ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బళ్లారి-గుంతకల్ విభాగం మధ్య రూ. 1,264 కోట్ల అంచనా వ్యయంతో 3, 4వ రైల్వే లైన్ నిర్మాణానికి నేడు ఆమోదం తెలిపింది.
సమగ్ర ప్రణాళిక, భాగస్వాముల సంప్రదింపుల ద్వారా బహుళ రవాణా అనుసంధానాన్ని, లాజిస్టిక్ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో పీఎం-గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజల రాకపోకలతో పాటు సరుకులు, సేవల రవాణాకు సులభతరమైన, ఆటంకాలు లేని అనుసంధానం అందుబాటులోకి రానుంది.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని 3 జిల్లాల మీదుగా సాగే ఈ ప్రాజెక్టు ద్వారా భారతీయ రైల్వే ప్రస్తుత వ్యవస్త దాదాపు 46 కిలోమీటర్ల మేర పెరగనుంది.
ఈ ప్రతిపాదిత మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టు వల్ల సుమారు ఏడు లక్షల జనాభా ఉన్న దాదాపు 99 గ్రామాలకు రవాణా సదుపాయాలు మెరుగుపడనున్నాయి.
రైల్వే సామర్థ్యం పెరగడం ద్వారా బళ్లారి కోట, శ్రీ కుమార స్వామి దేవాలయం వంటి దేశంలోని అనేక ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ఇనుప ఖనిజం, డోలమైట్, సున్నపురాయి, ఇనుము, ఉక్కు, బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాలు వంటి ప్రధాన సరుకుల రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. రైల్వే సామర్థ్యం పెరగడం వల్ల ఏటా అదనంగా 16.22 మిలియన్ టన్నుల సరుకుల రవాణా సాధ్యమవుతుంది. రైల్వే రవాణా పర్యావరణహితమైనదే కాకుండా ఇంధన సామర్థ్యం కలిగినది కాబట్టి, ఇది దేశ వాతావరణ లక్ష్యాలను సాధించడంలో, రవాణా వ్యయాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. దీనివల్ల 1.32 కోట్ల లీటర్ల మేరకు చమురు దిగుమతులు తగ్గడంతో పాటు 6.67 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది 27 లక్షల మొక్కలను నాటడంతో సమానం.
లైన్ సామర్థ్యం పెరగడం వల్ల రైళ్ల రాకపోకల వేగం పెరిగి, భారతీయ రైల్వే పనితీరు మెరుగవడమే కాకుండా సేవల విశ్వసనీయత కూడా పెరుగుతుంది. ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రతిపాదన రైల్వే కార్యకలాపాలను సులభతరం చేసి, ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి ద్వారా ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి, వారిని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవ భారత్ దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుంది.
The Cabinet’s approval for the 3rd and 4th railway lines on the Ballari-Guntakal section will strengthen connectivity and logistics across Karnataka and Andhra Pradesh.
— Narendra Modi (@narendramodi) July 24, 2026
It will enhance passenger mobility and support the efficient movement of key commodities. It will also improve…
ಬಳ್ಳಾರಿ-ಗುಂತಕಲ್ ವಿಭಾಗದಲ್ಲಿ 3ನೇ ಮತ್ತು 4ನೇ ರೈಲು ಮಾರ್ಗಗಳ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಸಂಪುಟ ನೀಡಿರುವ ಅನುಮೋದನೆಯು, ಕರ್ನಾಟಕ ಮತ್ತು ಆಂಧ್ರಪ್ರದೇಶ ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ಸಂಪರ್ಕ ಹಾಗೂ ಸಾಗಾಣಿಕೆ ಸಾಮರ್ಥ್ಯವನ್ನು ಬಲಪಡಿಸಲಿದೆ.
— Narendra Modi (@narendramodi) July 24, 2026
ಇದು ಪ್ರಯಾಣಿಕರ ಸುಗಮ ಸಂಚಾರವನ್ನು ಹೆಚ್ಚಿಸಲಿದ್ದು, ಪ್ರಮುಖ ಉತ್ಪನ್ನಗಳ ಪರಿಣಾಮಕಾರಿ ಸಾಗಣೆಗೆ ಬೆಂಬಲ ನೀಡಲಿದೆ.…
బళ్లారి-గుంతకల్ విభాగం మధ్య 3, 4వ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అనుసంధానం మరియు సరుకు రవాణా సామర్థ్యం బలోపేతం అవుతుంది.
— Narendra Modi (@narendramodi) July 24, 2026
ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయాణికుల రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు, కీలక వస్తువుల…


