కేంద్రీయ ప్రాయోజిత పథకం (సిఎస్ఎస్) అయిన ఫాస్ట్ ట్రాక్ స్పెశల్ కోర్టుల (ఎఫ్‌టి‌ఎస్‌సి స్) ను 2023 ఏప్రిల్ ఒకటో తేదీ మొదలుకొని 2026 మార్చి నెల 31వ తేదీ వరకు కొనసాగించడాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలియ జేసింది. ఈ నిర్ణయం ఫలితం గా 1952.23 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక ప్రభావం ఉంటుంది (దీనిలో కేంద్రం తాలూకు వాటా 1207.24 కోట్ల రూపాయలు గాను, మరియు రాష్ట్రం వాటా 744.99 కోట్లు గాను ఉంటుంది). కేంద్రీయ వాటా ను నిర్భయ నిధి నుండి సమకూర్చడం జరుగుతుంది. ఈ పథకాన్ని 2019 అక్టోబరు 2వ తేదీ నాడు ప్రవేశపెట్టడమైంది.

 

మహిళలు మరియు బాలల సంరక్షణ కు మరియు సురక్ష కు పూచీ పడే దిశ లో కేంద్ర ప్రభుత్వం అచంచల ప్రాధాన్యాన్ని కట్టబెట్టింది. ఈ క్రమం లో ‘బేటీ బచావో-బేటీ పఢావో’ కార్యక్రమం వంటి అనేక కార్యక్రమాల ను అమలుపరచడం జరుగుతున్నది. ఆడపిల్లల మరియు మహిళల అత్యాచారం సంబంధి ఘటన లు దేశ ప్రజల పై తీవ్ర ప్రభావాన్ని ప్రసరించాయి. ఆ కోవ కు చెందిన సంఘటన లు తరచుగా చోటు చేసుకొంటూ ఉండడం, మరి అపరాధుల విచారణ ప్రక్రియ సుదీర్ఘం గా కొనసాగుతూ ఉండడం తో సదరు విచారణల ను వేగిర పరచేటటువంటి ఒక ప్రత్యేకమైన న్యాయ వ్యవస్థ ను ఏర్పాటు చేయవలసిన అవసరం ఏర్పడింది; లైంగిక నేరాల బాధితుల కు సత్వర ఉపశమనాన్ని అందజేయడాని కి ఈ చర్య ఉద్దేశించింది. తత్ఫలితం గా, కేంద్ర ప్రభుత్వం ‘‘ది క్రిమినల్ లా (అమెండ్ మెంట్) యాక్టు, 2018’’ ను తీసుకు వచ్చింది. దీని లో అత్యాచార నేరగాళ్ళ కు మరణదండన సహా కఠినమైన శిక్ష భాగం గా ఉన్నాయి. ఇంకా, దీనితో ఫాస్ట్ ట్రాక్ స్పెశల్ కోర్ట్స్ (ఎఫ్‌టిఎస్‌సి స్) ల ఏర్పాటు సాధ్యపడింది.

 

ప్రత్యేకమైన న్యాయస్థానాలు గా ఏర్పరచిన ఎఫ్‌టిఎస్‌సి లు సత్వర న్యాయాని కి పూచీ పడతాయి అనే అంచనా కు తోడుగా, లైంగిక నేరగాళ్ళ కోసం ఉద్దేశించినటువంటి నిరోధక యంత్రాంగాన్ని పటిష్టపరుస్తూను మరియు పీడితుల కు సత్వర ఉపశమనాన్ని ప్రదానం చేయడం కోసం త్వరిత న్యాయాన్ని అందించడానికి పూచీపడుతాయి.

 

యూనియన్ ఆఫ్ ఇండియా 2019 ఆగస్టు లో, అత్యాచారాని కి సంబంధించిన వ్యాజ్యాల ను సరైన కాలం లోపు పరిష్కరించడాని కి మరియు ప్రొటెక్శన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్యూవల్ అఫెన్సెస్ యాక్ట్ (పిఒసిఎస్ఒ.. పోక్సో) అనే ఒక చట్టాన్ని ఏర్పాటు చేయడం కోసం ఒక కేంద్రీయ ప్రాయోజిత పథకాని కి రూపకల్పన చేసింది. 2019 జులై 25 వ తేదీ నాడు రిట్ పిటిషన్ (క్రిమినల్) సంఖ్య 1/2019 సందర్భం లో మాన్య భారతదేశం సర్వోన్నత న్యాయస్థానం సు మోటో గా ఇచ్చినటువంటి ఆదేశాల ను అమలుపరుస్తూ, వంద కు పై చిలుకు పోక్సో యాక్టు కేసు లు దాఖలు అయిన జిల్లాల కై ప్రత్యేకం గా పోక్సో న్యాయస్థానాల ను ఏర్పాటు చేసి తీరాలి అని ఈ స్కీము లక్షించింది. మొదట్లో 2019 అక్టోబరు లో ఒక సంవత్సరం వ్యవధి కి గాను ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని అదనం గా రెండు సంవత్సరాల కు గాను 2023 మార్చి నెల 31 వ తేదీ వరకు పొడిగించడమైంది. ప్రస్తుతం, దీనిని 1952.23 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయం తో 2026 వ సంవత్సరం మార్చి నెల 31 వ తేదీ వరకు పొడిగించడమైంది. ఈ వ్యయం లో కేంద్రం యొక్క వాటా ను నిర్భయ నిధి నుండి అందించడం జరుగుతుంది.

 

చట్టం మరియు న్యాయం మంత్రిత్వ శాఖ యొక్క న్యాయ విభాగం ద్వారా అమలు పరచే ఎఫ్‌టిఎస్‌సి లు దేశం అంతటా ఈ తరహా కోర్టుల ను ఏర్పాటు చేయడాని కి రాష్ట్ర ప్రభుత్వ వనరుల ను వృద్ధి పరచడం తో పాటుగా అత్యాచారం మరియు పోక్సో యాక్టు లకు సంబంధించిన కేసు లు శీఘ్రం గా పరిష్కారం అయ్యేందుకు పూచీ ని కూడా ఇవ్వనుంది.

 

ఈ పథకం లో ముప్ఫై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పాలుపంచుకొంటున్నాయి, 414 ప్రత్యేకించిన పోక్సో కోర్టు లు సహా 761 ఎఫ్‌టిఎస్‌సి లు ప్రస్తుతం పని చేస్తున్నాయి. ఇవి 1,95,000 కు పైగా కేసుల ను పరిష్కరించాయి. ఈ కోర్టులు లైంగిక నేరాల బాధితుల కు న్యాయం సరియైన సమయం లో అందేటట్లు గా చూడటాని కి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పాలన యంత్రాంగాలు నడుం కట్టే ప్రయాసల కు అండదండల ను అందిస్తాయి; చివరకు సుదూర ప్రాంతాలలో కూడాను దన్ను గా నిలుస్తాయి.

 

ఈ పథకం యొక్క అపేక్షిత ఫలితాల లో :

· లైంగిక పరమైన హింస ను మరియు స్త్రీ, పురుష సంబంధి హింస ను సమాప్తం చేయడం పట్ల దేశం యొక్క నిబద్ధత కు అద్దం పట్టడం.

· అత్యాచారం మరియు పోక్సో యాక్టు లకు సంబంధించిన పెండింగ్ కేసుల ను చెప్పకోదగిన స్థాయి లో తగ్గించి, తద్వారా న్యాయ వ్యవస్థ మీద భారాన్ని సడలించడం.

· సత్వర విచారణల ద్వారా లైంగిక నేరాల బాధితులు త్వరిత గతి న న్యాయాన్ని అందుకొనేటట్లుగా చూడడం.

· కేసు ల భారాన్ని సంబాళించదగినంత సంఖ్య వరకు తగ్గించడం వంటివి ఉన్నాయి అని చెప్పాలి.

 

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
India's Q3 GDP grows at 8.4%; FY24 growth pegged at 7.6%

Media Coverage

India's Q3 GDP grows at 8.4%; FY24 growth pegged at 7.6%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
West Bengal CM meets PM
March 01, 2024

The Chief Minister of West Bengal, Ms Mamta Banerjee met the Prime Minister, Shri Narendra Modi today.

The Prime Minister’s Office posted on X:

“Chief Minister of West Bengal, Ms Mamta Banerjee ji met PM Narendra Modi.”