సిద్ధం చేయడం, పేటెంట్ అర్హతను పొందగలిగే ఆవిష్కారాలకు ఊతాన్నివ్వడం, సమకాలిక పక్షాల్లో గుర్తింపును తెచ్చుకోవడం, మహిళలకు అందించే సహాయాన్ని10-15 శాతం మేర పెంచడం, 25 నుంచి 30 శాతం సహకారాత్మక కార్యక్రమాలను టీఆర్ఎల్4, అంతకన్నా ఎక్కువ స్థాయికి చేర్చడం, టైర్-2,3 సెట్టింగులో కార్యకలాపాలనూ, అనుబంధాన్నీ విస్తరించడం వంటివి భాగంగా ఉన్నాయి.

ఒకటో దశ, రెండో దశలు భారత్‌ను అంతర్జాతీయ స్థాయి కలిగిన బయోమెడికల్ సైన్సుకు సరికొత్త కూడలిగా నిలిపాయి. విజ్ఞానశాస్త్రంలో భారత్ పెట్టుబడులను పెంచుతుండడంతోనూ, ప్రపంచ జ్ఞాన ప్రధాన ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్ర అంతకంతకూ పెరుగుతుండడంతోనూ వ్యూహాత్మక ప్రయత్నాల్లో ఒక  కొత్త దశను ఆవిష్కరించాల్సిన అవసరం ఏర్పడింది. ఒకటో, రెండో దశలతో లభించిన ప్రయోజనాలను స్ఫూర్తిగా తీసుకొని, మూడో దశ ఇక జాతీయ ప్రాధాన్యాలతో పాటు ప్రపంచ ప్రమాణాలకు కూడా తులతూగే ప్రతిభావంతులకు అండదండలను అందించడం, సామర్థ్య సాధన, రూపాంతరణ (ట్రాన్స్‌లేషన్) ప్రక్రియలపై దృష్టి సారించనుంది. 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Republic Day sales see fastest growth in five years on GST cuts, wedding demand

Media Coverage

Republic Day sales see fastest growth in five years on GST cuts, wedding demand
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 జనవరి 2026
January 27, 2026

India Rising: Historic EU Ties, Modern Infrastructure, and Empowered Citizens Mark PM Modi's Vision