విభిన్న రంగాలలో ప్రాంతీయ సహకారాన్ని మరింత బల పరచడాన్ని గురించి చర్చించిన ప్రధాన మంత్రి
బిమ్స్ టెక్ కు భారతదేశ నిబద్ధత ను పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి
త్వరలో జరగనున్న బిమ్స్ టెక్ శిఖరాగ్ర సమావేశానికి గాను థాయిలాండ్ కు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపిన ప్రధాన మంత్రి

ది బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్  ఫర్ మల్టీ-సెక్టరల్ టెక్నికల్ ఎండ్ ఇకనామిక్ కోఆపరేషన్ (బిఐఎమ్ఎస్‌టిఇసి- ‘బిమ్స్ టెక్’)  సభ్య దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజున సమావేశమయ్యారు.

 

సంధానం, ఇంధనం, వాణిజ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, విజ్ఞాన శాస్త్రం, భద్రత, ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా వివిధ రంగాలలో ప్రాంతీయ సహకారాన్ని మరింతగా బలోపేతం చేసుకోవడం అనే అంశంపై మంత్రుల బృందంతో ప్రధాన మంత్రి జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి.  ఆర్థిక, సామాజిక వృద్ధికి బిమ్స్ టెక్ ఒక చోదక శక్తి పాత్ర ను పోషించవలసి ఉందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.

 

శాంతియుతమైన, సౌభాగ్యవంతమైన, ఆటుపోటులకు తట్టుకొని నిలువగలిగిన, సురక్షితమైన బిమ్స్ టెక్ ఆవిష్కారానికి భారతదేశం కట్టుబడి ఉంటుందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.  భారతదేశం అనుసరిస్తున్న ‘పొరుగు దేశాలకు ప్రాధాన్యం’, ‘లుక్ ఈస్ట్ విధానా’లతో పాటు సెక్యూరిటీ ఎండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ (ఎస్ఎజిఎఆర్ - ‘సాగర్’ ) విజన్ లో బిమ్స్ టెక్ కు ఉన్న ప్రాధాన్యాన్ని గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

 

సెప్టెంబరు లో జరగనున్న బిమ్స్ టెక్ శిఖరాగ్ర సమావేశానికి గాను థాయిలాండ్ కు భారతదేశం పూర్తి మద్ధతు ను అందిస్తుందని ప్రధాన మంత్రి తెలిపారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India on track to becoming third-largest economy by FY31: S&P report

Media Coverage

India on track to becoming third-largest economy by FY31: S&P report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 సెప్టెంబర్ 2024
September 19, 2024

India Appreciates the Many Transformative Milestones Under PM Modi’s Visionary Leadership