ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ 2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పీ) పెంపు నిర్ణయానికి ఆమోదం తెలిపింది.
2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం ప్రభుత్వం పంటల కనీస మద్దతు ధరను పెంచింది, దీని ద్వారా రైతులకు వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలు లభించనున్నాయి. గతేడాది కంటే అత్యధిక ఎంఎస్‌పీ ధరలను వెర్రి నువ్వులు (క్వింటాలుకు రూ.820), ఆ తరువాత రాగి (క్వింటాలుకు రూ.596), పత్తి (క్వింటాలుకు రూ.589), నువ్వుల (క్వింటాలుకు రూ.579) కోసం సిఫార్సు చేశారు.
2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం అన్ని ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల వివరాలు ఇలా ఉన్నాయి
(క్వింటాలుకు రూపాయలు)
|
S.No. |
Crops |
MSP 2025-26 |
Cost* KMS 2025-26 |
Margin over cost (%) |
MSP |
MSP Increase in 2025-26 |
||||
|
|
Cereals |
2024-25 |
2013-14 |
over |
over 2013-14
|
|||||
|
|
|
|
|
|||||||
|
1. |
Paddy |
Common |
2369 |
1579 |
50 |
2300 |
1310 |
69 |
1059 (81%) |
|
|
|
Grade A^ |
2389 |
- |
- |
2320 |
1345 |
69 |
1044 (78%) |
||
|
2. |
Jowar |
Hybrid |
3699 |
2466 |
50 |
3371 |
1500 |
328 |
2199 (147%) |
|
|
|
Maldandi^ |
3749 |
- |
- |
3421 |
1520 |
328
|
2299 (147%) |
||
|
3. |
Bajra |
2775 |
1703 |
63 |
2625 |
1250 |
150 |
1525 (122%) |
||
|
4. |
Ragi |
4886 |
3257 |
50 |
4290 |
1500 |
596 |
3386 (226%) |
||
|
5. |
Maize |
2400 |
1508 |
59 |
2225 |
1310 |
175 |
1090 (83%) |
||
|
|
Pulses |
|
|
|
|
|
|
|
||
|
6. |
Tur /Arhar |
8000 |
5038 |
59 |
7550 |
4300 |
450 |
3700 (86%) |
||
|
7. |
Moong |
8768 |
5845 |
50 |
8682 |
4500 |
86 |
4268 (95%) |
||
|
|
Crops |
MSP 2025-26 |
Cost* KMS 2025-26 |
Margin over cost (%) |
MSP |
MSP Increase in 2025-26 |
||||
|
|
|
|
|
|
2024-25 |
2013-14 |
over 2024-25 |
over 2013-14
|
||
|
8. |
Urad |
7800 |
5114 |
53 |
7400 |
4300 |
400
|
3500 |
||
|
|
Oilseeds |
|
|
|
|
|||||
|
9. |
Groundnut |
7263 |
4842 |
50 |
6783 |
4000 |
480 |
3263 (82%)
|
||
|
10. |
Sunflower Seed |
7721 |
5147 |
50 |
7280 |
3700 |
441 |
4021 (109%) |
||
|
11. |
Soybean (Yellow) |
5328 |
3552 |
50 |
4892 |
2560 |
436 |
2768 (108%) |
||
|
12. |
Sesamum |
9846 |
6564 |
50 |
9267 |
4500 |
579 |
5346 (119%)
|
||
|
13. |
Nigerseed |
9537 |
6358 |
50 |
8717 |
3500 |
820 |
6037 (172%) |
||
|
|
Commercial |
|
|
|
|
|
|
|
||
|
14. |
Cotton |
(Medium Staple) |
7710 |
5140 |
50 |
7121 |
3700 |
589 |
4010 (108%) |
|
|
|
(Long Staple)^ |
8110 |
- |
- |
7521 |
4000 |
589 |
4110 (103%) |
||
*ఇది కూలీలు, ఎద్దులు/యంత్రాల నిర్వహణ కూలీలు, కౌలు తీసుకున్న భూమి కోసం చెల్లించే కౌలు, విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల ఛార్జీలు, పనిముట్లు, వ్యవసాయ భవనాల తరుగుదల, మూలధనంపై వడ్డీ, పంపు సెట్ల నిర్వహణ కోసం డీజిల్/విద్యుత్ మొదలైన మెటీరియల్ ఇన్‌పుట్స్ కోసం అయ్యే ఖర్చులు, ఇతర చిల్లర ఖర్చులు, కుటుంబ సభ్యుల శ్రమ విలువ వంటి చెల్లించిన అన్ని ఖర్చులను కలిపి లెక్కించిన మొత్తం ఖర్చును సూచిస్తుంది.
^ ఖర్చు డేటాను వరి (గ్రేడ్ ఎ), జొన్న (మల్దండి), పత్తి (లాంగ్ స్టాపుల్) కోసం విడిగా సంకలనం చేయలేదు.
దేశవ్యాప్త సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్ల మొత్తాన్ని ఎంఎస్‌పీగా నిర్ణయించాలనే 2018-19 కేంద్ర బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా 2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటల ఎంఎస్‌పీ పెంపును నిర్ణయించారు. సజ్జ (63%), తరువాత మొక్కజొన్న (59%), కంది (59%), మినుములు (53%) విషయంలో రైతులకు వారి ఉత్పత్తి వ్యయం కంటే చాలా ఎక్కువ మార్జిన్ అందుతుండగా, మిగిలిన పంటలు సాగు చేసిన రైతులకు వారి ఉత్పత్తి వ్యయం కంటే 50 శాతం వరకు మార్జిన్ ఉంటుందని అంచనా.
ఇటీవలి సంవత్సరాల్లో, ప్రభుత్వం తృణధాన్యాల కన్నా పప్పుధాన్యాలు, నూనెగింజలు, న్యూట్రి-సెరియల్స్/ శ్రీ అన్నా వంటి ఇతర పంటలకు ఎంఎస్‌పీని పెంచడం ద్వారా వాటి సాగును ప్రోత్సహిస్తోంది.
2004-05 నుంచి 2013-14 మధ్య కాలంలో 4590 ఎల్ఎంటీల వరి ధాన్యం సేకరించగా, 2014-15 నుంచి 2024-25 మధ్య కాలంలో 7608 ఎల్ఎంటీల వరి ధాన్యం సేకరించారు.
14 రకాల ఖరీప్ పంటల విషయంలో.. 2004-05 నుంచి 2013-14 మధ్య కాలంలో సేకరణ 4679 ఎల్ఎంటీలు కాగా, 2014-15 నుంచి 2024-25 మధ్య కాలంలో ఇది 7871 ఎల్ఎంటీలుగా ఉంది.
2004-05 నుంచి 2013-14 వరకు వరి రైతులకు చెల్లించిన ఎంఎస్‌పీ మొత్తం రూ. 4.44 లక్షల కోట్లు కాగా, 2014-15 నుంచి 2024-25 కాలంలో ఈ మొత్తం రూ. 14.16 లక్షల కోట్లుగా ఉంది.
2004-05 నుంచి 2013-14 వరకు, 14 ఖరీప్ పంటలు సాగు చేసిన రైతులకు చెల్లించిన ఎంఎస్‌పీ మొత్తం రూ. 4.75 లక్షల కోట్లుగా ఉండగా, 2014-15 నుంచి 2024-25 వరకు వారికి చెల్లించిన ఎంఎస్‌పీ మొత్తం రూ. 16.35 లక్షల కోట్లుగా ఉంది.
देशभर के किसान भाई-बहनों के कल्याण के लिए हम पूरी तरह से प्रतिबद्ध हैं। इसी दिशा में 2025-26 के खरीफ सीजन के लिए धान, तिलहन और दलहन सहित 14 फसलों की एमएसपी में बढ़ोतरी को मंजूरी दी गई है। इससे अन्नदाताओं की कमाई बढ़ने के साथ इन फसलों का उत्पादन भी बढ़ेगा।https://t.co/K5A257TSTr
— Narendra Modi (@narendramodi) May 28, 2025


