మార్కెటింగ్ సీజన్ 2026-27లో 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను పెంచడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్థిక వ్యవహరాలపై క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది.
దిగుబడికి తగిన లాభదాయకమైన ధరలు రైతులకు లభించేలా చూసేందుకు 2026-27 మార్కెటింగ్ సీజన్‌లో ఖరీఫ్ పంటలకిచ్చే ఎంఎస్‌పీని ప్రభుత్వం పెంచింది. గతేడాదితో పోలిస్తే.. పొద్దుతిరుగుడు విత్తనాలకు (క్వింటాలుకు రూ. 622) అత్యధికంగా ఎంఎస్‌పీ పెరిగింది. ఆ తర్వాత పత్తి (క్వింటాలుకు రూ. 557), వలిసెలు (క్వింటాలుకు రూ.515), నువ్వులు (క్వింటాలుకు రూ. 500) పంటలకు ఎంఎస్‌పీ పెరిగింది.
2026-27 మార్కెటింగ్ సీజన్లో అన్ని ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలు (క్వింటాలకు రూ.లలో)
|
S. No . |
Crops |
MSP 2026-27 |
Cost* KMS 2026-27 |
Margin over cost (%) |
MSP |
MS MSP Increase in 2026-27 |
|||
|
|
Cereals |
2025- 26 |
2013- 14 |
over 2025-26 |
over 2013-14 |
||||
|
|
|
|
|
|
|
|
|
||
|
1. |
Paddy |
Common |
2441 |
1627 |
50 |
2369 |
1310 |
72 |
1131 (86%) |
|
|
Grade A^ |
2461 |
- |
- |
2389 |
1345 |
72 |
1116 (83%) |
|
|
2. |
Jowar |
Hybrid |
4023 |
2682 |
50 |
3699 |
1500 |
324 |
2523 (168%) |
|
|
Maldandi ^ |
4073 |
- |
- |
3749 |
1520 |
324 |
2553 (168%) |
|
|
3. |
Bajra |
2900 |
1858 |
56 |
2775 |
1250 |
125 |
1650 (132%) |
|
|
4. |
Ragi |
5205 |
3470 |
50 |
4886 |
1500 |
319 |
3705 (247%) |
|
|
5. |
Maize |
2410 |
1544 |
56 |
2400 |
1310 |
10 |
1100 (84%) |
|
|
|
Pulses |
||||||||
|
6. |
Tur /Arhar |
8450 |
5496 |
54 |
8000 |
4300 |
450 |
4150 (97%) |
|
|
7. |
Moong |
8780 |
5438 |
61 |
8768 |
4500 |
12 |
4280 (95%) |
|
|
8. |
Urad |
8200 |
5418 |
51 |
7800 |
4300 |
400 |
3900 (91%) |
|
|
|
Oilseeds |
||||||||
|
9. |
Groundnut |
7517 |
5011 |
50 |
7263 |
4000 |
254 |
3517 (88%) |
|
|
10. |
Sunflower Seed |
8343 |
5562 |
50 |
7721 |
3700 |
622 |
4643 (125%) |
|
|
11. |
Soybean (Yellow) |
5708 |
3805 |
50 |
5328 |
2560 |
380 |
3148 (123%) |
|
|
12. |
Sesamum |
10346 |
6897 |
50 |
9846 |
4500 |
500 |
5846 (130%) |
|
|
13. |
Nigerseed |
10052 |
6701 |
50 |
9537 |
3500 |
515 |
6552 (187%) |
|
|
|
Commercial |
|
|
|
|
|
|
|
|
|
14. |
Cotton |
(Medium Staple) |
8267 |
5511 |
50 |
7710 |
3700 |
557 |
4567 (123%) |
|
|
(Long Staple) ^ |
8667 |
- |
- |
8110 |
4000 |
557 |
4667 (117%) |
|
* కూలీలు, ఎద్దులు/యంత్రాల ఖర్చు, లీజుకు తీసుకున్న భూమికి చెల్లించిన కౌలు, విత్తనాలు, ఎరువులు, సేంద్రియ ఎరువులు లాంటి వాటికయ్యే పెట్టుబడి, నీటిపారుదల ఛార్జీలు, వ్యవసాయ పరికరాలు-నిర్మాణాల్లో తరుగుదల, పెట్టుబడిపై వడ్డీ, పంపుసెట్ల నిర్వహణకు డీజిల్/విద్యుత్ తదితర ఖర్చులు, కుటుంబ శ్రమ అంచనా విలువతో సహా చెల్లింపులు చేసే అన్ని రకాల ఖర్చులను ఇది సూచిస్తుంది.
^ వరి (గ్రేడ్ ఎ), జొన్న (మల్దండి), పత్తి (పొడుగు పింజ)కి సంబంధించిన వ్యయ గణాంకాలను విడిగా లెక్కించలేదు.
దేశం మొత్తమ్మీద సగటు ఉత్పత్తి వ్యయానికి కనీసం 1.5 రెట్లు ఉండేలా ఎంఎస్‌పీని నిర్ణయించాలన్న 2018-19 కేంద్ర బడ్జెట్ ప్రకటనలకు అనుగుణంగా 2026-27 మార్కెటింగ్ సీజన్‌లో ఖరీఫ్ పంటలకు ఎంఎస్‌పీ పెరుగుదల ఉంది. పంట వ్యయంపై రైతులకు అందే అంచనా లాభం పెసరకు అత్యధికంగా (61శాతం) ఉంటుందని భావిస్తున్నారు. ఆ తర్వాత సజ్జ (56%), మొక్కజొన్న (56%), కంది (54%) ఉంటాయని అంచనా. మిగిలిన పంటల విషయానికి వస్తే.. పెట్టుబడి వ్యయంపై రైతులకు దక్కే లాభం 50 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇటీవలి సంవత్సరాల్లో తృణధాన్యాలు మాత్రమే కాకుండా పప్పులు, నూనె గింజలు, పోషకాలతో నిండిన చిరుధాన్యాలు/శ్రీ అన్న లాంటి పంటలకు సైతం అధిక ఎంఎస్‌పీను అందించి, వాటి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
2014-15 నుంచి 2025-26 మధ్య కాలంలో సేకరించిన వరి 8418 ఎల్ఎంటీలు కాగా 2004-05 నుంచి 2013-14 వరకు సేకరించిన ధాన్యం 4590 ఎల్ఎంటీలుగా ఉంది.
2014-15 నుంచి 2025-26 వరకు సేకరించిన 14 ఖరీఫ్ పంటలు 8746 ఎల్ఎంటీలు. 2004-05 నుంచి 2013-14 మధ్య సేకరించిన మొత్తం 4679 ఎల్ఎంటీలుగా ఉంది.
వరి రైతులకు2014-15 నుంచి 2025-26 మధ్య కాలంలో రూ.16.08 లక్షల కోట్లు ఎంఎస్‌పీగా అందించగా 2004-05 నుంచి 2013-14 వరకు చెల్లించిన మొత్తం రూ. 4.44 లక్షల కోట్లుగా ఉంది.
2014-15 నుంచి 2025-26 మధ్య కాలంలో 14 ఖరీఫ్ పంటలకుగాను రైతులకు అందించిన ఎంఎస్‌పీ మొత్తం రూ. 18.99 లక్షల కోట్లు కాగా, 2004-05 నుంచి 2013-14 వరకు చెల్లించిన ఎంఎస్‌పీ మొత్తం రూ. 4.75 లక్షల కోట్లు.


