Budget belied the apprehensions of experts regarding new taxes: PM
Earlier, Budget was just bahi-khata of the vote-bank calculations, now the nation has changed approach: PM
Budget has taken many steps for the empowerment of the farmers: PM
Transformation for AtmaNirbharta is a tribute to all the freedom fighters: PM

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని గోర‌ఖ్ పుర్ లో గ‌ల చౌరీ చౌరా లో ‘చౌరీ చౌరా’ శ‌త వార్షికోత్స‌వాల‌ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర ‌మోదీ గురువారం నాడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించారు.  ఈ రోజు తో దేశ స్వాతంత్య్ర పోరాటం లో ఒక ప్ర‌తిష్టాత్మ‌క‌ ఘ‌ట‌న గా పేరు తెచ్చుకొన్న ‘చౌరీ చౌరా’ ఉదంతానికి 100 సంవ‌త్స‌రాలు అవుతున్నాయి.  ‘చౌరీ చౌరా’ శ‌త వార్షిక ఉత్స‌వానికి అంకితం చేసిన ఒక త‌పాలా బిళ్ళ‌ ను కూడా ప్ర‌ధాన మంత్రి ఇదే సంద‌ర్భం లో ఆవిష్క‌రించారు.  ఈ కార్య‌క్ర‌మం లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ‌మ‌తి ఆనందీబెన్ ప‌టేల్‌ తో పాటు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ యోగి ఆదిత్య‌నాథ్ కూడా పాల్గొన్నారు.

సాహ‌సికులైన అమ‌ర‌వీరుల‌ కు ప్ర‌ధాన మంత్రి వంద‌నాన్ని ఆచ‌రిస్తూ, చౌరీ-చౌరా లో జ‌రిగిన త్యాగం దేశ స్వాతంత్య్ర స‌మ‌రానికి ఒక కొత్త దిశ‌ ను అందించింద‌ని పేర్కొన్నారు.  వందేళ్ళ కింద‌ట చౌరీ చౌరా లో జ‌రిగిన సంఘ‌ట‌న ఓ గృహ ద‌హ‌నకాండ మాత్ర‌మే కాదు, అది అంత‌కంటే విస్తృత‌మైన సందేశాన్ని అందించింది అని ఆయన అన్నారు.  ఏ ప‌రిస్థితుల లో ఆస్తి ద‌హ‌నం చోటు చేసుకొందో, దానికి కార‌ణాలు ఏమేమిటో అనే అంశాలకు కూడా అంతే ప్రాధాన్యం ఉందని ఆయ‌న అన్నారు.  మ‌న దేశ చ‌రిత్ర‌ లో చౌరీ చౌరా తాలూకు చ‌రిత్రాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌ కు త‌గినంత ప్రాముఖ్యాన్ని ప్ర‌స్తుతం క‌ట్ట‌బెట్ట‌డం జ‌రుగుతోంది అని అయన అన్నారు.  ఈ రోజు నుంచి మొద‌లుపెట్టి చౌరీ చౌరా తో పాటే ప్ర‌తి ఒక్క ప‌ల్లె లోనూ ఏడాది పొడ‌వునా నిర్వ‌హించుకోబోయే కార్య‌క్ర‌మాల లో వీరోచిత త్యాగాల ను స్మ‌రించుకోవ‌డం జ‌రుగుతుంది అని ఆయ‌న అన్నారు.  దేశం త‌న 75వ స్వాతంత్య్ర సంవ‌త్స‌రం లో అడుగుపెడుతున్న‌టువంటి పండుగ వేళ‌ లో ఈ త‌ర‌హా ఉత్స‌వాన్ని జ‌రుపుకోవ‌డం దీనిని మ‌రింత సంద‌ర్భోచితం గా మార్చుతుంది అని ఆయ‌న అన్నారు.  చౌరీ-చౌరా అమ‌రుల ను గురించిన చ‌ర్చ జరగకపోవ‌డం ప‌ట్ల ఆయ‌న విచారాన్ని వ్య‌క్తం చేశారు.  చరిత్ర పుట‌ల‌ లో అమ‌ర‌వీరులు పెద్ద‌గా ప్ర‌స్తావ‌న‌ కు వ‌చ్చి ఉండ‌క‌పోవ‌చ్చు; కానీ, స్వాతంత్య్రం కోసం వారు చిందించిన ర‌క్తం దేశం తాలూకు మ‌ట్టి లో కలసిపోయి ఉంది అని ఆయ‌న అన్నారు.

బాబా రాఘ‌వ్‌ దాస్, మ‌హామ‌న మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వీయ గార్ల కృషి ని స్మ‌రించుకోవ‌ల‌సిందిగా ప్ర‌జ‌ల‌ కు ప్ర‌ధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.  వారు ఉభయుల కృషి ఫ‌లితం గానే, ఈ ప్ర‌త్యేక‌మైన‌టువంటి రోజు న దాదాపుగా 150 మంది స్వాతంత్య్ర యోధుల ను ఉరిశిక్ష బారి నుండి కాపాడ‌డం జ‌రిగింద‌న్నారు.  ఈ ప్ర‌చార ఉద్య‌మం లో విద్యార్థులు కూడా పాలుపంచుకొంటున్నందుకు ఆయ‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.  ఇది స్వాతంత్య్ర సంగ్రామం తాలూకు వెలుగు లోకి రాన‌టువంటి అనేక అంశాల ప‌ట్ల వారిలో చైత‌న్యాన్ని పెంపొందింప చేస్తుంది అని ఆయ‌న అన్నారు.  స్వాతంత్య్రాన్ని దక్కించుకొని 75 సంవ‌త్స‌రాల కాలం పూర్తి అయిన సంద‌ర్భాన్ని గురించి, స్వాతంత్య్ర స‌మర వీరుల లో అంత‌గా వెలుగు లోకి రాన‌టువంటి వారిని గురించి తెలియ‌జేసే ఒక పుస్త‌కాన్ని రాయండి అంటూ యువ ర‌చ‌యిత‌ల‌ ను విద్య మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది అని ఆయ‌న తెలిపారు.  మ‌న స్వాతంత్య్ర యోధుల‌ కు ఒక నివాళి గా స్థానిక క‌ళ‌ల‌ ను, స్థానిక సంస్కృతి ని జతపరుస్తూ కార్య‌క్ర‌మాల ను ఏర్పాటు చేసినందుకు గాను ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాల‌ ను ఆయ‌న ప్ర‌శంసించారు.

బానిసత్వ సంకెళ్ల ను విరగగొట్టిన సామూహిక శ‌క్తే భార‌త‌దేశాన్ని ప్ర‌పంచంలో కెల్లా అత్యంత ఘ‌న‌మైన శ‌క్తి గా కూడా త‌యారు చేస్తుంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఈ సామూహిక శ‌క్తే ‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ ప్ర‌చార ఉద్య‌మానికి ఆధారం గా ఉంది అని అయన అన్నారు.  ఈ క‌రోనా కాలం లో, 150 కి పైగా దేశాల పౌరుల‌ కు సాయ‌ప‌డ‌టానికి గాను అత్య‌వ‌స‌ర మందుల‌ ను భార‌త‌దేశం అందించింది అని ఆయ‌న అన్నారు.  మ‌నుషుల ప్రాణాల‌ ను కాపాడ‌టానికి అనేక దేశాల‌ కు భార‌త‌దేశం టీకా మందును స‌ర‌ఫ‌రా చేస్తోంది, అలా టీకామందును సరఫరా చేసినందుకు మ‌న స్వాతంత్య్ర యోధులు గ‌ర్వ‌ప‌డ‌తారు అని ఆయ‌న అన్నారు.

ఇటీవ‌లి బ‌డ్జెటు ను గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ,  మ‌హ‌మ్మారి రువ్విన స‌వాళ్ళ‌ ను త‌ట్టుకోవ‌డానికి జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌ కు  బ‌డ్జెటు ఒక కొత్త ఊతాన్ని ఇవ్వ‌గ‌లుగుతుంది అని పేర్కొన్నారు.  సామాన్య పౌరుల‌పై కొత్త ప‌న్నుల తాలూకు భారం ప‌డుతుంద‌ంటూ చాలా మంది నిపుణులు వ్య‌క్తం చేసిన భ‌యాందోళ‌న‌ల‌ ను బ‌డ్జెటు వ‌మ్ము చేసింద‌ని ఆయ‌న అన్నారు.  దేశం శ‌ర‌వేగం గా వృద్ధి చెంద‌డానికి మ‌రింత ఎక్కువ గా ఖ‌ర్చు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిందని ఆయ‌న చెప్పారు.  ఈ వ్య‌యం ర‌హ‌దారులు, వంతెన‌లు, రైలు మార్గాలు, కొత్త రైళ్ళు, కొత్త బ‌స్సుల వంటి మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కోసం, బ‌జారులు, మండీల‌ తో సంధానం కోసమూను అని ఆయన అన్నారు.  బ‌డ్జెటు ఉత్త‌మ‌మైన విద్య‌ కు, మ‌న యువ‌తీ యువ‌కుల‌ కు మెరుగైన అవ‌కాశాల క‌ల్ప‌న‌ కు  బాట‌ ను పరచింద‌న్నారు.  ఈ కార్య‌క‌లాపాలు ల‌క్ష‌ల కొద్దీ యువ‌త కు ఉపాధి ని క‌ల్పిస్తాయ‌న్నారు.  అంత‌క్రితం, బ‌డ్జెటు అంటే ఎప్పటికీ పూర్తి చేయనటువంటి ప‌థ‌కాల ను ప్ర‌క‌టించ‌డ‌మే అని ఆయన అన్నారు.  ‘‘బ‌డ్జెటు వోటు బ్యాంకు లెక్క‌ల ఖాతా (బహీ-ఖాతా) గా మారిపోయింది.  ప్ర‌స్తుతం దేశం ఒక కొత్త ప‌న్నా ను తిప్పి, ఈ వైఖ‌రి ని మార్చివేసింది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  

మ‌హ‌మ్మారి ని భార‌త‌దేశం సంబాళించిన తీరు ను చూసి స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు ల‌భించాయి, దీనితో దేశం చిన్న ప‌ట్ట‌ణాల లో, గ్రామాల లో వైద్య చికిత్స ప‌ర‌మైన స‌దుపాయాల‌ ను బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తోంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఆరోగ్య రంగాని కి కేటాయింపులు జ‌రిపే విష‌యం లో బ‌డ్జెటు ను పెద్ద ఎత్తు న పెంచ‌డ‌ం జరిగింది అని ఆయన చెప్పారు.  ఆధునిక ప‌రీక్షల కేంద్రాల‌ ను ఏకం గా జిల్లా స్థాయి లోనే అభివృద్ధి ప‌ర‌చ‌డం జ‌రుగుతోంది అని ఆయ‌న అన్నారు.

దేశ ప్ర‌గ‌తి కి ఆధారం రైతులే అని శ్రీ న‌రేంద్ర ‌మోదీ పేర్కొంటూ, వారి సంక్షేమం కోసం గ‌డ‌చిన ఆరు సంవ‌త్స‌రాల లో జ‌రిగిన కృషి ని గురించి తెలియ‌జేశారు.  మ‌హ‌మ్మారి తాలూకు ఇబ్బందులు ఎదురైన‌ప్ప‌టికీ కూడా, రైతులు రికార్డు స్థాయి లో ఉత్ప‌త్తి ని సాధించారు అని ఆయ‌న అన్నారు.  రైతుల సాధికారిత కోసం బ‌డ్జెటు అనేక చ‌ర్య‌ల ను తీసుకొంది.  రైతులు పంట‌ల ను విక్ర‌యించ‌డం లో సౌల‌భ్యాని కి గాను ఒక వేయి మండీల‌ను జాతీయ వ్యవసాయ బజారు ‘ఇ-నామ్’(e-NAM) తో ముడిపెట్ట‌డం జ‌రుగుతోంద‌న్నారు.  

గ్రామీణ మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న నిధి ని 40 వేల కోట్ల రూపాయ‌ల‌ కు పెంచ‌డ‌మైంద‌ని తెలిపారు.  ఈ చ‌ర్య‌లు రైతుల‌ ను స్వ‌యంస‌మృద్ధం గా తీర్చిదిద్ది, వ్య‌వ‌సాయాన్ని గిట్టుబాటు అయ్యేట‌ట్లుగా మార్చుతాయ‌న్నారు.  ‘స్వామిత్వ ప‌థ‌కం’ పల్లె ప్రజలకు భూమి యాజ‌మాన్యం తాలూకు ద‌స్తావేజు ప‌త్రాన్ని, నివాస సంప‌త్తి తాలూకు దస్తావేజు ప‌త్రాన్ని  అందిస్తుంద‌న్నారు.  స‌రైన ద‌స్తావేజు ప‌త్రాలు ఉన్నాయి అంటే గనక అప్పుడు ఆస్తి కి చ‌క్క‌టి ధ‌ర ల‌భించ‌డానికి వీల‌వుతుంది, అంతేకాక కుటుంబాలు బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకోవ‌డం లో ఈ ప‌త్రాలు సాయ‌ప‌డ‌తాయి, భూమి కూడా ఆక్ర‌మ‌ణ‌దారుల బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉంటుంది అంటూ ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

ఈ చ‌ర్య‌ లు అన్నీ కూడా మిల్లు లు మూత‌ప‌డి, రోడ్లు పాడై, ఆసుపత్రులు ఖాయిలా ప‌డి న‌ష్ట‌ాల పాలబడ్డ గోర‌ఖ్ పుర్ కు కూడా ల‌బ్ధి ని చేకూర్చేవే అని ప్ర‌ధాన ‌మంత్రి అన్నారు.  ప్ర‌స్తుతం స్థానికం గా ఉన్న‌టువంటి ఎరువుల కార్ఖానా ను తిరిగి మొద‌లుపెట్ట‌డం జ‌రిగింది, ఇది రైతుల‌ కు, యువ‌త‌ కు మేలు చేస్తుంది అని ఆయన చెప్పారు.  ఈ న‌గ‌రం ఒక ఎఐఐఎమ్ఎస్ ను అందుకోబోతోంద‌న్నారు.  ఇక్క‌డి వైద్య క‌ళాశాల వేల కొద్దీ బాల‌ల ప్రాణాల‌ ను ర‌క్షిస్తోంద‌న్నారు.  దేవ‌రియా, కుశీ న‌గ‌ర్‌, బ‌స్తీ మ‌హారాజ్ న‌గ‌ర్‌, సిద్ధార్థ్ న‌గ‌ర్‌  లు కొత్త‌గా వైద్య క‌ళాశాల‌ల‌ ను అందుకొంటున్నాయి అని ఆయ‌న చెప్పారు.  ఈ ప్రాంతం లో నాలుగు దోవ‌ల‌, ఆరు దోవ‌ల రోడ్ల నిర్మాణం జరుగుతుండడంతో ఈ ప్రాంతం మెరుగైన సంధానం సౌక‌ర్యాన్ని అందిపుచ్చుకోబోతోంది, 8 న‌గ‌రాల‌ కు విమాన సేవ‌ల ను గోర‌ఖ్ పుర్ నుంచి మొదలుపెట్టడం జరిగింది అని శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌స్తావించారు.  త్వ‌ర‌లో రాబోయే కు‌శీ న‌గ‌ర్‌ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప‌ర్య‌ట‌న  రంగాన్ని పెంపు చేస్తుంద‌న్నారు.  ‘‘ ‘ఆత్మ‌నిర్భ‌ర‌త’ కై ఉద్దేశించిన ఈ మార్పు  స్వాతంత్య్ర యోధులు అంద‌రికీ ఒక నివాళి ’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

Click here to read PM's speech

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties

Media Coverage

India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 14 జనవరి 2026
January 14, 2026

Viksit Bharat Rising: Economic Boom, Tech Dominance, and Cultural Renaissance in 2025 Under the Leadership of PM Modi