ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) బీహార్‌లోని జాతీయ రహదారి-31, 231ల పరిధిలోగల ఖగారియా-పూర్నియా విభాగం ఉన్నతీకరణకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిర్మాణం-నిర్వహణ-బదిలీ-టోల్ (బీఓటీ-టోల్) పద్ధతిలో 4 వరుసల ప్రమాణాలకు అనుగుణంగా 143.529 కిలోమీట్లర పొడవైన ఈ ప్రాజెక్టును రూ.3936.05 కోట్ల వ్యయంతో ఉన్నతీకరిస్తారు.

రాష్ట్రంలో ఎన్‌హెచ్‌-31, 231ల పరిధిలోగల ఖగారియా-పూర్నియా విభాగం ఉన్నతీకరణ ప్రాజెక్టు పూర్తయితే ఖగారియా, భాగల్పూర్, కటీహార్, పూర్నియా జిల్లాల పరిధిలోని జనావాస ప్రాంతాల్లోగల తీవ్ర కోణీయ లోపాలు, పదునైన మలుపులు, రద్దీ వంటి సమస్యలు పరిష్కారమవుతాయి. ఇందులో భాగంగా, పూర్నియా నగరానికి 6.729 కిలోమీటర్ల పొడవున గ్రీన్‌ఫీల్డ్ బైపాస్‌ రహదారిని కూడా నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు వల్ల సగటు ప్రయాణ వేగం పెరిగి, రెండు గంటల దాకా సమయం ఆదా అవుతుంది. అలాగే, మొత్తం రహదారి భద్రత, ఇంధన సామర్థ్యం ఇనుమడించి, వాహన నిర్వహణ వ్యయం తగ్గుతుంది. తద్వారా ప్రాంతీయ రవాణాతోపాటు సామాజిక-ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది.

ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని ప్రధాన ఆర్థిక-సామాజిక-రవాణా కూడళ్ల మధ్య నిరంతర సంధానం మెరుగవుతుంది. అంతేకాకుండా ఉన్నతీకరణ ఫలితంగా పీఎం గతిశక్తి కింద ఏర్పాటైన 5 ఆర్థిక కూడళ్లు (1 టెక్స్‌టైల్ క్లస్టర్, 2 మెగా ఫుడ్ పార్కులు 2 ఫిషింగ్ సీఫుడ్ పార్కులు) సహా 11 రవాణా (4 ప్రధాన రైల్వే స్టేషన్లు, 1 విమానాశ్రయం, 4 జాతీయ రహదారులు, 2 జాతీయ రహదారులు) కూడళ్లతో అనుసంధానం వీలవుతుంది. తద్వారా బహుముఖ రవాణా సాధన ఏకీకరణ మెరుగుపడి, ఈ ప్రాంతమంతటా వస్తువులు, ప్రయాణికుల రవాణా వేగం పుంజుకుంటుంది.

కారిడార్‌ చిత్రపటం

అనుబంధం - I: ప్రాజెక్టు వివరాలు

విశిష్టతలు

వివరాలు

ప్రాజెక్టు పేరు

బీహార్‌లోని ఎన్‌హెచ్‌-31, 231ల పరిధిలోని ఖగారియా-పూర్నియా మధ్య (143.529 కి.మీ.) విభాగాన్ని బీఓటీ (టోల్) పద్ధతిలో 4 వరుసల ప్రమాణాల మేరకు ఉన్నతీకరించడం

కారిడార్

పట్నా-పూర్నియా

పొడవు

143.529

మొత్తం సివిల్‌ పనుల వ్యయం (రూ.కోట్లు)

2467.77

భూసేకరణ వ్యయం(రూ.కోట్లు)

290.16

మొత్తం మూలధన వ్యయం

3936.05

విధానం

బీఓటీ-టోల్‌

బైపాస్‌ మార్గాలు

6.729 కి.మీ. పొడవైన గ్రీన్‌ఫీల్డ్ పూర్నియా బైపాస్

సంధానిత ప్రధాన రహదారులు

జాతీయ రహదారులు-27, 13, 131ఎ, 231

రాష్ట్ర రహదారులు- ఎస్‌హెచ్‌-95, 77

సంధానిత ఆర్థిక-సామాజిక-రవాణా కూడళ్లు

విమానాశ్రయం: పూర్నియా

రైల్వే స్టేషన్లు: ఖగారియా, భాగల్పూర్, కటీహార్, పూర్నియా

ఆర్థిక కూడళ్లు: 1 వస్త్ర పరిశ్రమల సముదాయం 2 మెగా ఫుడ్ పార్కులు, 2 చేపలు/సముద్ర ఆహార పార్కులు

సంధానిత ప్రధాన నగరాలు, పట్టణాలు

ఖగారియా, భాగల్పూర్, కటిహార్, పూర్నియా

ఉపాధి సృష్టి సామర్థ్యం

32.59 లక్షల (ప్రత్యక్ష), 40.55 లక్షల (పరోక్ష) పని దినాలు

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Jumbo Indian contingent comprising 768 athletes, support staff and officials for Asian Games

Media Coverage

Jumbo Indian contingent comprising 768 athletes, support staff and officials for Asian Games
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 సెప్టెంబర్ 2026
September 04, 2026

Make in India, Power India, Play for India: Multi-Sector Momentum Under PM Modi’s Leadership