ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్

ప్రారంభ వ్యయం రూ.19,744 కోట్లు కాగా, ఇందులో సైట్ (ఎస్ ఐ జి హెచ్ టి)  కార్యక్రమానికి రూ.17,490 కోట్లు, పైలట్ ప్రాజెక్టులకు రూ.1,466 కోట్లు, పరిశోధన, అభివృద్ధి కోసం రూ.400 కోట్లు, ఇతర మిషన్ భాగాలకు రూ.388 కోట్లు కేటాయించారు. సంబంధిత కాంపోనెంట్ ల అమలు కోసం ఎంఎన్ ఆర్ ఈ పథకం మార్గదర్శకాలను రూపొందిస్తుంది.

 

ఈ మిషన్ ఫలితంగా 2030 నాటికి ఈ క్రింది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వస్తాయి:

 

*దేశంలో 125 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో సహా సంవత్సరానికి కనీసం 5 ఎం ఎం టి (మిలియన్ మెట్రిక్ టన్నులు) గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం

 

*మొత్తం పెట్టుబడుల్లో రూ.8 లక్షల కోట్లకు పైగా

 

*ఆరు లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన

 

*శిలాజ ఇంధన దిగుమతుల్లో రూ. లక్ష కోట్ల

సంచిత తగ్గుదల

 

*వార్షిక గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల్లో దాదాపు 50 ఎం ఎం టి ల తగ్గింపు

 

గ్రీన్ హైడ్రోజన్ , దాని ఉత్పన్నాలకు ఎగుమతి అవకాశాలను సృష్టించడం వంటి విస్తృత ప్రయోజనాలను మిషన్ కలిగి ఉంటుంది; పారిశ్రామిక, చలనశీలత , ఇంధన రంగాల డీకార్బోనైజేషన్; దిగుమతి చేసుకున్న శిలాజ ఇంధనాలు,ఫీడ్ స్టాక్ పై ఆధారపడటాన్ని తగ్గించడం; దేశీయ తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం; ఉపాధి అవకాశాల కల్పన; ఇంకా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి. భారతదేశ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి కనీసం 5 మిలియన్ టన్నులకు చేరుకునే అవకాశం ఉంది, అనుబంధ పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని సుమారు 125 గిగావాట్లను జోడిస్తుంది. 2030 నాటికి రూ.8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని, 6 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశారు. 2030నాటికి సంవత్సరానికి దాదాపు 50 ఎంఎంటి కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నివారించవచ్చని భావిస్తున్నారు.

 

గ్రీన్ హైడ్రోజన్ కు డిమాండ్ సృష్టించడం, ఉత్పత్తి, వినియోగం , ఎగుమతిని ఈ మిషన్ సులభతరం చేస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ కోసం వ్యూహాత్మక ఇంటర్వెన్షన్స్ (ఎస్ ఐ జి హెచ్ టి) కింద, ఎలక్ట్రోలైజర్ల దేశీయ తయారీ,  గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుని రెండు విభిన్న ఆర్థిక ప్రోత్సాహక యంత్రాంగాలు మిషన్ కింద అందించబడతాయి. అభివృద్ధి చెందుతున్న తుది వినియోగ రంగాలు, ఉత్పత్తి మార్గాలలో పైలట్ ప్రాజెక్టులకు కూడా మిషన్ మద్దతు ఇస్తుంది. పెద్ద ఎత్తున హైడ్రోజన్ ఉత్పత్తి మరియు/లేదా వినియోగానికి మద్దతు ఇవ్వగల

ప్రాంతాలను గ్రీన్ హైడ్రోజన్ హబ్ లుగా గుర్తిస్తారు. అభివృద్ధి చేస్తారు.  

 

గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్ స్థాపనకు మద్దతు ఇవ్వడానికి వీలైన విధాన యంత్రాంగాన్ని అభివృద్ధి చేస్తారు.

దృఢమైన ప్రమాణాలు ,నిబంధనల ఫ్రేమ్ వర్క్ ను కూడా అభివృద్ధి చేస్తారు. ఇంకా, ఈ మిషన్ పరిశోధన-అభివృద్ధి (వ్యూహాత్మక హైడ్రోజన్ ఇన్నోవేషన్ పార్టనర్ షిప్ - షిప్) కోసం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య ఫ్రేమ్ వర్క్ ను సులభతరం చేస్తుంది; ఆర్ అండ్ డి ప్రాజెక్టులు లక్ష్య-ఆధారితమైనవి, కాలపరిమితితో కూడినవి.ప్రపంచవ్యాప్తంగా పోటీ సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడానికి తగిన విధంగా ఉంటాయి.

 

మిషన్ లక్ష్యాలను విజయవంతంగా సాధించడానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఏజెన్సీలు,సంస్థలు కేంద్రీకృత ,సమన్వయ చర్యలు తీసుకుంటాయి. మిషన్ మొత్తం సమన్వయం,అమలు కు నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India to add 100 merchant ships to its fleet in 5 years: Sarbananda Sonowal

Media Coverage

India to add 100 merchant ships to its fleet in 5 years: Sarbananda Sonowal
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి 27న ప్రధానమంత్రి ప్రసంగం
August 26, 2026
దేశంలో క్రీడలు.. యువ నాయకత్వం.. పౌర బాధ్యత.. స్వచ్ఛంద సేవ.. దారుఢ్యం.. దేశ ప్రగతి వంటి అంశాలను ఈ చర్చలు ఒకే వేదికపైకి తెస్తాయి
ఈ చర్చలు ప్రధానంగా క్రీడలు.. ఒలింపిక్స్‌ ఆకాంక్షలు.. యువ నేతృత్వం.. వికిసిత భారత్.. మాదకద్రవ్య రహిత యువతరంపై దృష్టి సారిస్తాయి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ క్రీడారంగ పురోగమనంలో యువత భాగస్వామ్యం సహా వారి ఆకాంక్షల వెల్లడి, యువతరం నాయకత్వాన బలమైన వికసిత భారత్ కోసం మేధా మధనం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం-2026లో భాగంగా ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలోగల రెండు కళాశాలల్లో యువతరం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జాతీయ ప్రగతి కార్యకలాపాల్లో యువత ఆకాంక్షలకు కీలక స్థానమిస్తూ ఆరోగ్యకర, క్రమశిక్షణాయుత. క్రీడాస్ఫూర్తి గల దేశానికి రూపుదిద్దాలన్న ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

దేశంలో క్రీడలు, యువ నాయకత్వం, పౌర కర్తవ్యం, స్వచ్ఛంద సేవ, దారుఢ్యం, దేశ పురోగమనం తదితర అంశాలన్నిటిపైనా చర్చను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తెస్తుంది. దేశ క్రీడారంగ పురోగమన ఆకాంక్షలతో యువత మమేకమయ్యే ప్రత్యక్ష మార్గాన్ని నిర్దేశిస్తుంది. దేశ యువతరం, క్రీడా వ్యవస్థపై చర్చల సందర్భంగా వారి ఆలోచనలు, దృక్కోణాలను పంచుకునే వేదికగా ఇది ఉపయోగపడుతుంది.

ఈ జాతీయ స్థాయి కార్యక్రమం అనంతరం యువ భాగస్వాములు, మై భారత్ వలంటీర్లు, స్థానిక క్రీడాకారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్థానిక స్థాయిలో చర్చలు సాగుతాయి. క్రీడాసక్తి గల యువత, ప్రముఖ క్రీడాకారులు, పతక విజేతల మధ్య ప్రత్యక్ష ఇష్టాగోష్ఠి ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో ‘యువతరం చర్చలు’ ప్రధానాంశంగా ఉంటాయి. యువ భాగస్వాములు తమ ఆలోచనలు, దృక్కోణాలు, ఆకాంక్షలను ఈ వేదిక ద్వారా పంచుకుంటారు. ఈ చర్చలు ప్రధానంగా దిగువ పేర్కొన్న 5 అంశాలపై కేంద్రీకృతమవుతాయి:

· మెరుగైన సౌకర్యాలు, శిక్షణ, క్రీడా విజ్ఞానం, సార్వజనీన భాగస్వామ్యంతో జాతీయ క్రీడా వ్యవస్థ మెరుగుదల.

· శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపు, పారదర్శక ఎంపిక, దీర్ఘకాలిక క్రీడా వికాసం ద్వారా 2036లో ఒలింపిక్స్ దిశగా ప్రతిభకు పదును పెట్టడం.

· పరిపాలన వేదికలు, మై భారత్ నేతృత్వంలోని స్వచ్ఛంద సేవ ద్వారా యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దడం.

· పౌర చైతన్యం, భవిష్యత్‌ సంసిద్ధ నైపుణ్యం, వ్యవస్థీకృత స్వచ్ఛంద సేవకు ప్రోత్సాహం, ద్వారా వికసిత భారత్ ప్రస్థానం వైపు యువతరానికి సాధికారత కల్పన.

· ఈ నెల 2న ప్రారంభమైన ‘ప్రధానమంత్రి 100 వారాల ప్రచారం’లో భాగంగా వారానికోసారి జన భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాదకద్రవ్య వినియోగంపై పోరులో క్రీడలు సహా, సహ రంగాల్లోని వివిధ బృందాల సేవల ద్వారా ‘మాదకద్రవ్య రహిత యువత’ ఉద్యమాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ధ్యేయం.