షేర్ చేయండి
 
Comments
10000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్; 101 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు; 50 అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటు
అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్ ల ద్వారా 200 స్టార్టప్ లకు మద్దతు
రూ.2000 కోట్లకు పైగా ఖర్చు

సమావేశ మైన కేంద్ర మంత్రివర్గం  అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఎఐఎం)ను 2023 మార్చి వరకు కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. దేశంలో ఒక సృజనాత్మక సంస్కృతి , వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యం పై ఎఐఎమ్ పనిచేస్తుంది. ఎఐఎమ్ వివిధ కార్యక్రమాల ద్వారా ఈ లక్ష్య సాధన దిశగా పని చేస్తుంది. 

ఎఐఎం ద్వారా సాధించేందుకు ఉద్దేశించిన లక్ష్యాలు:

 *         10000 అటల్ టింకరింగ్ ల్యాబ్ లు

 (ఏ టి ఎల్) ఏర్పాటు చేయడం

*          101 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు (ఎఐసిల) ఏర్పాటు చేయడం

*       50 అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ లు (ఎసిఐసి) ఏర్పాటు చేయడం

*        అటల్ న్యూ ఇండియా ఛాలెంజెస్ ద్వారా 200 స్టార్టప్ లకు మద్దతు ఇవ్వడం.

మొత్తం బడ్జెట్ వ్యయం రూ.2000+ కోట్లు స్థాపన , లబ్ధిదారులకు మద్దతు ఇచ్చే ప్రక్రియలో ఖర్చు చేయబడుతుంది.

2015 బడ్జెట్ ప్రసంగంలో గౌరవ ఆర్థిక మంత్రి ప్రకటనకు అనుగుణంగా నీతి ఆయోగ్

ఆధ్వర్యంలో ఈ మిషన్ ను ఏర్పాటు చేశారు.పాఠశాల, విశ్వవిద్యాలయం, పరిశోధనా సంస్థలు, ఎం ఎస్ ఎం ఇ

ఇంకా పరిశ్రమ స్థాయిల్లో జోక్యాల ద్వారా దేశవ్యాప్తంగా సృజనాత్మకత , వ్యవస్థాపక సంబంధ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ప్రోత్సహించడం ఈ మిషన్ లక్ష్యాలు. మౌలిక సదుపాయాల కల్పన , సంస్థాగత  నిర్మాణం రెండింటిపైనా ఎఐఎం దృష్టి సారించింది. ఈ ఉదాహరణల ద్వారా స్పష్టమవుతున్నట్లుగా, ఎఐఎమ్ జాతీయంగానూ, అంతర్జాతీయం గా కూడా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ని అనుసంధానం చేయడం పై పనిచేసింది:

సృజనాత్మకత , వ్యవస్థాపకతపై సంఘటిత సహకారాన్ని పెంపొందించడానికి రష్యాతో ఎఐఎమ్ – సిరియస్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్, ఎఐఎమ్ – ఐసిడికె (ఇన్నోవేషన్ సెంటర్ డెన్మార్క్) డెన్మార్క్ తో వాటర్ ఛాలెంజ్, ఆస్ట్రేలియాతో ఐఎసిఇ (ఇండియా ఆస్ట్రేలియన్ సర్క్యులర్ ఎకానమీ హ్యాకథాన్) వంటి వివిధ అంతర్జాతీయ సంస్థలతో ఎఐఎమ్ ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పింది.    

భారత్ సింగపూర్ మధ్య ఇన్నోవేషన్ స్టార్టప్ శిఖరాగ్ర సదస్సు ‘ఇన్ స్ప్రెన్యూర్‘

విజయవంతం కావడంలో ఏఐఎం లు కీలక పాత్ర పోషించాయి.

రక్షణ రంగంలో ఆవిష్కరణలతో పాటు కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్న డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖతో ఏఐఎం భాగస్వామ్యం కుదుర్చుకుంది.  

గత సంవత్సరాలలో, దేశ వ్యాప్తంగా

ఆవిష్కరణ కార్యకలాపాలను ఏకీకృతం

చేసేందుకు ఒక సంస్థాగత యంత్రాంగాన్ని అందించడానికి ఎఐఎం కృషి చేసింది. తన కార్యక్రమాల ద్వారా, ఇది లక్షలాది మంది పాఠశాల పిల్లలలో  సృజనాత్మకతను తీసుకువచ్చింది. ఎఐఎం మద్దతు ఉన్న స్టార్టప్ లు ప్రభుత్వం , ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి 2000+ కోట్లు సమీకరించాయి. ఇంకా అనేక వేల ఉద్యోగాలను సృష్టించాయి. ఎఐఎం జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై అనేక ఆవిష్కరణ సవాళ్లను కూడా అమలు చేసింది. కలిసి, ఎఐఎం కార్యక్రమాలు అన్నీ కలసి ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌లో  34 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల ఎక్కువ భాగస్వామ్యాన్ని ప్రేరేపించడం ద్వారా భారతదేశ జనాభా డివిడెండ్‌ను పెంచే లక్ష్యంతో ఉన్నాయి.

అటల్ ఇన్నోవేషన్ మిషన్ పొడిగింపుకు క్యాబినెట్ ఆమోదంతో, సృజనాత్మకత, వ్యవస్థాపకతలో నిమగ్నం కావడం మరింత సులభం అయ్యే సమ్మిళిత సృజనాత్మక పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి ఎఐఎం మరింత గొప్ప బాధ్యతను తీసుకుంటుంది.

 

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
India a shining star of global economy: S&P Chief Economist

Media Coverage

India a shining star of global economy: S&P Chief Economist
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 సెప్టెంబర్ 2022
September 25, 2022
షేర్ చేయండి
 
Comments

Nation tunes in to PM Modi’s Mann Ki Baat.